Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పార్లమెంట్ లో ప్రవేశపెట్టడం కోసం సంస్కరించిన మర్చంట్ షిప్పింగ్ బిల్లు, 2016 ను ఆమోదించిన మంత్రిమండలి; మర్చంట్ షిప్పింగ్ చట్టం, 1958 ని, మరియు కోస్టింగ్ వెజల్స్ చట్టం, 1838 ని ఏకకాలంలో రద్దు పరచడానికి కూడా ఆమోదం తెలిపిన మంత్రిమండలి


పార్లమెంట్ లో ప్రవేశపెట్టడం కోసం సంస్కరించిన మర్చంట్ షిప్పింగ్ బిల్లు, 2016ను కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ కేంద్ర మంత్రివ‌ర్గ స‌మావేశానికి అధ్య‌క్ష‌త వ‌హించారు.

మర్చంట్ షిప్పింగ్ చట్టం, 1958 యొక్క సంస్కరించిన కథనమే మర్చంట్ షిప్పింగ్ బిల్లు, 2016. ఈ బిల్లు.. 1958 నాటి మర్చంట్ షిప్పింగ్ చట్టం, 1958 రద్దు కు, దానితో పాటే కోస్టింగ్ వెజల్స్ చట్టం, 1838 యొక్క రద్దుకు కూడా వీలు కల్పిస్తుంది.

1958 నాటి మర్చంట్ షిప్పింగ్ చట్టం ఎప్పటికప్పుడు చేసిన అనేక సవరణల మూలంగా , కొన్ని సంవత్సరాలలో భారీ శాసనంగా మారిపోయింది. 1966-2014 సంవత్సరాల మధ్య ఈ చట్టం 17 సార్లు సవరణలకు లోనైంది. ఫలితంగా సెక్షన్ ల సంఖ్య పెరిగి 560కి మించాయి. ఈ బిల్లులో ఈ నిబంధనలను చాలా జాగ్రత్తగా కుదించి 280కి తీసుకువచ్చారు.

ఈ బిల్లులోని నిబంధనలు భారతదేశంలోని వాణిజ్య నౌకా వ్యాపారాన్ని నియంత్రించే చట్టాన్ని సరళతరం చేయగలవు. అంతే కాకుండా, వ్యాపార నిర్వహణ, పారదర్శకత మరియు సమర్థంగా సేవలను అందించడం కోసం పాత చట్టంలోని కాలం చెల్లిన కొన్ని నిబంధనలను తొలగించి, మిగిలిన నిబంధనల్ని సరళీకరించి, స్థిరీకరించడం జరుగుతుంది.

ఈ బిల్లు అమలుతో ముందుకువచ్చే ముఖ్యమైన సంస్కరణలు ఏవేవంటే :

A. క్రింది చర్యల ద్వారా భారతీయుల ఓడ సరుకుల ప్రోత్సాహాన్ని/ భారతదేశంలోని కోస్టల్ షిప్పింగ్ అభివృద్ధిని బలోపేతం చేయడం :-

a) గణనీయమైన యాజమాన్యపు నౌకలు (సబ్‌స్టాన్షియలీ ఓన్డ్ వెజల్స్- డైరెక్టర్లను ఎన్నుకోవడానికి 50 శాతం కన్నా ఎక్కువ వోటు వేసే యాజమాన్యాన్ని కలిగి ఉండడం) బేర్ బోట్-కం-డిమైజ్ (బి బి సి డి- అద్దెకు ఇవ్వబడిన ఒక నౌక యాజమాన్య హక్కులను నిర్ణీత వ్యవధిలో అద్దెకు తీసుకొన్న వారికి బదిలీ చేయడం) నౌకలను అనుమతించడం. నిర్ణీత కాలానికి భారతీయులు అద్దెకు తీసుకొన్న నౌకలను భారతీయ ఫ్ల్యాగ్ వెజల్స్ (నౌకలు)గా రిజిస్టరు చేయడం.

b). భారతీయుల ఆధిపత్యం లోని ఓడల సరుకును ఒక ప్రత్యేక కేటగిరీగా గుర్తించడం.

c). భారతీయ ఫ్ల్యాగ్ వెజల్స్ యొక్క కోస్టల్ ఆపరేషన్ ల కొరకు మరియు ఓడరేవుల క్లియరెన్సుల కొరకు కస్టమ్స్ అధికారులు జారీ చేసే లైసెన్సుల అవసరాన్ని తొలగించడం.

d). కోస్టల్ షిప్పింగ్ వ్యాపార అభివృద్ధి మరియు ప్రోత్సాహం కోసం కోస్టల్ వెజల్స్ కోసం ప్రత్యేక నియమావళిని రూపొందించడం.

