Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్యారిస్ ‘ఏఐ ఏక్షన్ సమిట్’ లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ముగింపు ప్రసంగం

Concluding Address by PM at the AI Action Summit, Paris


నేటి చర్చల వల్ల ఒక విషయం తేటతెల్లమయ్యింది – సమావేశాల్లో పాల్గొన్నభాగస్వాములందరూ ఒకే ఆశయాన్ని, ఒకే లక్ష్యాన్నీ కలిగి ఉన్నారు.

 

“ఏఐ ఫౌండేషన్”, “కౌన్సిల్ ఫర్ సస్టెయినబుల్ ఏఐ” లను ఏర్పాటు చేయాలన్న నిర్ణయాన్ని నేను స్వాగతిస్తున్నాను. ఈ పథకాలను ప్రవేశపెడుతున్నందుకు ఫ్రాన్స్ దేశానికి, నా ప్రియ మిత్రుడు, అధ్యక్షుడు మేక్రాన్ కు అభినందనలు తెలియజేస్తున్నాను.

 

‘గ్లోబల్ పార్టనర్షిప్ ఫర్ ఏఐ’ ను సిసలైన అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్ళాలి. అభివృద్ధి చెందుతున్న దేశాల ఆశలూ ఆకాంక్షలూ ప్రాముఖ్యాలూ అవసరాలను ఈ భాగస్వామ్యం పరిగణనలోకి తీసుకోవాలి .

 

 

ఏక్షన్ సమిట్ ద్వారా సాధించిన ప్రగతిని మరింత ముందుకు నడిపేందుకు తదుపరి సమావేశాల ఆతిథ్య బాధ్యతను భారత్ సంతోషంగా స్వీకరిస్తుంది.

 

 ధన్యవాదాలు.

 

***