Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పార్లమెంట్ నూతన భవనం కప్పు పైనచెక్కినటువంటి జాతీయ చిహ్నాన్ని ఆవిష్కరించిన ప్రధాన మంత్రి

పార్లమెంట్ నూతన భవనం కప్పు పైనచెక్కినటువంటి జాతీయ చిహ్నాన్ని ఆవిష్కరించిన ప్రధాన మంత్రి


పార్లమెంట్ నూతన భవనం పై కప్పు మీద చెక్కినటువంటి జాతీయ చిహ్నాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న ఉదయం ఆవిష్కరించారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –

‘‘పార్లమెంట్ నూతన భవనం పై కప్పు మీద చెక్కినటువంటి జాతీయ చిహ్నాన్ని ఈ రోజు న ఉదయం పూట ఆవిష్కరించే గౌరవం నాకు లభించింది.’’ అని పేర్కొన్నారు.

 

కొత్త పార్లమెంట్ నిర్మాణ పనుల లో పాలుపంచుకొన్న శ్రమజీవుల తో సైతం ప్రధాన మంత్రి భేటీ అయ్యారు.

‘‘పార్లమెంట్ రూపకల్పన లో భాగం పంచుకొన్న శ్రమజీవులతో నేను జరిపిన భేటీ అపురూపమైనటువంటిదిగా ఉంది. వారి ప్రయాసల ను చూసుకొని మనం గర్వపడుతున్నాం; మరి మన దేశ ప్రజల కోసం వారు అందించినటువంటి తోడ్పాటు ను సదా స్మరించుకోవడం జరుగుతూ ఉంటుంది కూడాను’’ అని ప్రధాన మంత్రి తెలిపారు.

జాతీయ చిహ్నాన్ని మొత్తం 9500 కిలోగ్రాముల బరువు కంచు లోహాన్ని కరగించి పోత పోసి తయారు చేయడమైంది. ఆ జాతీయ చిహ్నం ఎత్తు 6.5 మీటర్లు ఉంది. పార్లమెంట్ నూతన భవనం యొక్క కేంద్రీయ రంగశాల కు అగ్రభాగాన ఈ సూచక చిహ్నాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ చిహ్నానికి ఊతం గా దాదాపు గా 6500 కిలోగ్రాముల బరువు తో ఉండే ఒక ఉక్కు నిర్మాణాన్ని నిర్మించారు.

పార్లమెంట్ నూతన భవనం కప్పు మీద జాతీయ చిహ్నాన్ని ఏర్పాటు చేయాలన్న భావన తో పాటు సంబంధిత ప్రక్రియ లు.. బంకమట్టి నమూనా ను తీర్చిదిద్దడం/ కంప్యూటర్ గ్రాఫిక్ ను తయారు చేయడం మొదలుకొని కంచు ను కరిగించి పోత పోయడం మరియు మెరుగులు పెట్టడం వరకు.. ఎనిమిది వివిధ దశల గుండా సాగాయి. ఆ తరువాత తుది రూపు సిద్ధమైంది.

***