Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పోషణ్పఖ్ వాడా సఫలం అవ్వాలని ఆకాంక్షించిన ప్రధాన మంత్రి


ఈ రోజు న మొదలవుతున్న వార్షిక పోషణ్ పఖ్ వాడా లో శ్రీ అన్న (చిరుధాన్యాలు) కు ప్రాధాన్యాన్ని ఇస్తున్నందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

 

కేంద్ర మంత్రి శ్రీమతి స్మృతి జడ్. ఇరానీ కి ప్రధాన మంత్రి ప్రత్యుత్తరాన్ని ఇస్తూ ఈ కింది విధం గా ట్వీట్ చేశారు.

‘‘సరి అయినటువంటి పోషణ విజ్ఞ‌ానం పట్ల అవగాహన ను వ్యాప్తి చేయడం లో మరియు పోషకాహార లోపం సమస్య ను తొలగించడం లో పోషణ్ పఖ్ వాడా సాయపడుగాక. ఆరోగ్యకరమైనటువంటి జీవనాన్ని పెంపొందింపచేయడం లో ప్రధానమైన పాత్ర ను పోషించగలిగిన శ్రీ అన్న (చిరుధాన్యాలు) కు ప్రాధాన్యాన్ని ఇస్తుండడం చూసి సంతోషం కలుగుతున్నది.’’

 

 

***

DS/AK