Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

‘పులుల గ‌ణ‌న నివేదిక 2018’ ఆవిష్కరణ సందర్భం లో ప్ర‌ధాన మంత్రి ఉప‌న్యాసం


 

మంత్రివ‌ర్గం లో నా స‌హ‌రులు శ్రీ ప్రకాశ్ జావడేకర్ గారు, శ్రీ బాబుల్ సుప్రియో గారు, ఇక్క‌డ కు హాజ‌రైన ఇత‌ర ప్ర‌ముఖులారా. ముందు గా, మీ అంద‌రి కీ గ్లోబ‌ల్ టైగ‌ర్ డే యొక్క అభినంద‌న‌ల ను తెలియ‌ జేస్తున్నాను.

ఈ సంవ‌త్స‌రం గ్లోబ‌ల్ టైగ‌ర్ డే ప్ర‌త్యేక‌మైన‌టువంటిది.  దీని కి కార‌ణం భార‌త‌దేశం ఒక చ‌రిత్రాత్మ‌క కార్యాన్ని సాధించింది.  ఈ కార్య సిద్ధి కి గాను మీ అంద‌రి ని, ప్ర‌పంచ‌వ్యాప్త వ‌న్య‌ ప్రాణి ప్రేమికుల ను, ఈ కార్య‌క్ర‌మం తో సంబంధం ఉన్న‌ ప్ర‌తి ఒక్క అధికారి కి, ప్ర‌తి ఒక్క ఉద్యోగి కి, ప్ర‌త్యేకించి అట‌వీ ప్రాంతాల లో నివ‌సిస్తున్న మ‌న ఆదివాసీ సోద‌రీమ‌ణుల కు మ‌రియు ఆదివాసీ సోద‌రుల‌ కు నేను హృద‌యపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

మిత్రులారా,

ఈ రోజు గ్లోబ‌ల్ టైగ‌ర్ డే నాడు మ‌నం పులి ని ప‌రిర‌క్షించే దిశ గా మ‌న యొక్క వ‌చ‌నబ‌ద్ధ‌త ను పున‌రుద్ఘాటిద్దాము.  ఇప్పుడే ప్ర‌క‌టించిన‌ పులుల గ‌ణ‌న తాలూకు ఫ‌లితాలు భార‌త‌దేశం లో ప్ర‌తి ఒక్క‌రి కి, ప్ర‌కృతి ని ప్రేమించే ప్ర‌తి ఒక్క‌రి కి సంతోషాన్ని కలిగించాయి.  తొమ్మిది సుదీర్ఘ సంవ‌త్స‌రాల క్రితం, సెంట్ పీట‌ర్స్ బ‌ర్గ్ లో తీసుకున్న నిర్ణ‌యం ఏమిటి అంటే పులుల సంత‌తి ని రెట్టింపు చేయ‌డం అనే కార్యాన్ని 2022వ సంవ‌త్స‌రం క‌ల్లా సాధించాలి అని.  భార‌త‌దేశం లో మ‌నం ఈ ల‌క్ష్యాన్ని నాలుగు సంవ‌త్స‌రాలు ముందుగానే నెర‌వేర్చాము.  దీనిని సాధించడం కోసం సంబంధిత వ‌ర్గాల వారు కనబరచిన వేగం మరియు సమర్పణ భావం ప్రశంసనీయం.  ఇది ‘సంక‌ల్ప్ సే సిద్ధి’ తాలూకు చ‌క్క‌ని ఉదాహ‌ర‌ణల లో ఒక ఉదాహరణ గా ఉంది.  భార‌త‌దేశం లోని ప్ర‌జ‌లు ఒక‌సారి ఏదైనా సాధించాల‌ని నిర్ణ‌యించుకొన్నారంటే, ఏ శ‌క్తీ వారిని ఆశించిన ఫ‌లితాల‌ ను పొంద‌డం లో అడ్డ‌గించజాలదు.

