పార్లమెంట్ శీతకాల సమావేశాలు ఈ రోజు నుండి ఆరంభం అవుతున్న సందర్భం లో ఉప రాష్ట్రపతి కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఎగువ సభ లోకి స్వాగతం చెప్పారు. అంతేకాకుండా, ప్రధాన మంత్రి రాజ్య సభ ను ఉద్దేశించి ప్రసంగించారు కూడాను.
దేశ ప్రజలు అందరి తరఫున, అలాగే పార్లమెంటు లో సభ్యులు గా ఉన్న వారందరి పక్షాన భారతదేశం యొక్క ఉప రాష్ట్రపతి మరియు రాజ్య సభ యొక్క చైర్ మన్ శ్రీ జగ్ దీప్ ధన్ ఖడ్ కు అభినందనల ను వ్యక్తం చేస్తూ ప్రధాన మంత్రి తన ప్రసంగాన్ని మొదలు పెట్టారు.
దేశ ఉప రాష్ట్రపతి తాలూకు ప్రతిష్టాత్మకమైనటువంటి పదవి ని గురించి ప్రధాన మంత్రి వివరిస్తూ, ఆ పదవే లక్షల కొద్దీ జనుల లో ప్రేరణ ను కలిగించేటటువంటి ఒక మాధ్యం అని అభివర్ణించారు.
రాజ్య సభ చైర్ మన్ ను ఉద్దేశించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, ఈ రోజు న సాయుధ దళాల పతాక దినం కూడా అయినందుకు హర్షాన్ని వెలిబుచ్చారు. సభ లోని సభ్యులు అందరి పక్షాన ప్రధాన మంత్రి సాయుధ దళాల కు ప్రణామాన్ని ఆచరించారు. ఉప రాష్ట్రపతి జన్మస్థలం అయిన ఝంఝునూ ను గురించి ప్రధాన మంత్రి ప్రస్తావించి, దేశ ప్రజల కు సేవ చేసే దిశ లో ఝంఝునూ కు చెందిన అనేక కుటుంబాలు ఒక పురోగామి భూమిక ను పోషించాయి అని అభివర్ణించారు. రైతుల తో, జవానుల తో ఉప రాష్ట్రపతి కి ఉన్న సన్నిహితమైన అనుబంధాన్ని గురించి ఆయన ప్రముఖం గా ప్రకటిస్తూ, ‘‘మన ఉప రాష్ట్రపతి గారు ఒక రైతు బిడ్డ; అంతేకాదు, ఆయన చదువుకున్నది ఒక సైనిక పాఠశాల లో. ఈ కారణం గా కిసానుల తో, జవానుల తో ఆయన కు సన్నిహితమైన అనుబంధం ఉంది’’ అని వెల్లడించారు.
భారతదేశం రెండు మహత్తరమైన ఘట్టాల కు సాక్షిభూతం గా నిలచినటువంటి కాలం లో ఉప రాష్ట్రపతి కి పార్లమెంట్ ఎగువ సభ స్వాగతం పలుకుతున్నది అని ప్రధాన మంత్రి అన్నారు. భారతదేశం స్వాతంత్య్రం తాలూకు అమృత కాలం లోకి అడుగుపెట్టింది. అంతేకాక జి20 శిఖర సమ్మేళనాని కి ఆతిథేయి గా ఉండేటటువంటి మరియు ఆ శిఖర సమ్మేళనాని కి అధ్యక్షత ను వహించేటటువంటి ప్రతిష్టాత్మకమైన అవకాశాన్ని కూడా దక్కించుకొంది అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. భారతదేశం రాబోయే రోజుల లో న్యూ ఇండియా యొక్క అభివృద్ధి తాలూకు ఒక కొత్త యుగాన్ని ఆవిష్కరించడం తో పాటుగా ప్రపంచం ఏ దిశ లో పయనించాలి అనేది ఖరారు చేయడం లో ఒక ముఖ్య పాత్ర ను కూడా పోషించనుంది అని ఆయన అన్నారు. ‘‘ఈ యాత్ర లో మన ప్రజాస్వామ్యాని కి, మన పార్లమెంటు కు మరియు మన పార్లమెంటరీ వ్యవస్థ కు ఒక కీలకమైన పాత్ర ఉంటుంది’’ అని ఆయన అన్నారు.
