భారతదేశం మరియు కంబోడియా ల మధ్య ద్వైపాక్షిక పెట్టుబడుల ఒడంబడిక (బి ఐ టి) కి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశానికి అధ్యక్షత వహించారు.
రెండు దేశాలలోను పెట్టుబడుల రాకను పెంచే ధ్యేయంతో ఏదైనా ఒక దేశంలోని భూభాగం నుంచి వేరొక దేశంలోని భూభాగంలోకి పెట్టుబడులను ప్రోత్సహించడానికి, పరిరక్షించడానికి ఈ ఒడంబడిక యత్నిస్తుంది. ఈ ఒడంబడిక ప్రతి ఒక్క దేశాన్ని ఇతర దేశంలోని పెట్టుబడిదారులకు తన దేశ భూభాగంలో (ఆ దేశపు) చట్టాలకు అనుగుణంగా పెట్టుబడులు తీసుకు రావడానికి తగిన సానుకూల పరిస్థితులను కల్పించేటట్లుగా ప్రోత్సహిస్తుంది.
ఈ ఒడంబడిక మంత్రిమండలి 2015 డిసెంబరులో ఆమోదించిన భారతీయ నమూనా బి ఐ టి పూర్తిపాఠానికి అనుగుణంగా రూపొందిన మొట్టమొదటి ద్వైపాక్షిక పెట్టుబడుల ఒడంబడిక కావడం గమనార్హం.