B. నావికుల కోసం క్రింద పేర్కొన్నటువంటి సంక్షేమ చర్యలను ప్రవేశపెట్టడం :-

a). సముద్రపు దొంగల చేతిలో బంధీలు అయిన నావికులకు, వారు విడుదలై క్షేమంగా ఇళ్ళకు తిరిగి చేరేవరకు, జీతాలు అందుతాయి.

b). చేపలు పట్టే ఓడలు, మెకానికల్ ప్రొపల్షన్ లేని ఓడలు, 15 కన్న తక్కువ సరుకులున్న ఓడలతో సహా నౌకా యజమానులు తమ సిబ్బందికి తప్పనిసరిగా బీమా చేయించాలి.

c). షిప్పింగ్ మాస్టర్ సమక్షంలో నౌకా సిబ్బంది ఆర్టికల్స్ ఆఫ్ అగ్రిమెంట్ మీద సంతకం చేయాల్సిన అవసరం ఇక వుండదు.

C. ఎటువంటి చట్టం కిందకూ రాని కొన్ని రకాల అవశిష్ట నౌకలు మరియు రక్షణ సంబంధ అంశాలకు సరఫరా చేసే నౌకలకు రిజిస్ట్రేషన్.

D. అన్ని అంతర్జాతీయ మారిటైం ఆర్గనైజేషన్ (ఐ ఎమ్ ఒ) సంప్రదాయాలను, ప్రోటోకాల్స్ ను భారతీయ చట్టాలలోకి తాజాగా తీసుకొని రావడం (01-01-2016 నుండి తప్పనిసరి చేసిన ఐ ఎమ్ ఒ సభ్యత్వ దేశాల ఆడిట్ స్కీముకు అనుగుణంగా ఇది తప్పనిసరి.) ఈ క్రింది 7 వివిధ సంప్రదాయాలకు సంబంధించి నిబంధనలను పొందుపరుస్తారు.

a). ఇంటెర్ వెన్షన్ కన్వెన్షన్,1969,

b). ద సెర్చ్ అండ్ రెస్క్యూ కన్వెన్షన్, 1979

,

c). షిప్స్ అనుబంధం IV నుండి మెరైన్ పొల్యూషన్ కన్వెన్షన్ దాకా కాలుష్య నిరోధ ప్రోటోకాల్

,

d). షిప్స్ బల్లాస్ట్ వాటర్ అండ్ సెడిమెంట్స్ యొక్క నియంత్రణ మరియు నిర్వహణ కన్వెన్షన్, 2004,

e). ద నైరోబీ రెక్ రిమూవల్ కన్వెన్షన్ , 2007,

f). ద సాల్వేజ్ కన్వెన్షన్ 1989 తో పాటు

g). బంకర్ ఆయిల్ పొల్యూషన్ డ్యామేజ్ కొరకు అంతర్జాతీయ కన్వెన్షన్, 2001

.

అంతే కాకుండా, భారతీయ షిప్పింగ్ పరిశ్రమకు అనువుగా సరళీకరించడం కోసం ప్రస్తుతం ఉన్న చట్టంలో వివిధ భాగాలలో చెల్లాచెదరుగా ఉన్న నౌకల యొక్క సర్వే, తనిఖీ మరియు సెర్టిఫికేషన్‌లను ఒక దగ్గరికి చేర్చారు. యావత్తు భారతదేశంలోని నౌకల రిజిస్ట్రేషన్ కోసం మర్చంట్ షిప్పింగ్ బిల్లు, 2016లో నిబంధనలను ప్రవేశపెట్టడం వల్ల, సౌరాష్ట్ర మరియు కచ్ పరిధికి పరిమితమైన యంత్ర రహితంగా నడిచే నౌకల రిజిస్ట్రేషన్ కోసం ప్రవేశ పెట్టిన బ్రిటిష్ పాలన నాటి కాలం చెల్లిన చట్టం ద కోస్టింగ్ వెజల్స్ యాక్ట్, 1838ని ఉపసంహరించాలని ప్రతిపాదించడం జరిగింది.