Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పార్ల‌మెంటు స‌భ్యుల కోసం వెస్టర్న్ కోర్ట్ ఎనెక్స్ లో నూత‌నంగా నిర్మించిన తాత్కాలిక వ‌స‌తి ని ప్రారంభించిన‌ ప్ర‌ధాన మంత్రి

న్యూ ఢిల్లీ లో నూత‌నంగా నిర్మించిన‌ వెస్టర్న్ కోర్ట్ ఎనెక్స్ ను ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. ఈ భ‌వ‌నం పార్ల‌మెంటు స‌భ్యులకు తాత్కాలిక వ‌స‌తి గా ఉంటుంది.

ఈ సందర్భంగా ప్ర‌ధాన మంత్రి ఉపన్యాసమిస్తూ, లోక్ స‌భ స్పీక‌ర్ శ్రీ‌మ‌తి సుమిత్ర మ‌హాజ‌న్ ఈ ప్రోజెక్టు ను పూర్తి చేయ‌డంలో చేసిన కృషిని ప్ర‌శంసించారు. శ్రీ‌మ‌తి సుమిత్ర మ‌హాజ‌న్ ఎల్ల‌ప్పుడూ పార్ల‌మెంట్ స‌భ్యుల శ్రేయాన్నే దృష్టిలో పెట్టుకొంటారు అని ఆయ‌న అన్నారు. ఈ ప్రోజెక్టు లో ప్ర‌తి అంశంలోనూ ఆమె క‌న‌బ‌ర‌చిన ద‌యాళుత్వం ప్రతిబింబిస్తోంద‌ని ఆయ‌న చెప్పారు.

ఈ ప్రోజెక్టు అనుకొన్న స‌మ‌యానికి లోప‌లే, అంచ‌నా వేసుకొన్న వ్యయంలోగానే చ‌క్క‌గా పూర్తి అయింద‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు. ఈ ప‌థ‌కం నిర్మాణంలో పాలుపంచుకొన్న అంద‌రినీ ఆయ‌న అభినందించారు.

పార్ల‌మెంటు స‌భ్యులు కొత్త‌గా ఎన్నికైన‌ప్పుడు హోటళ్ళ‌లో ఉండవలసి వ‌స్తోంద‌ని, ఇటువంటి సంద‌ర్భాలు ప‌తాక శీర్షిక‌ల‌కు ఎక్కుతున్నాయ‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు. ఏమైనప్పటికీ, మునపటి అధివాసులు నిర్దేశించిన అవ‌ధి క‌న్నా అధిక కాలం పాటు మ‌కాం పెడుతున్న సంగ‌తిని ప‌ట్టించుకోవడం జరగడంలేదని ఆయ‌న చెప్పారు.

కేంద్ర ప్ర‌భుత్వం డాక్ట‌ర్ బాబాసాహెబ్ ఆమ్బేడ్ కర్ చూపిన మార్గం లో ముందుకు పోతోంద‌ని ప్ర‌ధాన మంత్రి స్ప‌ష్టం చేశారు. సామ‌ర‌స్యం మ‌రియు ఐక‌మ‌త్యం.. ఇవి డాక్ట‌ర్ ఆమ్బేడ్ కర్ ప్ర‌వ‌చించిన ఆద‌ర్శాల‌లో కీల‌క‌మైన‌వ‌ని ప్రధాన మంత్రి వివ‌రించారు. నిరుపేద‌ల సంక్షేమానికి పాటుప‌డ‌డ‌మే ప్ర‌భుత్వ ధ్యేయ‌మ‌ని కూడా ఆయన తెలిపారు.

బాబాసాహెబ్ ఆమ్బేడ్ కర్ ను స్మ‌రించుకొనేందుకు న్యూ ఢిల్లీ లోని 26 అలీపుర్ రోడ్డు లో ఒక కట్టడాన్ని ఆయ‌న జ‌యంతి దినమైన ఏప్రిల్ 13 వ తేదీ నాడు ప్రారంభించ‌డం జ‌రుగుతుంద‌ని ప్ర‌ధాన మంత్రి ప్ర‌క‌టించారు. డాక్ట‌ర్ ఆమ్బేడ్ కర్ పేరిట కొంత మంది వ్య‌క్తులు చేస్తున్నటువంటి రాజ‌కీయాల‌ను ఆయ‌న ఖండించారు.

***