Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టం 2019ని గురించి ప్ర‌ధాన మంత్రి వ‌ద్ద నుండి ముఖ్య‌మైన సందేశం


పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టం భార‌త‌దేశం లో ఏ ధర్మాని కి చెందిన పౌరుడి ని అయినా/పౌరురాలి ని అయినా ప్ర‌భావితం చేయ‌దు అంటూ దేశ ప్ర‌జ‌ల కు ప్ర‌ధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ హామీ ని ఇచ్చారు. ఆయన వరుస ట్వీట్ ల లో దిగువ విధం గా పేర్కొన్నారు.

‘‘పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టం (సిటిజన్ శిప్ అమెండ్ మెంట్ యాక్ట్ – సిఎఎ) పట్ల హింసాత్మ‌క నిర‌స‌న‌లు చెల‌రేగ‌డం తీవ్ర దుఃఖ‌దాయ‌క‌మే కాక దుర‌దృష్ట‌క‌రం కూడాను.

వాదోప‌వాదాలు, చర్చించడం మ‌రియు అభిప్రాయ భేదాన్ని ప్రకటించడం అనేవి ప్ర‌జాస్వామ్యం లో అత్య‌వ‌స‌ర‌మైన అంగాలు. అంతేగాని, సార్వ‌త్రిక ఆస్తి ని ధ్వంసం చేయ‌డం మ‌రియు సాధార‌ణ జ‌న జీవ‌నాని కి అంత‌రాయం క‌లిగించ‌డం ఎన్న‌టికీ మ‌న మర్యాద లో ఒక భాగం కాజాలదు.

పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టం, 2019ని పార్ల‌మెంటు ఉభ‌య స‌భ‌ల లో విశేష‌మైన మ‌ద్ధ‌తు తో ఆమోదించ‌డం జరిగింది. ఈ ఆమోదాని కి రాజ‌కీయ ప‌క్షాలు మ‌రియు ఎంపీ ల స‌మ‌ర్ధ‌న ల‌భించింది. ఈ చ‌ట్టం సోద‌ర భావం, క‌రుణ‌, స‌ద్భావ‌న‌, ఆమోదం ల వంటి శ‌తాబ్దాల చ‌రిత్ర క‌లిగిన భార‌త‌దేశ‌పు సంస్కృతి ని ప్ర‌తిబింబిస్తోంది.

సిఎఎ భార‌త‌దేశం లో ఏ దర్మానికి చెందిన ఏ ఒక్క‌ పౌరుడి ని గాని/ ఏ ఒక్క పౌరురాలి ని గాని ప్ర‌భావితం చేయ‌దు అని నా సాటి భార‌త ప్ర‌జ‌ల కు సందిగ్ధత లేనటువంటి హామీ ని నేను ఇవ్వ‌ద‌ల‌చుకొన్నాను. ఈ చ‌ట్టం విష‌యం లో భార‌త‌దేశం లోని ఏ ఒక్క‌రూ ఆందోళ‌న చెంద‌డానికి ఇందులో ఏమీ లేదు. ఈ చ‌ట్టం దేశాని కి వెలుప‌ల సంవత్సరాల త‌ర‌బ‌డి పీడ‌న‌ కు లోనైన వారు మ‌రియు భార‌త‌దేశం మిన‌హా త‌ల‌ దాచుకోవ‌డాని కి మ‌రే ప్ర‌దేశం లేన‌టువంటి వారి కి మాత్ర‌మే ఉద్దేశించినటువంటిది.

భార‌తదేశం అభివృద్ధి కోసం మరియు భారతదేశం లోని ప్రతి ఒక్కరి కి ప్రత్యేకించి పేదలు, అణగారిన వర్గాలు మరియు ఆదరణ కు నోచుకోని వర్గాల వారి కి సాధికారిత ను అందించడం కోసం క‌ల‌సిక‌ట్టుగా మ‌నమంతా కృషి చేయ‌డమే ప్రస్తుత తక్షణ అవ‌స‌రం.

మ‌న‌లను విభజించడం కోసం, క‌ల్లోలాన్ని సృష్టించడం కోసం స్వార్ధ‌ప‌ర‌త్వం తో కూడిన స‌మూహాల కు మ‌నం తావు ను ఇవ్వ‌రాదు.

ఇది సౌభ్రాతృత్వాన్ని, శాంతి ని మ‌రియు ఏక‌త‌ ను ప‌రిర‌క్షించ‌వ‌ల‌సిన‌ అటువంటి త‌రుణం. వ‌దంతుల మరియు అసత్యాల వల‌ లో చిక్కుకోవ‌డం మానివేయండి అనేదే ప్ర‌తి ఒక్క‌రి కీ నేను విజ్ఞప్తి ని చేస్తున్నాను.’’