Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పాలనలో డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, కృత్రిమ మేధ, డేటా: అప్పుడే ప్రపంచ ప్రజ జీవితాల్లో మార్పు, అందరికీ అభివృద్ధి: ప్రధానమంత్రి

పాలనలో డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, కృత్రిమ మేధ, డేటా:  అప్పుడే ప్రపంచ ప్రజ జీవితాల్లో మార్పు, అందరికీ అభివృద్ధి: ప్రధానమంత్రి


అభివృద్ధి ఫలాలను అందరికీ అందించడానికి, ప్రపంచ వ్యాప్తంగా మానవ జీవనంలో పెనుమార్పులను తీసుకు రావడానికి డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను, కృత్రిమ మేధను, డేటాను పాలనలో వినియోగించుకోవడం ముఖ్యమని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రధానంగా చెప్పారు.

ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) డైరెక్టర్ జనరల్ డాక్టర్ నగోజీ ఒకాన్జో-ఇవియెలా పొందుపరచిన ఒక సందేశానికి శ్రీ నరేంద్ర మోదీ స్పందించారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఇలా పేర్కొన్నారు:

‘‘మీరు వ్యక్తం చేసిన వెల కట్టలేనటువంటి అభిప్రాయాలకు, మీరు అందిస్తున్న మద్దతుకు నా ధన్యవాదాలు. అభివృద్ధి ఫలాలు అందరికీ చేరేటట్లు చూడటంలోనూ, ప్రపంచం అంతటా మానవ జీవనంలో మంచి మార్పులను తీసుకు రావడంలోనూ డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్టక్చర్, కృత్రిమ మేధ, డేటాను పాలనలో భాగంగా చేయడానికి పెద్దపీట వేయడం కీలకం.@NOIweala”