పిఎమ్ స్వనిధి స్కీము లబ్ధిదారుల సంఖ్య 50 లక్షల కు చేరుకోవడాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్వాగతించారు. వీధుల లో తిరుగుతూ వివిధ వస్తువుల ను అమ్మే వ్యక్తుల జీవనాన్ని పిఎమ్ స్వనిధి సులభతరం గా మార్చడం ఒక్కటే కాకుండా వారికి గౌరవం తో మనుగడ ను సాగించే అవకాశాన్ని కూడా ఇచ్చింది అని ప్రధాన మంత్రి స్పష్టంచేశారు.
గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశాన్ని ప్రధాన మంత్రి శేర్ చేస్తూ –
‘‘ఈ ప్రధాన కార్యసాధన కు గాను అనేకానేక అభినందన లు. పిఎమ్ స్వనిధి యోజన తో దేశవ్యాప్తం గా మన వీధి వర్తకుల జీవనంసులభతరం గా మారడం ఒక్కటే కాకుండా వారికి గౌరవం గా జీవించే అవకాశం కూడా లభించడం నాకు సంతోషాన్ని కలిగిస్తున్నది.’’ అని పేర్కొన్నారు.
इस बड़ी उपलब्धि के लिए बहुत-बहुत बधाई! मुझे संतोष है कि #PMSVANidhi योजना से ना सिर्फ देशभर के हमारे रेहड़ी-पटरी वालों का जीवन आसान हुआ है, बल्कि उन्हें सम्मान के साथ जीने का अवसर भी मिला है। https://t.co/tpfKtJdujs
— Narendra Modi (@narendramodi) October 4, 2023