Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పాలస్తీనా అధ్యక్షునితో ప్రధాన మంత్రి సమావేశం

పాలస్తీనా అధ్యక్షునితో ప్రధాన మంత్రి సమావేశం


న్యూయార్క్ లో నిన్నటి రోజు (సెప్టెంబర్ 22)న జరిగిన ‘ది సమిట్ ఆఫ్ ది ఫ్యూచర్’ సందర్భంగా పాలస్తీనా అధ్యక్షుడు శ్రీ మహమూద్ అబ్బాస్ తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ భేటీ అయ్యారు.

గాజాలో తలెత్తిన మానవ సంక్షోభం పట్లఆ ప్రాంతంలో అంతకంతకు క్షీణిస్తున్న ప్రజల భద్రత పట్ల ప్రధాన మంత్రి తీవ్ర ఆందోళనను వ్యక్తం చేశారుపాలస్తీనాకు మానవతాపూర్వక సాయం కొనసాగించడంతోపాటుపాలస్తీనా ప్రజలకు భారతదేశం సమర్థన చెక్కుచెదరక నిలుస్తుందని ప్రధాని ఈ సందర్భంగా పునరుద్ఘాటించారుఇజ్రాయల్పాలస్తీనా అంశంలో భారత్ అనుసరిస్తున్న సిద్ధాంతబద్ధ వైఖరి కాలపరీక్షకు తట్టుకొని నిలిచిన సంగతిని ప్రధాని మరో మారు గుర్తు చేశారుకాల్పులను విరమించాలనిబందీలను విడుదల చేయాలని పిలుపునిచ్చారుసంభాషణలుదౌత్యం బాటలోకి తిరిగి రావాలసిందిగా ఆయన విజ్ఞప్తి చేశారురెండు దేశాల ఏర్పాటు ఒక్కటే ఆ ప్రాంతంలో చిర శాంతినీస్థిరత్వాన్నీ స్థాపించగలుగుతుందని ఆయన అన్నారుపాలస్తీనాను గుర్తించిన మొట్టమొదటి దేశాలలో ఒక దేశంగా భారత్ ఉండిందనిఐక్యరాజ్యసమితిలో పాలస్తీనాకు సభ్యత్వం ఇవ్వాలన్న అంశానికి భారతదేశం మద్దతు అందిస్తోందని తెలియజేశారు.

విద్యఆరోగ్య సంరక్షణ రంగాల్లోనూసామర్థ్యాల పెంపుదల సంబంధిత ఇతరేతర అంశాల్లో పాలస్తీనాకు భారతదేశం ఇప్పుడు అందిస్తున్న సమర్ధనసహకారాలతో పాటు ఐరాసలో పాలస్తీనాకు భారత్ సంఘీభావం సహా భారత్పాలస్తీనా ద్వైపాక్షిక సంబంధాలలో వివిధ పార్శ్వాలపై ఇద్దరు నేతలు నిర్మాణాత్మక చర్చలు జరిపారు.  భారత్పాలస్తీనాల ద్వైపాక్షిక సంబంధాలను మరింత విస్తరించడానికి ఇరువురు నేతలు అంగీకరించారు.