మిత్రులారా,

నాకు జ్ఞ‌ాపకం ఉంది, 14-15 సంవ‌త్స‌రాల క్రితం ఈ సంఖ్య‌లు వెల్ల‌డి అయిన‌ప్పుడు దేశం లో కేవ‌లం 1400 పులులు ఉన్నాయి, అప్పుడు ఇది ఒక పెద్ద చ‌ర్చాంశం అయిపోయింది.  తీవ్ర ఆందోళ‌న రేకెత్తింది. టైగ‌ర్ ప్రోజెక్టు తో అనుబంధం కలిగివున్న ప్ర‌తి వ్యక్తి కి ఇది ఎంతో పెద్ద స‌వాలు వలె ప‌రిణ‌మించింది.  మాన‌వ జ‌నాభా తో సమతుల్యత కోసం పులుల కోసం ఒక అనువైన ప‌ర్యావ‌ర‌ణాన్ని స‌మ‌కూర్చ‌డం అనేది మ‌న ముందు ఒక తీవ్ర‌మైన స‌వాలు తో కూడిన కార్య భారం గా తోచింది.  అయితే ఏ విధమైనటువంటి సంవేదన శీలత‌ తో పాటు ఆధునిక సాంకేతికత ను వినియోగించుకొంటూ ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయినటువంటి తీరు.. అది తనంతట తాను కడు అభినంద‌నీయం గా ఉండింది.

ఈ రోజు న మ‌నం గ‌ర్వం తో చెప్పుకోవ‌చ్చును..  అది ఏమిటంటే ప్ర‌పంచం లో భార‌త‌దేశం సుమారు 3000 పులుల తో ప్రపంచంలో అత్యంత పెద్దదైన మరియు అన్నింటి కన్నా సురక్షితమైన ఆవాసాలలో ఒకటిగా ఉంది అనేదే.  ప్ర‌పంచం అంతటా పులుల యొక్క దాదాపు నాలుగింట మూడో వంతు సంతతి యొక్క ఉనికి మన భారతదేశం లో ఉంది.

ఇక్క‌డ ఉన్న మీలో చాలా మంది కి కూడా ఈ సంగ‌తి తెలుసు, అది ఏమిటంటే  వైల్డ్ లైఫ్ ఇకో సిస్టమ్ ను సమృద్ధం చేసేందుకు ఉద్దేశించినటువంటి ఒక ఉద్య‌మం ఒక్క వ్యాఘ్రాల‌కే ప‌రిమితమైపోలేదని.  గుజ‌రాత్ లోని గిర్ ప్రాంత అడ‌వుల లో జాడ ను క‌నుగొన్న ఏషియాటిక్ ల‌య‌న్ మరియు స్నో లెపర్డ్ ల‌ను సంర‌క్షించే కార్య‌క్ర‌మం కూడా శ‌ర వేగం గా అమ‌ల‌వుతోంది.  నిజాని కి గిర్ ప్రాంత అడవుల లో కృషి ముందు నుండే సాగుతోంది.  ఆ కృషి యొక్క‌ అనుకూల పరిణామాలు స్ప‌ష్టం గా క‌నుపిస్తున్నాయి.  అక్క‌డి పులుల సంఖ్య 27 శాతం మేర పెరిగిపోయింది.  భార‌త‌దేశం లోని ఉత్త‌మ ప్ర‌యోగ ప‌ద్ధ‌తుల యొక్క లాభాలు టైగ‌ర్ రేంజి లోని ఇత‌ర మిత్ర దేశాల కు కూడా అందుతుండటం నాకు సంతోషాన్ని కలిగిస్తోంది.

ఈ రోజు న, నేశ‌న‌ల్ టైగ‌ర్ క‌న్సర్వేశన్ ఆథారిటి.. చైనా, ఇంకా ర‌ష్యా ల‌తో పాటు అయిదు దేశాల‌ తో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది.  త్వ‌ర‌లో ఇత‌ర దేశాల‌ తో ఒప్పందం కూడా ఖ‌రారు కానుంది.  గ్వాటెమాలా కూడా జాగ్వార్ క‌న్స‌ర్వేష‌న్ కోసం మ‌న వ‌ద్ద నుండి సాంకేతిక స‌హాయాన్ని పొందగోరుతోంది.  బాగుంది,  పులి అనేది ఒక్క భార‌త‌దేశం లోనే కాకుండా అనేక ఇత‌ర దేశాల లో కూడా న‌మ్మ‌కాని కి ఒక సంకేతం గా నిల‌వ‌డం అనే సంగ‌తి ఆస‌క్తిదాయ‌కం గా ఉంది.  భార‌త‌దేశాని కి తోడు మ‌లేశియా, ఇంకా బాంగ్లాదేశ్ లలోనూ వాటి జాతీయ పశువు గా ఉన్నది పులే సుమా.   చైనా సంస్కృతి లో అయితే టైగర్ ఇయర్ ను  పాటిస్తారు.  అంటే ఒక విధం గా చూస్తే, పులి తో జతపడిన ఏ పార్శ్వం అయినా అనేక దేశాల ను, అక్కడి ప్రజల ను ఎన్ని విధాలు గానో ప్ర‌భావితం చేస్తోంది.

