దేశవ్యాప్తంగా కోవిడ్-19వల్ల తల్లిదండ్రులను కోల్పోయిన బాలలకు మద్దతివ్వడం కోసం తీసుకోవాల్సిన చర్యలపై చర్చించి, వాటిగురించి వివరించడం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన అధ్యక్షతన ఒక ముఖ్యమైన సమావేశం నిర్వహించారు. ప్రస్తుత కోవిడ్ మహమ్మారి దుష్ప్రభావానికి గురైన పిల్లలకు ప్రయోజనం కల్పించే అనేక చర్యలను ప్రధానమంత్రి ఈ సందర్భంగా ప్రకటించారు. నేటి బాలలే దేశ భవిష్యత్ నిర్దేశకులని, వారికి మద్దతు… రక్షణ కోసం దేశం శక్తివంచన లేకుండా కృషి చేయాలని ప్రధానమంత్రి నొక్కిచెప్పారు. తద్వారా వారు బలమైన పౌరులుగా రూపొంది, ఉజ్వల భవిష్యత్తును సొంతం చేసుకోగలరని పేర్కొన్నారు. ఇటువంటి కఠిన పరీక్షా సమయంలో ఒక సమాజంగా మన బాలలకు ఆదరణతోపాటు ఉజ్వల భవిష్యత్తుపై వారిలో ఆశలు నింపడం మన కర్తవ్యమని ప్రధాని అన్నారు. ఈ మేరకు కోవిడ్-19 వల్ల తల్లిదండ్రులిద్దర్నీ లేదా వారిలో ఒకరిని కోల్పోయిన/చట్టబద్ధ సంరక్షకుల/దత్తత తల్లిదండ్రులు సంరక్షణలోగల పిల్లలందరికీ ‘‘పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్’’ పథకం కింద పూర్తి మద్దతు లభిస్తుందని ఆయన ప్రకటించారు. కోవిడ్-19పై భారతదేశ పోరాటానికి తోడ్పడే ‘పీఎం కేర్స్ నిధి’కి అందే ఉదార విరాళాలతోనే ప్రస్తుతం ప్రకటించిన చర్యలన్నీ చేపట్టడం సాధ్యమని ఆయన స్పష్టం చేశారు:-
పిల్లల పేరిట ఫిక్స్డ్ డిపాజిట్:
పదేళ్ల లోపు పిల్లలకు పాఠశాల విద్య:
11-18 ఏళ్ల మధ్యగల పిల్లలకు పాఠశాల విద్య:
ఉన్నత విద్యకు మద్దతు:
ఆరోగ్య బీమా:
***
Supporting our nation’s future!
— Narendra Modi (@narendramodi) May 29, 2021
Several children lost their parents due to COVID-19. The Government will care for these children, ensure a life of dignity & opportunity for them. PM-CARES for Children will ensure education & other assistance to children. https://t.co/V3LsG3wcus