ఉప రాష్ట్రపతి పదవీ కాలం ఈ రోజు న రాజ్య సభ చైర్ మన్ గా లాంఛనప్రాయం గా మొదలవుతోంది అనే విషయాన్ని ప్రధాన మంత్రి స్పష్టం చేస్తూ, సామాన్య మానవుని కి ఆందోళనకరం గా మారే అంశాల తో ఎగువ సభ భుజస్కంధాల పైన నిలిపిన బాధ్యత కు అనుబంధం ఉందన్న సంగతి ని తెలియజేశారు. ‘‘ఈ కాలం లో భారతదేశం తన యొక్క బాధ్యత లు ఏమిటి అనేది అర్థం చేసుకొని మరి ఆ బాధ్యతల ను నిర్వర్తిస్తుంది’’ అని కూడా ఆయన అన్నారు. భారతదేశం లో ప్రతిష్టాత్మకమైన ఆదివాసీ సమాజం రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్మూ రూపం లో ఈ ముఖ్యమైన దశ లో దేశాని కి మార్గాన్ని చూపుతున్నది అని ప్రధాన మంత్రి అన్నారు. ఆదరణ కు నోచుకోకుండా నిలచిపోయిన సముదాయం లోని వ్యక్తి అయినప్పటికీ పూర్వ రాష్ట్రపతి శ్రీ రాం నాథ్ కోవింద్ దేశం లో శిఖర సమానమైన పదవి ని అందుకొన్నారు అనే విషయాన్ని కూడా ప్రధాన మంత్రి ఈ సందర్భం లో ప్రస్తావించారు.
అధ్యక్ష పీఠం పట్ల ఆదరణయుక్త భావన ను ప్రధాన మంత్రి వ్యక్తం చేస్తూ, ‘‘ఒక వ్యక్తి వద్ద అన్ని వనరులు ఉంటే చాలదు, ఆ వ్యక్తి అభ్యసనశీలి మరియు గ్రహణ శక్తి కలిగిన వ్యక్తి కూడా అయి ఉంటేనే ఏదైనా సాధించగలుగుతారు అని చెప్పుకోవడానికి మీ జీవనమే నిదర్శన గా ఉంది’’ అన్నారు. ఒక సీనియర్ లాయరు గా మూడు దశాబ్దాల కు పైగా అనుభవం ఉప రాష్ట్రపతి కి ఉందనే సంగతి ని ప్రధాన మంత్రి శ్రోత ల దృష్టి కి తీసుకు వస్తూ, ఆయన ఈ సభ లో ఉన్నప్పటికీ న్యాయస్థానాన్ని మరచిపోజాలరు; ఇలా ఎందుకు చెప్తున్నాను అంటే రాజ్య సభ లో ఉన్న చాలా మంది ఆయన తో సుప్రీం కోర్టు లో భేటీ అయిన అటువంటి వారే అని ప్రధాన మంత్రి సరదా గా వ్యాఖ్యానించారు. ‘‘మీరు కూడాను ఎమ్ఎల్ఎ మొదలుకొని ఎమ్ పి, కేంద్ర మంత్రి, ఇంకా గవర్నర్ గా కూడా పని చేశారు’’ అని ప్రధాన మంత్రి అన్నారు. ఈ భూమిక లు అన్నిటికి ఉన్న ఒక ఉమ్మడి అంశం ఏది అంటే గనుక అది దేశం మరియు ప్రజాస్వామిక విలువల అభివృద్ధి కి ఆయన లో ఉన్నటువంటి సమర్పణ భావం అనేదే అని కూడా ప్రధాన మంత్రి చెప్పారు. ఉప రాష్ట్రపతి ఎన్నికల లో శ్రీ జగ్ దీప్ ధన్ ఖడ్ 75 శాతం ఓట్ల ను రాబట్టుకొన్న సంగతి ని కూడా ప్రధాన మంత్రి గుర్తుకు తీసుకు వస్తూ, అది ఆయన అంటే ప్రతి ఒక్కరి లో ఉన్న స్నేహ భావన కు రుజువు అని పేర్కొన్నారు. ‘‘దారి చూపడం అనేది నాయకత్వం తాలూకు సిసలైన నిర్వచనం. అంతేకాదు, అది రాజ్య సభ పరం గా చూసినప్పుడు మరింత ముఖ్యమైన విషయం అవుతుంది. దీనికి కారణం ప్రజాస్వామ్యయుక్త నిర్ణయాల ను మరింత పరిణతి ని ప్రదర్శించే రీతి లో ముందుకు తీసుకు పోవలసిన బాధ్యత ఈ సభ కు ఉండడమే.’’ అని ప్రధాన మంత్రి వ్యాఖ్యానించారు.
