Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పెట్టుబడులను కాపాడుకోవడం మరియు పెట్టుబడులను ప్రోత్సహించడం కోసం భారతదేశానికి, బాంగ్లాదేశ్ కు మధ్య జాయింట్ ఇంటర్ ప్రిటేటివ్ నోట్స్ కు ఆమోదం తెలిపిన మంత్రివర్గం


పెట్టుబడులను కాపాడుకోవడం మరియు పెట్టుబడులను ప్రోత్సహించడం కోసం భారతదేశానికి, బాంగ్లాదేశ్ కు మధ్య జాయింట్ ఇంటర్ ప్రెటేటివ్ నోట్స్ (జెఐఎన్)కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

ప్రస్తుతం కొనసాగుతున్న అగ్రిమెంట్ బిట్వీన్ ఇండియా అండ్ బాంగ్లాదేశ్ ఫర్ ద ప్రమోషన్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ ఇన్వెస్ట్ మెంట్స్ (బిఐపిఎ)కు తగిన వివరణ ఇచ్చే విషయంలో జెఐఎన్ స్పష్టతను తీసుకువస్తుంది. ఇన్వెస్టర్ పదానికి నిర్వచనం, అలాగే, ఇన్వెస్ట్ మెంట్ అనే పదానికి నిర్వచనం పన్నులకు సంబంధించిన చర్యల మినహాయింపు, ఫేర్ అండ్ ఎక్విటబుల్ ట్రీట్ మెంట్ (ఎఫ్ఇటి), నేషనల్ ట్రీట్ మెంట్ (ఎన్ టి), మోస్ట్ ఫేవర్డ్ నేషన్ (ఎమ్ఎఫ్ఎన్) ట్రీట్ మెంట్, ఎక్స్ ప్రోప్రియేషన్, అత్యవసరమైనటు వంటి భద్రత సంబంధిత ప్రయోజనాలతో పాటు ఇన్వెస్టర్ కు మరియు కాంట్రాక్టింగ్ పార్టీకి మధ్య వివాదాల పరిష్కారం సహా అనేక షరతుల విషయంలో సంయుక్తంగా అనుసరించవలసిన వివరాణత్మకమైన నోట్ లు జెఐఎన్ లో భాగంగా ఉంటాయి.

సాధారణంగా ఇన్వెస్ట్ మెంట్ ట్రీటి రెఝీమ్ ను బలపరచడంలో జాయింట్ ఇంటర్ ప్రెటేటివ్ స్టేట్ మెంట్స్ ఒక ముఖ్యమైన అనుబంధ పాత్రను పోషిస్తాయి. ద్వైపాక్షిక పెట్టుబడి ఒడంబడిక (బిఐటి) సంబంధిత వివాదాలు పెచ్చుపెరుగుతుండడంతో విచారణ సంఘాల వద్ద అటువంటి ప్రకటనల జారీ, గొప్ప ప్రాముఖ్యాన్ని కలిగివుంటుంది. దేశాలు అవలంబించేటటువంటి ఈ తరహా సానుకూల వైఖరి ఒడంబడిక యొక్క షరతులను మధ్యవర్తిత్వ విచారణ సంఘాలు పరిశీలించడంలో సందర్భ శుద్ధిని చాటేందుకు దోహదం చేయగలవు.