Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పూర్వ కేంద్ర మంత్రి శ్రీ శరద్ యాదవ్ కన్నుమూత పట్ల సంతాపాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి


పూర్వ కేంద్ర మంత్రి శ్రీ శరద్ యాదవ్ కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దుఃఖాన్ని వ్యక్తం చేశారు. డాక్టర్ లోహియా యొక్క ఆదర్శాల నుండి శ్రీ శరద్ యాదవ్ ఎంతో ప్రేరణ ను పొందారు అని కూడా ప్రధాన మంత్రి అన్నారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –

‘‘శ్రీ శరద్ యాదవ్ జీ కన్నుమూశారని తెలిసి దు:ఖం కలిగింది. ఆయన తన దీర్ఘ సార్వజనిక జీవనం లో, తనను తాను పార్లమెంటు సభ్యుని గాను మరియు మంత్రి గాను ప్రతిష్ఠించుకొన్నారు. డాక్టర్ లోహియా యొక్క ఆదర్శాల నుండి ఆయన ఎంతో ప్రేరణ ను పొందారు. నేను ఎల్లప్పటికీ మా మధ్య జరిగిన సంభాషణల ను నా మనసు లో పదిల పరచుకొంటాను. ఆయన కుటుంబాని కి మరియు ఆయన ను అభిమానించే వారికి ఇదే నా యొక్క సంతాపం. ఓమ్ శాంతి.’’ అని పేర్కొన్నారు.