Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

‘పూజా నీ కాంస్య పతకం మా వేడుకలకు నాంది.. క్షమాపణలేల!’


   కామన్‌వెల్త్‌ గేమ్స్‌-2022 మహిళల ఫ్రీస్టయిల్‌ కుస్తీ 50 కిలోల విభాగంలో కాంస్య పతకంతో సరిపెట్టుకోవాల్సి రావడంపై భారత రెజ్లర్‌ పూజా గెహ్లోత్‌ భావోద్వేగానికి గురికావడం గురించి ‘ఏఎన్‌ఐ’ వార్తా సంస్థ ట్వీట్‌పై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్పందించారు. పూజా గెహ్లోత్‌కు ఉజ్వల భవిష్యత్తు ఉన్నదని ఈ సందర్భంగా ఆయన ఊరడించారు.

ఈ మేరకు ట్విట్టర్‌ ద్వారా పంపిన సందేశంలో;

   “పూజా నీ కాంస్య పతకం మా వేడుకలకు నాంది.. క్షమాపణకు కాదు!’ నీ క్రీడా జీవన పయనం మాకు స్ఫూర్తిదాయకం. నీవిప్పుడు సాధించిన విజయం మాకెంతో సంతోషాన్నిస్తోంది. భవిష్యత్తులో మరిన్ని విజయాలు నిన్ను వెతుక్కుంటూ వస్తాయి. నువ్విలాగే రాణించాలని ఆకాంక్షిస్తున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.