Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పోలాండ్ ప్ర‌ధానితో ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర మోదీ భేటీ

పోలాండ్ ప్ర‌ధానితో ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర మోదీ భేటీ


పోలాండ్ ప్ర‌ధాని హిజ్‌ ఎక్స్ లెన్సీ శ్రీ డోనాల్డ్ ట‌స్క్ తో ప్ర‌ధాని శ్రీన‌రేంద్ర మోదీ నేడు వార్సాలో స‌మావేశ‌మ‌య్యారు. 

ఫెడ‌ర‌ల్ ఛాన్స‌ల‌రీని చేరుకున్న ప్ర‌ధానికి పోలాండ్ ప్ర‌ధాని శ్రీ డోనాల్డ్ ట‌స్క్ సంప్ర‌దాయ‌బ‌ద్దంగా సాద‌ర స్వాగ‌తం ప‌లికారు. 

 

ఇరువురు నేతలు పరిమిత,  ప్రతినిధి స్థాయిలో చర్చించుకున్నారు. భారతదేశం-పోలాండ్ సంబంధాల ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని, ఈ సంబంధాన్ని ‘వ్యూహాత్మక భాగస్వామ్యంగా అభివృద్ధి చేయాలని ఇరు దేశాల‌ నాయకులు నిర్ణయించారు. వాణిజ్యం, పెట్టుబడులు, శాస్త్ర సాంకేతిక రంగం, రక్షణ – భద్రత, సాంస్కృతిక సహకారం, ప్రజల మధ్య సంబంధాలతో సహా ద్వైపాక్షిక భాగస్వామ్యంలోని వివిధ అంశాలపై వారు విస్తృతంగా చర్చించారు. ఫుడ్ ప్రాసెసింగ్, ప‌ట్ట‌ణ మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న‌, నీరు, ఘ‌న వ్య‌ర్థాల నిర్వ‌హ‌ణ‌, విద్యుత్ వాహ‌నాలు,  గ్రీన్ హైడ్రోజన్, పునరుత్పాదక ఇంధనం, కృత్రిమ మేధ‌, గ‌నులు, స్వ‌చ్ఛ సాంకేతిక‌త‌లు వంటి రంగాలలో ఆర్థిక, వ్యాపార సహకారం కోసం గణనీయమైన అవకాశాలు అందుబాటులో ఉన్నాయని ఇద్దరు నేతలు అంగీకరించారు.