మిత్రులారా,

ఒక మెరుగైన ప‌ర్యావ‌ర‌ణం లేకుండా మాన‌వ సాధికారిత కల్పన అసంపూర్తి గా ఉంటుంది.  కాబట్టి ముందున్న దారి ఏరి కోరి ఎంపిక చేసుకోవడమనే దానికి బదులు స‌మ‌ష్టి గా పోవడం అన్న మాట.  ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ ను ఒక స్థూల‌మైన ప్రాతిప‌దిక‌న మ‌రియు స‌మ‌గ్ర‌మైన దృష్టి తో మనం చూడ‌వ‌ల‌సిన అవ‌స‌రం ఉంది.

మ‌న స‌హాయం అవ‌స‌ర‌మైన‌టువంటి వృక్షాలు మ‌రియు పశువులు అనేకం ఉన్నాయి.   అయితే మాన‌వ జోక్యం ద్వారా గాని, లేక సాంకేతిక విజ్ఞానం ద్వారా గాని వాటి కి ఒక స‌రిక్రొత్త జీవనాధ్యాయాన్ని ప్ర‌సాదించ‌డాని కి- తద్వారా అవి  మ‌న భూ గ్ర‌హాని కి సుంద‌రత్వాన్ని మ‌రియు భిన్న‌త్వాన్ని జోడించ‌డానికి-  మ‌నం చేయ‌గలిగింది అంటూ ఏముంది?  ఒక పాతదైన చ‌ర్చోప చ‌ర్చ ఉండనే ఉంది. అది అభివృద్ధా, లేక ప‌ర్యావ‌ర‌ణ‌మా అనేదే.  మ‌రి, ఉభయ పక్షాలూ దేనిక‌దే విల‌క్ష‌ణ‌మైన‌వి అన్న‌ట్టు గా వాటి ఆలోచ‌న‌ల ను వెల్ల‌డి చేస్తున్నాయి.

కానీ, మ‌నం స‌హ‌ అస్తిత్వాన్ని కూడా ఆమోదించి తీరాలి.  అంతేకాదు, సహ యాత్ర తాలూకు మహత్వాన్ని కూడా అర్థం చేసుకోవాలి.  అభివృద్ధికి మరియు పర్యావరణానికి మధ్య ఆరోగ్యకరమైన సమతుల్యత ను సాధించడం జరిగే ప‌నే అని నేను భావిస్తున్నాను.  మ‌రి మ‌న దేశం ఎటువంటిదంటే మనకు వేల సంవ‌త్స‌రాలుగా స‌హ‌ అస్తిత్వం తాలూకు బోధన ను అందించ‌డం జరిగింది.  మ‌న పూర్వీకులు ఎటువంటి దైవాన్ని ఊహించి మరి సహ అస్తిత్వం యొక్క ఉదాహరణలు ప్రసాదించారంటే అందులో అనిపిస్తుంది.. ఇది సావ‌న్ మాసం అని.  సోమ‌వారం అని. శివుని మెడ‌ లో స‌ర్పం వేలాడుతూ ఉందని.  అదే కుంటుంబాని కి చెందిన వినాయకుని కి పీఠం గా ఒక మూషికం ఉందని.  పాము కు ఎలుక‌ ను తినేసే అలవాటు ఉంటుంది.  కానీ, భగవాన్ శివుడు త‌న కుటుంబం ద్వారా స‌హ‌ అస్తిత్వ సందేశాన్ని అందిస్తున్నారు.  ఇది తనంత తాను మన దగ్గర ఏ దేవీ, దేవ‌త‌ల కు సంబంధించిన ఊహ అయినా పశువులు, ప‌క్షులు లేదా వృక్షాల ఉనికి లేనిదే రూపు దిద్దుకోలేదు, దాని తో జోడింపబడింది.

