Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పిల్ల‌ల‌కు జాతీయ సాహ‌స అవార్డులు బ‌హూక‌రించిన ప్ర‌ధాని

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ ఆదివారం 25 మంది బాల‌ల‌కు జాతీయ సాహ‌స అవార్డులు బ‌హూక‌రించారు.

పిల్ల‌ల‌ను, వారి త‌ల్లిదండ్రులను అభినందించిన ప్రధాని ఈ సంద‌ర్భంగా ప్ర‌సంగిస్తూ, “స‌మ‌య‌స్ఫూర్తి, వేగ‌వంత‌మైన ఆలోచ‌న‌, నిస్వార్థపూరిత ప‌ట్టుద‌ల, ఆప‌దలోని తోటివారికి సాయ‌ప‌డేలా స్పందించే సున్నిత‌త్వం, మాన‌వ‌త్వం ఈ బాల‌ల సాహ‌సంలోని ప్ర‌ధానాంశాలు. ఈ సాహ‌సం ఇక్క‌డే ఆగిపోకూడ‌దు. ఇదే విధంగా ఎదిగి, కెరీర్‌లో వృద్ధి చెంది, స‌మాజానికి త‌మ పూర్తి స్థాయి సేవ‌ల‌ను అందించాలి” అని ఆకాంక్షించారు. ఈ గుణ‌గ‌ణాల‌ను పేర్కొంటూ రూపొందిన ‘లైఫ్ ప్రోగ్రెష‌న్ ఆఫ్ ఐసీసీడ‌బ్ల్యూ నేష‌న‌ల్ బ్రేవ‌రీ అవార్డీస్‌’ అనే పుస్త‌కాన్ని ఈ సంద‌ర్భంగా ఆయ‌న విడుద‌ల చేశారు.

ఈ కార్య‌క్ర‌మంలో కేంద్ర మ‌హిశా‌, శిశు సంర‌క్ష‌ణ శాఖ మంత్రి శ్రీమ‌తి మేనకా గాంధీ కూడా పాల్గొన్నారు.

భార‌తీయ బాల‌ల సంర‌క్ష‌ణ మండలి (ఐసీసీడ‌బ్ల్యూ) ఈ జాతీయ సాహ‌స‌ బాల‌ల అవార్డుల ప‌థ‌కాన్ని ఆరంభించింది. త‌మ సాహ‌సాలతో, ప్ర‌తిభ‌తో స‌మాజానికి స్ఫూర్తినిచ్చే బాల‌ల గొప్ప‌ద‌నం అంద‌రికీ ఉదాహ‌ర‌ణ‌గా నిల‌వాల‌నే ఉద్దేశంతో ఈ అవార్డును నెల‌కొల్పారు.