బర్మింగ్‌హామ్‌లో జరుగుతున్న కామన్‌వెల్త్ గేమ్స్-2022 పురుషుల బాక్సింగ్ 57 కిలోల విభాగంలో కాంస్య పతకం సాధించిన భారత బాక్సర్ మొహమ్మద్ హసముద్దీన్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.
ఈ మేరకు ట్విట్టర్ ద్వారా పంపిన సందేశంలో;
“మొహమ్మద్ హసముద్దీన్ అద్భుతమైన బాక్సర్.. కాబట్టే చాలా పోటీల్లో విజయం సాధించారు. అంతుబట్టని మెలకువలు, ప్రతికూలతను స్ఫూర్తిదాయకంగా అధిగమించడం ద్వారా ఈ ప్రతిభావంతుడైన క్రీడాకారుడు బర్మింగ్‌హామ్ క్రీడల్లో పురుషుల బాక్సింగ్ 57 కిలోల విభాగంలో కాంస్య పతకం సాధించారు. ఆయనకు నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను#Cheer4India” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
Mohammad Hussamuddin is an excellent boxer who has succeeded in many sporting events. Powered by wonderful techniques and a spirit of resilience, this bright athlete wins a Bronze medal in the Men's 57kg event at Birmingham. Congrats to him. I wish him the very best. #Cheer4India pic.twitter.com/0uZKpJPv6N
— Narendra Modi (@narendramodi) August 7, 2022