మ‌న విధానాల లో, మ‌న ఆర్థిక ప‌ర‌మైన అంశాల లో మ‌నం సంర‌క్ష‌ణ ను గురించిన సంభాష‌ణ ను మార్చుకోవ‌ల‌సి ఉన్నది.  మ‌నం చురుకు తనాన్ని మ‌రియు స్పంద‌న శీల‌త ను.. ఈ రెండిటి ని క‌లిగివుండాలి; ప‌ర్యావ‌ర‌ణ ప‌ర‌మైన నిలుక‌డత‌నం మరియు ఆర్థిక వృద్ధి అనే ఒక ఆరోగ్యకరమైన సమతుల్యత ను ఆవిష్కరించుకోవాలి.

భార‌త‌దేశం ఆర్థికం గాను, ప‌ర్యావ‌ర‌ణ ప‌రం గాను స‌మృద్ధ‌ం అవుతుంది.   భార‌త‌దేశం మ‌రిన్ని ర‌హ‌దారుల‌ ను నిర్మిస్తుంది.  భార‌త‌దేశం ప‌రిశుభ్ర‌మైన న‌దుల ను క‌లిగివుంటుంది.  భార‌త‌దేశం లో ఉత్త‌మ‌ రైలు మార్గ సంధానం మ‌రి అలాగే, విస్తృత‌మైన వృక్షజాలం ఈ రెండూ ఉంటాయి.  భార‌త‌దేశం మ‌న పౌరుల కోసం మ‌రిన్ని గృహాల ను నిర్మిస్తుంది.  అదే కాలం లో పశువుల కోసం ఉత్త‌మ‌మైన ఆవాసాల‌ ను కూడా అది ఏర్పాటు చేస్తుంది.  భార‌త‌దేశం ఒక హుషారైన స‌ముద్ర సంబంధిత ఆర్థిక వ్య‌వ‌స్థ ను, మ‌రి అలాగే ఆరోగ్యక‌ర‌మైన  సాగర సంబంధిత ప‌ర్యావ‌ర‌ణాన్ని క‌లిగివుంటుంది.  ఒక బ‌ల‌మైన మ‌రియు స‌మ్మిళిత‌మైన భార‌త‌దేశాని కి తోడ్పాటు ను అందించేది ఈ సమ‌తుల్య‌తే .

మిత్రులారా,

గ‌డ‌చిన‌ అయిదు సంవ‌త్స‌రాల కాలం లో ఒక ప‌క్క దేశం త‌దుప‌రి త‌రం మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న కోసం శీఘ్ర గ‌తి న కృషి చేస్తోంది.  మ‌రొక పక్క భార‌త‌దేశం లో వ‌న్య సంబంధ వ‌ల‌యం కూడా పెరుగుతోంది.  దీని కి అద‌నం గా దేశం లోని ర‌క్షిత ప్రాంతాల సంఖ్య కూడా పెరిగింది.  2014వ సంవ‌త్స‌రం లో  భార‌త‌దేశం లో ర‌క్షిత ప్రాంతాల సంఖ్య 692గా ఉండేవి.  ఆ సంఖ్య  2019వ సంవ‌త్స‌రం లో 860కి పైబడి పెరిగింది. అదే కాలం లో క‌మ్యూనిటీ రిజ‌ర్వ్ స్ సంఖ్య 43 నుండి దాదాపు 100కు హెచ్చింది.

పులుల సంఖ్య లో, ర‌క్షిత ప్రాంతాల లో పెరుగుద‌ల ఒక్క గ‌ణాంకాల లో పెరుగుదల మాత్ర‌మే కాదు;  ప‌ర్య‌ట‌న రంగం మీద, అలాగే ఉపాధి క‌ల్ప‌న మార్గాల మీద కూడా దాని పెను ప్ర‌భావాన్ని ప్రసరిస్తుంది.  నేను ఎక్క‌డో చ‌దివాను, ఏమని అంటే  ర‌ణథంబౌర్ లో ప్రఖ్యాత ఆడ‌ పులి ‘మ‌ఛ్ లీ’ని చూడడం కోసమే దేశ విదేశాల నుండి ల‌క్ష‌లాది ప‌ర్యాట‌కులు డేరాలు వేసుకొంటూ ఉంటారు అని.  అందువల్ల, పులుల‌ ను ప‌రిర‌క్షణ తో పాటే మేము ప‌ర్యావ‌ర‌ణ ప‌రం గా నిలుక‌డ‌త‌నం క‌లిగివుండే ఇకో-టూరిజ‌మ్ ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ ను నిర్మించడం ప‌ట్ల కూడా శ్ర‌ద్ధ తీసుకొంటున్నాము.

