Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పార్లమెంట్ పూర్వ సభ్యుడు శ్రీ ప్రభాత్ ఝా మృతికి ప్రధాన మంత్రి సంతాపం


పార్లమెంట్ పూర్వ సభ్యుడు శ్రీ ప్రభాత్ ఝా మృతి పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రగాఢ దుఃఖాన్ని వ్యక్తం చేశారు.

 

శ్రీ ప్రభాత్ ఝా కనబరచిన నిర్వహణపరమైన సామర్థ్యాన్ని, పత్రికా రచన రంగానికి ఆయన అందించిన తోడ్పాటును ప్రధాన మంత్రి గుర్తుకు తెచ్చుకొన్నారు.

 

ప్రధాన మంత్రి ‘ఎక్స్’ లో ఈ క్రింది విధంగా పేర్కొన్నారు –

 

‘‘బిజెపి లో సీనియర్ నేత, పూర్వ ఎంపి ప్రభాత్ ఝా గారు ఇకలేరని తెలిసి అత్యంత దు:ఖం కలిగింది.  నేను ఆయన కార్యశైలిని అతి సమీపం నుంచి గమనించాను.  సంస్థను బలపరచడంలో ఆయన ఏ విధంగా చురుకైన పాత్రను పోషించిందీ నేనెరుగుదును.  ప్రజలకు సేవ చేయడానికి తాను పూనుకొన్న కార్యాలతో పాటు పత్రికా రచన, రచన వ్యాసంగం రంగంలో కూడా ఆయన అమూల్యమైనటువంటి తోడ్పాటును అందించారు. ఈ శోక ఘడియలలో ఆయన ఆత్మీయులకు, ఆయనను అభిమానించే వారికి కలిగిన శోకం లో నేను సైతం పాలుపంచుకొంటున్నాను. ఓం శాంతి.’’