Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పురుషుల షాట్ పుట్ లో కాంస్య పతకాన్ని గెలిచిన క్రీడాకారుడు శ్రీ హొకాటో హొతోసే సేమాను అభినందించిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ


ప్రస్తుతం జరుగుతున్న పారిస్ పారాలింపిక్స్ లో పురుషుల షాట్ పుట్ ఎఫ్57 పోటీలో కంచు పతకాన్ని క్రీడాకారుడు శ్రీ హొకాటో హొతోసే సేమా గెలిచినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ  ఆయనను ఈ రోజు న అభినందించారు.

 

ప్రధాన మంత్రి ‘ఎక్స్’ లో ఒక సందేశంలో ఈ కింది విధంగా పేర్కొన్నారు:

‘‘పురుషుల షాట్ పుట్ ఎఫ్ 57 పోటీ లో కాంస్య పతకాన్ని శ్రీ హొకాటో హొతోసే సేమా స్వదేశానికి తీసుకు వస్తుండడంతో, ఇది మన దేశం గర్వపడే క్షణం అని చెప్పాలి. ఆయన చాటిన ఆశ్చర్యకారి బలం, దృఢసంకల్పం లు అసాధారణంగా ఉన్నాయి. ఆయనకు ఇవే అభినందనలు. ఆయన తన భావి ప్రయాసలలో సైతం రాణించాలని కోరుకొంటున్నాను.

చీర్ ఫర్ భారత్ (#Cheer4Bharat)