పార్లమెంటు సభ్యుల సాంస్కృతిక కార్యక్రమం అనేది వేరు వేరు పార్లమెంటరీ నియోజకవర్గాల ప్రజల కు వారి యొక్క ప్రతిభ ను సాంస్కృతిక ఉత్సవం లో పాల్గొని ప్రదర్శించేందుకు ఉద్దేశించిన ఒక చక్కటి కార్యక్రమం అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. దీని లో పాలుపంచుకొన్నవారందరినీ ప్రోత్సహించవలసింది గా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అందరికీ విజ్ఞప్తి చేశారు.
ప్రధాన మంత్రి ‘X’ మాధ్యం లో ఒక పోస్టు ను పెడుతూ, అందులో –
‘‘పార్లమెంటు సభ్యుల సాంస్కృతిక కార్యక్రమం అనేది ఒక మంచి కార్యక్రమం గా ఉంది. దీని ద్వారా వేరు వేరు పార్లమెంటరీ నియోజక వర్గాల కు చెందిన వారి కి వారి యొక్క ప్రతిభ ను చాటేందుకు మరియు సాంస్కృతిక ఉత్సవం లో భాగం పంచుకొనేందుకు అవకాశం లభిస్తుంది. ప్రస్తుతం భాజపా యొక్క పార్లమెంటు సభ్యులు దీనిని నిర్వహించడం లో అమిత ఉత్సాహం తో జత పడుతున్నారు. ఈ వరుస లో నేను సైతం నా యొక్క నియోజకవర్గమైన కాశీ లో ఒక వినమ్రమైనటువంటి ప్రయాస కు నడుం కట్టాను. ఈ ఉత్సవం లో పాలుపంచుకొంటున్న వారందరికీ తప్పక ఉత్సాహాన్ని పెంపు చేయవలసింది గా మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను’’ అని పేర్కొన్నారు.