Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పిఎంఒ లో అధికారుల తో మరియు సిబ్బంది తో స‌మావేశ‌మైన ప్ర‌ధాన మంత్రి


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు న సౌత్ బ్లాక్ లోని ప్ర‌ధాన మంత్రి కార్యాల‌యం (పిఎంఒ) అధికారుల తో, సిబ్బంది తో భేటి అయ్యి వారి కి ధన్యవాదాలు తెలిపారు.

ఇటీవ‌ల ముగిసిన సాధార‌ణ ఎన్నిక‌ల లో ప్ర‌ధాన మంత్రి ఘ‌న విజ‌యాన్ని సాధించినందుకు పిఎంఒ లోని సీనియ‌ర్ అధికారులు ప్ర‌ధాన మంత్రి కి అభినంద‌న‌ లు తెలిపారు. సీనియ‌ర్ అధికారుల లో ప్ర‌ధాన మంత్రి కి ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ నృపేంద్ర మిశ్రా, ఎన్ఎస్ఎ శ్రీ అజిత్ డోభాల్, అడిశనల్ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ పి.కె. మిశ్రా ల‌తో పాటు ప్ర‌ధాన మంత్రి కి కార్య‌ద‌ర్శి శ్రీ భాస్క‌ర్ ఖుల్ బే లు కూడా ఉన్నారు.

గ‌డ‌చిన అయిదు సంవ‌త్స‌రాలు గా పిఎంఒ లో ప‌ని చేసిన‌ వారంద‌రూ క‌న‌బ‌ర‌చిన స‌మ‌ర్ప‌ణ భావాన్ని మ‌రియు కృషి ని ప్ర‌ధాన మంత్రి ప్ర‌శంసించారు. భార‌త‌దేశ ప్ర‌జ‌ల ఆశ‌ల ను, ఆకాంక్ష‌ల ను నెర‌వేర్చ‌డం లో ఒక కీల‌క‌ పాత్ర ను పోషించ‌డం కోసం మ‌రింత క‌ఠోరం గా శ్ర‌మించ‌డాని కి వారి ని వారు పున‌రంకితం చేసుకోవాలంటూ ప్ర‌తి ఒక్క‌రి కి ప్ర‌ధాన మంత్రి ఈ సంద‌ర్భం గా విజ్ఞ‌ప్తి చేశారు.

ప్ర‌భుత్వం పైన ప్ర‌జ‌లు ఎన్నో ఆశ లు పెట్టుకొన్నార‌ని, ఈ ఆశ లు శాయ‌శ‌క్తులా కృషి చేయ‌డం కోసం టీమ్ పిఎంఒ కు శ‌క్తి ని ప్రసాదిస్తాయని ఆయ‌న అన్నారు.

త‌న జ‌ట్టు లోని ప్ర‌తి ఒక్క స‌భ్యుడు/ స‌భ్యురాలు అందించినటువంటి తోడ్పాటు ను ప్ర‌ధాన మంత్రి గుర్తిస్తూ, గ‌త అయిదేళ్ళ కాలం చివరకు త‌న‌ కు సైతం నేర్చుకొనే కాలం గా గడచిందని ఆయ‌న చెప్పారు.

పిఎంఒ అధికారుల యొక్క కుటుంబ స‌భ్యుల కు ఆయ‌న ధన్యవాదాలు పలుకుతూ, మరి అలాగే వారి కి తన శుభాకాంక్ష‌ల ను కూడా అందజేశారు.