సభ యొక్క గౌరవాన్ని కాపాడడం తో పాటు మరింతగా పెంపు చేయవలసిన బాధ్యత కూడా ఈ సభ లోని సభ్యుల కు ఉంది అని ప్రధాన మంత్రి సూచిస్తూ, దేశం యొక్క ఘనమైనటువంటి ప్రజాస్వామిక వారసత్వాన్ని ఈ సభ నిలబెడుతూ వచ్చింది. అంతేకాదు, ప్రజాస్వామ్యాని కి బలం గా కూడా ఈ సభ ఉంది అన్నారు. పూర్వం ప్రధానులు గా జాతి కి సేవల ను అందించిన ఎంతో మంది ఏదో ఒక కాలం లో రాజ్య సభ లో సభ్యులు గా ఉన్నటువంటి వారే అనే విషయాన్ని కూడా ఆయన ప్రముఖం గా ప్రస్తావించారు. ఉప రాష్ట్రపతి యొక్క మార్గదర్శకత్వం లో ఈ సభ ఈ యొక్క వారసత్వాన్ని మరియు ఈ యొక్క గౌరవాన్ని ముందుకు తీసుకు పోగలదు అంటూ ప్రధాన మంత్రి సభ్యుల కు హామీ ని ఇచ్చారు. ‘‘సభ లో జరిగే గంభీరమైన ప్రజాస్వామ్యయుక్త చర్చోపచర్చలు ‘ప్రజాస్వామ్యాని కి జనని భారతదేశం’ అని గర్వం గా చెప్పుకొనే మన కు ఇతోధిక శక్తి ని అందిస్తుంది’’ అని ఆయన అన్నారు.
పూర్వ ఉప రాష్ట్రపతి మరియు పూర్వ చైర్ మన్ పలికిన పదబంధాలు మరియు ప్రాస లు సభ్యుల కు సంతోషాన్ని కలిగించడంతో పాటు నవ్వుల ను కూడా పంచాయి అంటూ ప్రధాన మంత్రి తన ప్రసంగాన్ని ముగించే సమయం లో జ్ఞాపకాని కి తెచ్చుకొన్నారు. ‘‘మీ చమత్కార భరిత స్వభావం ఈ లోటు ను ఎన్నటికీ పట్టి చూపనీయదు, మరి మీరు సభ కు ఈ యొక్క మేలు ను అందించడాన్ని తప్పక కొనసాగిస్తారనే నేను నమ్ముతున్నాను’’ అని ప్రధాన మంత్రి అన్నారు.
****
Speaking in the Rajya Sabha. https://t.co/1sMsERCMzU
— Narendra Modi (@narendramodi) December 7, 2022
Our Vice President is a Kisan Putra and he studied at a Sainik school.
— PMO India (@PMOIndia) December 7, 2022
Thus, he is closely associated with Jawans and Kisans: PM @narendramodi speaking in the Rajya Sabha
This Parliament session is being held at a time when we are marking Azadi Ka Amrit Mahotsav and when India has assumed the G-20 Presidency: PM @narendramodi
— PMO India (@PMOIndia) December 7, 2022
Our respected President Droupadi Murmu Ji hails from a tribal community. Before her, our former President Shri Kovind Ji belongs to the marginalised sections of society and now, our VP is a Kisan Putra. Our VP also has great knowledge of legal matters: PM @narendramodi
— PMO India (@PMOIndia) December 7, 2022