Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పేరిస్ లో భారతీయ సముదాయం తో సమావేశమైన ప్రధాన మంత్రి

పేరిస్ లో భారతీయ సముదాయం తో సమావేశమైన ప్రధాన మంత్రి


భారతీయ సముదాయాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పేరిస్ లోని లా సీన్ మ్యూజికల్ లో ప్రసంగించారు.

బహుముఖీనం అయినటువంటి భారతదేశం-ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యం 25 వ వార్షికోత్సవాన్ని జరుపుకొంటున్న సంగతి ని ప్రధాన మంత్రి తన ప్రసంగం లో ప్రముఖం గా ప్రస్తావించారు.

ఫ్రాన్స్ లోని మార్సేయ్ లో క్రొత్త గా వాణిజ్య దూత కార్యాలయాన్ని తెరవనున్నట్లు కూడా ప్రధాన మంత్రి ప్రకటించారు.

భారతదేశం – ఫ్రాన్స్ భాగస్వామ్యాని కి ఒక గట్టి పునాది ని నిర్మిస్తున్న ఫ్రాన్స్ లోని భారతీయ సముదాయం యొక్క తోడ్పాటు ను గురించి ప్రధాన మంత్రి ప్రముఖం గా ప్రస్తావించారు.

 

***