పోలార్ ఉపగ్రహ వాహక నౌక (పి ఎస్ ఎల్ వి) కొనసాగింపు (ఫేజ్ 6) కార్యక్రమానికీ మరియు ఈ కార్యక్రమం క్రింద 30 పి ఎస్ ఎల్ వి ఆపరేషనల్ ఫ్లైట్స్ కు నిధులు మంజూరుకు – ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది.
ఉపగ్రహ ప్రయోగానికి అవసరమైన భూమి పరిశీలన, నావిగేషన్ మరియు అంతరిక్ష శాస్త్రాలు ఈ కార్యక్రమం కిందకు వస్తాయి. భారతీయ పరిశ్రమ రంగంలో ఉత్పత్తి కొనసాగింపుకు కూడా ఇది దోహదపడుతుంది.
30 పి ఎస్ ఎల్ వి వాహక నౌకల వ్యయం, అవసరమైన సదుపాయాల కల్పన, కార్యక్రమ యాజమాన్యం, ప్రయోగ ప్రచారం ఖర్చులతో సహా – ఈ కార్యక్రమానికి మొత్తం రూ.6131.00 కోట్లు అవసరమౌతాయి.
ప్రధాన ప్రభావం :
పి ఎస్ ఎల్ వి నిర్వహణ ద్వారా – ఉపగ్రహ ప్రయోగ సామర్థ్యంలోనూ, మరియు భూమి పరిశీలన, విపత్తు యాజమాన్యం, నావిగేషన్ మరియు అంతరిక్ష శాస్త్రాలు మొదలైన విషయాలలో – దేశం స్వయం సమృద్ధి చెందుతుంది. జాతీయ అవసరాలకోసం ఇటువంటి ఉపగ్రహాల ప్రయోగానికి – ఈ పి ఎస్ ఎల్ వి కొనసాగింపు కార్యక్రమం – సామర్ధ్యం నిలబెట్టుకోడానికీ, స్వయం సమృద్ధి కి దోహదపడుతుంది.
భారతీయ పరిశ్రమల రంగం గరిష్ట భాగస్వామ్యం తో ఏడాదికి ఎనిమిది దాకా ఉపగ్రహాల ప్రయోగానికి గల డిమాండును – పి ఎస్ ఎల్ వి కొనసాగింపు కార్యక్రమం – ఫేజ్ 6 చేరుకుంటుంది. 2019-2024 మధ్య కాలంలో ఈ వాహక నౌకలన్నీ పూర్తవుతాయి.
భూమి పరిశీలన, విపత్తు యాజమాన్యం, నావిగేషన్ మరియు అంతరిక్ష శాస్త్రాలు మొదలైన – ఉపగ్రహ ప్రయోగ అవసరాలను – ఈ కార్యక్రమం నెరవేరుస్తుంది. భారతీయ పరిశ్రమ రంగంలో ఉత్పత్తి కొనసాగింపుకు కూడా ఇది దోహదపడుతుంది.
పి ఎస్ ఎల్ వి కొనసాగింపు కార్యక్రమం ప్రారంభంలో 2008 లో మంజూరయ్యింది. ఇంతవరకు నాలుగు దశలు పూర్తయ్యాయి. ఐదవ దశ 2019-20 ఆర్ధిక సంవత్సరం రెండో త్రైమాసికానికల్లా పూర్తి అవుతుందని భావిస్తున్నారు. .
నేపధ్యం :
సూర్య సమస్థితి పోలార్ కక్ష్య (ఎస్ ఎస్ పి ఓ), భౌగోళిక సమస్థితి ట్రాన్స్ ఫర్ కక్ష్య (జి టి ఓ), మరియు తక్కువ వంపులో సమీప భూ కక్ష్య (ఎల్ ఏ ఓ) మిషన్లకు చెందిన బహుముఖ వాహక నౌకగా పి ఎస్ ఎల్ వి పేరుగాంచింది. ఇటీవల 2018 ఏప్రిల్ 12వ తేదీన విజయవంతమైన పి ఎస్ ఎల్ వి – సి 41 ప్రయోగంతో, పి ఎస్ ఎల్ వి – మూడు అభివృద్ధి మరియు 43 ఆపరేషనల్ నౌకలను పూర్తిచేసింది. మరియు చివరి 41 నౌకలు విజయవంతమయ్యాయి. ఉత్పత్తి సామర్ధ్యం గల, వాణిజ్యపరమైన ప్రయోగ అవకాశాలను సైతం వేగంగా అందిపుచ్చుకుంటూ – జాతీయ ఉపగ్రహాలకు పి ఎస్ ఎల్ వి ఒక ప్రధానమైన వాహక నౌకగా పేరుగాంచింది.
*****