మిత్రులారా,

ప‌ర్యావ‌ర‌ణాన్ని ప‌రిర‌క్షించ‌డం కోసం భార‌త‌దేశం చేస్తున్న అన్ని ప్ర‌య‌త్నాలు మ‌న‌ల్ని జ‌ల వాయు సంబంధ కార్యాచ‌ర‌ణ లో ప్ర‌పంచం లోనే ప‌రుగు తీస్తున్న వారి లో ముందు వ‌రుస లో నిలబెట్టాయి.  2020వ సంవ‌త్స‌రం కన్నా ముందు ఎమిశన్ ఇంటెన్సిటీ ఆఫ్ జిడిపి కోసం కూడా ఏ ల‌క్ష్యాల‌నైతే నిర్దేశించారో, వాటి ని భారతదేశం ముందుగా నే సాధించింది.  భార‌త‌దేశం ఇవాళ త‌మ ఆర్థిక వ్య‌వ‌స్థ ను ప‌రిశుద్ధ ఇంధ‌న ఆధారిత‌మైంది గాను, న‌వీక‌ర‌ణ యోగ్య శ‌క్తి ఆధారిత‌మైంది గాను రూపొందించ‌డం లో నిమగ్నం అయిన ప్ర‌పంచం లోని అగ్ర‌గామి దేశాల లో ఒక దేశం గా ఉన్నది.  వ్యర్థాల ను, బ‌యో-మాస్ ను మన శ‌క్తి భ‌ద్ర‌త లో ఒక విస్తృత భాగం గా మేము మలుస్తున్నాము.

దీనికి అదనం గా, ఇలెక్ట్రిక్ మొబిలిటీ, బ‌యోఫ్యూయ‌ల్స్, ఇంకా స్మార్ట్ సిటీ.. వీటి విష‌యం లో చేసే కృషి కూడా ప‌ర్యావ‌ర‌ణాని కి ప్ర‌యోజ‌నకారి గా ఉంటోంది.  అలాగే, ఇంట‌ర్‌నేశన‌ల్ సోల‌ర్ అల‌య‌న్స్ (ఐఎస్ఎ) మాధ్యమం ద్వారా మ‌నం ప్ర‌పంచం లోని అనేక దేశాల ను సౌర విద్యుత్తు తో సంధానించ‌డం లో ఒక ముఖ్య పాత్ర ను పోషిస్తున్నాము.  ఇప్పుడు మ‌న ల‌క్ష్యం ఏమి కావాలి అంటే : ఒక ప్ర‌పంచం, ఒక సూర్యుడు, మ‌రియు ఒక గ్రిడ్ అనేదే.

ఉజ్జ్వ‌ల, ఇంకా ఉజాలా వంటి ప‌థ‌కాలు దేశ దైనందిన జీవ‌నాన్ని స‌ర‌ళ‌త‌రం చేస్తున్నాయి.  అంతేకాదు, ఇవి ప‌ర్యావ‌ర‌ణాని కి కూడా లాభ‌దాయకం గా ఉన్నాయి.  దేశం లోని ప్ర‌తి ఒక్క కుటుంబాని కి ఒక ఎల్‌పిజి క‌నెక్ష‌న్ ను అందించ‌డం ద్వారా మ‌నం చెట్ల‌ ను న‌రికి వేయకుండా కాపాడ‌డం లో స‌ఫ‌లం అవుతున్నాము.  దేశం లో ప్ర‌తి ఒక్క ఇంటి ని, ప్ర‌తి ఒక్క భ‌వ‌నాన్ని మ‌రియు ప్ర‌తి ఒక్క ర‌హ‌దారి ని ఎల్ఇడి బ‌ల్బుల‌ తో అలంక‌రించే ఉద్యమం తో విద్యుత్తు  ఆదా అవుతోంది. క‌ర్బ‌న ఉద్గారాలు సైతం గణనీయంగా తగ్గిపోతున్నాయి.  అలాగే మ‌ధ్య‌ త‌ర‌గ‌తి ప్రజానీకాని కి విద్యుత్తు బిల్లులు కూడా త‌గ్గాయి.  వారు ఆర్థికం  గా లాభప‌డ్డారు.

