లోక్ కల్యాణ్ మార్గ్ లో గల ప్రధాన మంత్రి కార్యాలయం (పిఎంఒ)లోని అధికారులు మరియు సిబ్బంది కోసం ఈ రోజు న దీపావళి మిలన్ ను నిర్వహించడమైంది. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రతి ఒక్కరి కి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.
పిఎంఒ సిబ్బంది అంతా చక్క గా పని చేస్తున్నారని ప్రధాన మంత్రి ప్రశంసిస్తూ, ప్రభుత్వం చేసినటువంటి పరివర్తనాత్మకమైన కృషి అంతా కూడాను సిబ్బంది యొక్క నిరంతరమైనటువంటి కఠోర శ్రమ వల్ల సాధ్యపడిందన్నారు. మునుపటి సంవత్సరం లో ఏం జరిగిందో ఒక సారి సమీక్షించుకొని, రానున్న సంవత్సరం లో మరిన్ని ఉన్నత శిఖరాల ను అధిరోహించడం కోసం పాటు పడవలసిందంటూ ప్రధాన మంత్రి సిబ్బంది ని ఉత్సాహపరచారు.
యావత్తు ప్రభుత్వ వ్యవస్థ కు పిఎంఒ ఒక ఆదర్శప్రాయమైనటువంటి నమూనా గా వ్యవహరిస్తుంది అని ప్రధాన మంత్రి అన్నారు. పిఎంఒ కేవలం కార్యాలను నిర్వహించేదే కాక స్ఫూర్తి ని నింపేదీ మరియు మార్గదర్శనం చేసేదీ కూడాను అని ఆయన చెప్పారు. సిబ్బంది తమ పని విధానం తో, నిబద్దత తో ప్రభుత్వం లోని మిగిలిన అందరి కి ప్రేరణ ను అందించాలి అని ప్రధాన మంత్రి విజ్ఞప్తి చేశారు. భారతదేశం స్వాతంత్ర్యం సముపార్జించుకొని 2022వ సంవత్సరం కల్లా తన 75వ వార్షికోత్సవాన్ని జరుపుకొనే కన్నా ముందుగానే సాధించుకోవలసివున్నటువంటి లక్ష్యాల ను గురించి ఆయన ఈ సందర్భం లో ప్రస్తావించారు.
కోట్లాది పౌరుల ఆకాంక్షల ను మరియు కలల ను నెరవేర్చే దిశ గా పిఎంఒ కృషి చూస్తూవుండాలని ప్రధాన మంత్రి అన్నారు.
***