‘పీఎం జన్‌ధన్ యోజన’కు శ్రీకారం చుట్టి ఏడేళ్లు పూర్తయిన నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ‘పీఎం జన్‌ధన్ యోజన’ను విజయవంతం చేయడంలో నిరంతరం కృషిచేసిన వారందరినీ ఈ సందర్భంగా ఆయన ప్రశంసించారు.
ఈ మేరకు ప్రధాని కొన్ని ట్వీట్లద్వారా ఇచ్చిన సందేశాల్లో-
“ఇవాళ్టితో #PMJanDhanకు ఏడు సంవత్సరాలు పూర్తయ్యాయి. దీన్ని భారత ప్రగతి పథాన్ని పరివర్తనవైపు మళ్లించిన శాశ్వత చర్యగా పేర్కొనవచ్చు. ఇది ఆర్థిక సార్వజనీనతకు భరోసా ఇవ్వడంతోపాటు అసంఖ్యాక భారతీయులకు గౌరవప్రదమైన జీవితాన్నిచ్చి సాధికారతకూ దోహదపడింది. అలాగే పారదర్శకతను పెంపొందించడంలోనూ ఎంతగానో తోడ్పడింది.
ఈ నేపథ్యంలో #PMJanDhanను విజయవంతం చేయడం కోసం అవిశ్రాంతంగా శ్రమించిన ప్రతి ఒక్కరినీ అభినందిస్తున్నాను. వారి కృషి ఫలితంగా భారత ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాల దిశగా భరోసా లభించింది” అని పేర్కొన్నారు.
Today we mark seven years of #PMJanDhan, an initiative that has forever transformed India’s development trajectory. It has ensured financial inclusion and a life of dignity as well as empowerment for countless Indians. Jan Dhan Yojana has also helped further transparency.
— Narendra Modi (@narendramodi) August 28, 2021
***
DS/SH

I would like to applaud the untiring efforts of all those who have worked to make #PMJanDhan a success. Their efforts have ensured the people of India lead a better quality of life.
— Narendra Modi (@narendramodi) August 28, 2021