మిత్రులారా,

ప్ర‌స్తుతం భార‌త‌దేశం త‌మ హితం కోసం మ‌రియు ప్ర‌పంచ హితం కోసం తీసుకున్న సంక‌ల్పాలు అన్నింటినీ నెర‌వేర్చే ప్ర‌పంచ దేశాల లో ఒక దేశం అనే గుర్తింపు ను పొందింది.  పేద‌రిక నిర్మూల‌న మ‌రియు సుస్థిర అభివృద్ధి ల‌క్ష్యాల సాధ‌న లో భార‌త‌దేశం ప్ర‌పంచాని కి నాయ‌క‌త్వం వ‌హిస్తుంద‌న్న న‌మ్మ‌కం నాలో ఉంది.  అటువంటి ప్ర‌య‌త్నాల కార‌ణం గా ఈ రోజు న భార‌త‌దేశాన్ని దేశ హితం కోసం మ‌రియు ప్ర‌పంచ హితం కోసం తీసుకొన్న సంక‌ల్పాలు అన్నింటి నీ నెర‌వేర్చే ప్రపంచ దేశాల లో ఒక దేశం గా గుర్తించ‌డం జ‌రిగింది.

నేటి సంఖ్య‌ లను మ‌నం వేడుక గా జ‌రుపుకోబోతున్న స‌మ‌యం లో ఈ మృగ రాజా లు తీవ్ర‌మైన‌టువంటి స‌వాళ్ళ ను ఎదుర్కొంటున్నాయ‌న్న సంగ‌తి ని తెలుసుకోవాలి.  వాటి ఆవాసాలు అంతకంతకు క్షీణించిపోతున్నాయి.  వాటి ఆవాసాల లో కల్లోలం చెలరేగుతోంది.  అక్రమ వ్యాపారం, ఇంకా అక్రమ ర‌వాణా ప్ర‌బ‌లుతున్నాయి.  పశు పరిర‌క్ష‌ణ ను, పశు సంర‌క్ష‌ణ ను పెంపొందించ‌డం కోసం భార‌త‌దేశం తాను చేయ‌గ‌లిగింది అంతా చేయ‌డాని కి క‌ట్టుబ‌డి ఉన్నది.

ఆసియా లో అక్ర‌మ వ్యాపారాన్ని, ఇంకా పోచింగ్ ను గ‌ట్టిగా నిరోధించ‌డం కోసం టైగ‌ర్ రేంజ్ కంట్రీస్ యొక్క ప్ర‌భుత్వ అధినేత‌ల‌ ను నేను అభ్యర్థించి వారిని ఒక చోటు కు చేర్చి అల‌య‌న్స్ ఆఫ్ గ్లోబ‌ల్ లీడ‌ర్స్ గా రూపొందిస్తాను.  ఈ వ‌ర‌ల్డ్ టైగ‌ర్ డే నాడు మిమ్మల్ని మరొక్క సారి నన్ను అభినందించ‌నివ్వండి.

హ‌రిత దేశాన్ని, ప‌ర్యావ‌ర‌ణ ప‌రం గా నిలుక‌డ‌త‌నం క‌లిగిన‌టువంటి దేశాన్ని ఆవిష్క‌రించ‌డం కోసం మ‌న‌మంద‌రం ప్ర‌తిజ్ఞ చేద్దాము.  పులి ని స్థిర‌త్వ సంకేతం గా ప‌రిగ‌ణిద్దాం.

ఈ రంగం తో సంబంధం క‌లిగిన వారు అందరి కి నేను చెప్ప‌ేది ఏమిటంటే ‘ఏక్ థా టైగ‌ర్’తో మొద‌లైన క‌థ ‘టైగ‌ర్ జిందా హై’తో ముగిసింది.  అది అక్క‌డి తో ఆగిపోకూడ‌దు.  ఇంత‌కు ముందు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ కు చెందిన వారు ‘బాగోఁమే బహార్ హై’ అని పాడే వారు.  ఇప్పుడు సుప్రియో గారు ‘బాఘోఁమే బ‌హార్ హై’ అని పాడుతారు.

పులుల సంర‌క్ష‌ణ కు సంబంధించిన ఆ ప్ర‌య‌త్నాల‌ ను మ‌రింత విస్త‌రించడం జరగాలి.  వాటి గమనం మరింత వేగాన్ని పుంజుకోవాలి.

ఈ ఆశ తో, ఇదే విశ్వాసం తో మ‌రొక్క‌ మారు మీ అంద‌రికి అనేకానేక అభినందనలు అందిస్తున్నాను.  మీ అంద‌రి కీ ఇవే నా శుభాకాంక్ష‌లు

మీకు ధ‌న్య‌వాదాలు.