Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పిల్లలపై మార్టయిరాలజిస్ట్ ఎక్స్ పొజిషన్: సందర్శించిన ప్రధానమంత్రి

పిల్లలపై మార్టయిరాలజిస్ట్ ఎక్స్ పొజిషన్: సందర్శించిన ప్రధానమంత్రి


ఉక్రెయిన్లో అమరులైన బాలల స్మృతికి కీవ్ నేషనల్ హిస్టరీ మ్యూజియంలో ఏర్పాటు చేసిన ప్రదర్శన (మార్టయిరాలజిస్ట్ ఎక్స్ పొజిషన్)ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సందర్శించారు.  ఈ సందర్భంగా ఆయన వెంట ఉక్రెయిన్ అధ్యక్షుడు శ్రీ వ్లాదిమిర్ జెలెన్‌ స్కీ ఉన్నారు.

యుద్ధంలో తమ ప్రాణాలను కోల్పోయిన చిన్నారుల స్మృతి కోసం ఏర్పాటు చేసిన మార్మిక ప్రదర్శన ప్రధానమంత్రి హృదయాన్ని కదిలించింది. ఆ చిన్నారుల అకాల మరణంపై సానుభూతిని వ్యక్తం చేస్తూ,  గౌరవార్థం అక్కడ ఒక ఆటబొమ్మను ఉంచి నివాళి అర్పించారు.