Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పురుషుల కుస్తీ 97 కిలోల ఫ్రీస్టయిల్ విభాగంలో కాంస్యం సాధించిన దీపక్‌ నెహ్రాకు ప్రధానమంత్రి శుభాశీస్సులు


   బర్మింగ్‌హామ్‌లో జరుగుతున్న కామన్వెల్త్‌ గేమ్స్‌-2022 పురుషుల కుస్తీ 97 కిలోల ఫ్రీస్టయిల్‌  విభాగంలో కాంస్య పతకం సాధించిన దీపక్‌ నెహ్రాకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాశీస్సులు అందజేశారు.

ఈ మేరకు ట్విట్టర్‌ ద్వారా పంపిన సందేశంలో;

   “మరొక కుస్తీ వీరుడు… భారతదేశానికి మరొక గౌరవం! దీపక్‌ నెహ్రా కామన్వెల్త్‌ గేమ్స్‌-2022 పురుషుల కుస్తీ 97 కిలోల ఫ్రీస్టయిల్‌ విభాగంలో కాంస్య పతకం సాధించడం ముదావహం. ఈ పోటీలో దీపక్‌ అద్భుతమైన పట్టుదల, అంకితభావం ప్రదర్శించారు. భవిష్యత్‌ క్రీడా పయనంలోనూ ఆయన మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ నా శుభాసీస్సులు తెలియజేస్తున్నాను. #Cheer4India” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.