Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పిఎమ్ జికెవై/ఆత్మనిర్భర్ భారత్ లో భాగం గా 24 శాతం ఇపిఎఫ్ చందా (12 శాతం ఉద్యోగుల వంతు మరియు 12 శాతం యాజమాన్యాల వంతు) ను మరో మూడు నెలల పాటు- అంటే 2020 వ సంవత్సరం జూన్ నుండి 2020 వ సంవత్సరం ఆగస్టు వరకు- పొడిగించే ప్రతిపాదన కు ఆమోదం తెలిపిన మంత్రిమండలి


 

ఉద్యోగుల భవిష్య నిధి (ఇపిఎఫ్) కు ఇటు 12 శాతం ఉద్యోగుల వంతు ను, అటు 12 శాతం యాజమాన్యాల వంతు ను రెంటి ని కలిపి మొత్తం 24 శాతం చందా ను  ప్రపంచవ్యాప్త వ్యాధి ‘కోవిడ్-19’ ని దృష్టి లో పెట్టుకొని ప్రభుత్వం ప్రకటించిన ‘ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన’ (పిఎమ్ జికెవై)/ ‘ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజి’ లో భాగం గా మరో 3 నెలల పాటు- అంటే 2020 వ సంవత్సరం జూన్ నుండి 2020 వ సంవత్సరం ఆగస్టు వరకు- పొడిగించేందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న ఈ రోజు న సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

ఈ ఆమోదం 2020 వ సంవత్సరం ఏప్రిల్ 15 వ తేదీ నాడు ఆమోదించినటువంటి మార్చి నుండి మే నెల వేతన మాసాల కు సంబంధించిన వర్తమాన పథకాని కి అదనం గా వర్తిస్తుంది.  దీని మొత్తం అంచనా వ్యయం 4,860 కోట్ల రూపాయలు గా ఉంది.  దీని ద్వారా 3.67 సంస్థల లో 72 లక్షల మంది కి పైగా ఉద్యోగులు లాభపడతారు.

ముఖ్యాంశాలు:

ఈ ప్రతిపాదన యొక్క ముఖ్యాంశాలు ఈ దిగువన పేర్కొన్న విధం గా ఉన్నాయి:

1.  2020 వ సంవత్సరం లో జూన్, జులై మరియు ఆగస్టు వేతన మాసాల కు గాను 100 మంది వరకు ఉద్యోగులు కల సంస్థలు అన్నిటి కి మరియు 15,000 రూపాయల కంటే తక్కువ నెలవారీ వేతనాన్ని ఆర్జిస్తున్న ఇటువంటి ఉద్యోగుల లో 90 శాతం వరకు ఈ పథకం వర్తించగలదు.

2.  3.67 లక్ష ల సంస్థల లో పనిచేస్తున్న దాదాపు 72.22 లక్ష ల మంది శ్రమికుల కు ప్రయోజనం కలుగుతుంది.  అంతరాయాలు ఎదురయ్యేటట్లు ఉన్నప్పటికీ వారి కి మాత్రం వేతన పట్టిక కొనసాగే సూచన లు ఉన్నాయి.

3.  ఈ ప్రయోజనం కోసం 4,800 కోట్ల రూపాయల బడ్జెటరీ సహాయాన్ని ప్రభుత్వం 2020-21 సంవత్సరానికి గాను సమకూర్చనుంది.  

4.    ప్రధాన మంత్రి రోజ్ గార్ ప్రోత్సాహన్ యోజన (పిఎమ్ ఆర్ పివై) లోభాగం గా 2020 వ సంవత్సరం జూన్ నుండి 2020 వ సంవత్సరం ఆగస్టు నెలల కై 12 శాతం యాజమాన్యాల చందా కు అర్హత కలిగిన లాభితుల ను అతివ్యాప్తి తాలూకు లబ్ధి ని నివారించడానికై దీని నుండి మినహాయించడం జరుగుతుంది.
 
5.    దీర్ఘ కాలం పాటు లాక్ డౌన్ అమలులో ఉన్న కారణం గా, వ్యాపారాలు తిరిగి పని ని మొదలుపెడుతున్న వేళ అవి ఆర్థిక పరమైనటువంటి సంకటాన్ని ఎదుర్కోవలసివస్తున్నది.  ఈ కారణం చేత ఆత్మనిర్భర్ భారత్ లో ఒక భాగం గా, వ్యాపారాల కు మరియు శ్రమికుల కు ఇపిఎఫ్ పరం గా సహాయాన్ని మరొక 3 మాసాల పాటు- అంటే 2020 వ సంవత్సరం లోని జూన్, జులై మరియు ఆగస్టు నెలల కాలాని కి- పొడిగించడం జరుగుతుంది అంటూ గౌరవనీయ ఆర్థిక మంత్రి 2020 వ సంవత్సరం మే నెల 13 వ తేదీ నాడు ప్రకటన చేశారు. 

తక్కువ వేతనాన్ని అందుకొంటున్న శ్రమికుల కు ఎదురయ్యే క్లేశాల ను ఉపశమింపజేయడానికి ప్రభుత్వం ఎప్పటికి అప్పుడు చేపడుతున్న చర్యల పట్ల సంబంధిత వర్గాలు చాలా చక్కనైన రీతి లో సమ్మతి ని వ్యక్తం చేస్తూ వస్తున్నాయి.