Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పారిస్ లో ఫ్రాన్స్ ప్రెసిడెంట్ శ్రీ ఇమాన్యుయేల్ మాక్రాన్ తో చర్చలు జరిపిన ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ

పారిస్ లో ఫ్రాన్స్ ప్రెసిడెంట్ శ్రీ ఇమాన్యుయేల్ మాక్రాన్ తో చర్చలు జరిపిన ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు పారిస్ లో ఫ్రాన్స్ ప్రెసిడెంట్ శ్రీ ఇమాన్యుయేల్ మాక్రాన్ తో సమావేశమయ్యారు.

సమావేశం ముగిసిన అనంతరం ప్రసార మాధ్యమాల ప్రతినిధులతో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ మాట్లాడుతూ, తనకు సాదర స్వాగతం పలికిన ప్రెసిడెంట్ శ్రీ ఇమాన్యుయేల్ మాక్రాన్ కు ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికలలో విజయం సాధించినందుకు శ్రీ ఇమాన్యుయేల్ మాక్రాన్ ను ఆయన అభినందించారు కూడా.

ఫ్రాన్స్ భారతదేశం సంబంధాలు మానవాళికి సంవత్సరాల తరబడి విజయవంతంగా చేస్తూ వచ్చిన సేవలను గురించి, ఇంకా మానవీయ విలువలను గురించి ప్రధాన మంత్రి చెప్పుకొచ్చారు. ఈ సంబంధాలు ఇక మీదట మరింత వేగాన్ని సంతరించుకోగలవన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఈ సందర్భంలో, ఇంటర్ నేషనల్ సోలార్ అలయన్స్ ను గురించి, ఇంకా ఇందుకోసం భారతదేశం మరియు ఫ్రాన్స్ లు సంయుక్తంగా జరిపిన కృషిని గురించి ప్రధాన మంత్రి ప్రస్తావించారు.

పారిస్ ఒప్పందం అనేది యావత్తు ప్రపంచ దేశాలు కలసి పంచుకొన్న వారసత్వమని, మానవాళి భవిష్యత్తు తరాల ఆశల దిశగా ఈ తరం అందించిన కానుక అని ప్రధాన మంత్రి వర్ణించారు. ధరణి మాత ను కాపాడటం మన అందరి సమష్టి కర్తవ్యం అని ఆయన అన్నారు. తన రాజకీయ ప్రస్థానంలో పారిస్ ఒక ముఖ్యమైన భాగం అని ఆయన అభివర్ణించారు. ఈ ఒప్పందం కోసం భారతదేశం, ఫ్రాన్స్ లు భుజం భుజం కలిపి పనిచేశాయని ప్రధాన మంత్రి చెప్పారు.

పర్యావరణాన్ని పరిరక్షించడం భారతీయులకు నమ్మకంతో కూడిన అంశమని, అంతే కాక ఇది శతాబ్దాల వయస్సు కలిగిన సంప్రదాయం అని ప్రధాన మంత్రి వివరించారు.

ఈ ఒడంబడికకు భారతదేశం కట్టుబడి ఉందని, అంతకు మించి, భావి తరాల వారి కోసం ఒక బహుమానాన్ని వదలివెళ్లడం కోసం భారతదేశం ఇతరులతో కలసి పనిచేస్తుందని కూడా ఆయన స్పష్టంచేశారు.

ఉగ్రవాదానికి, సమూల సంస్కరణ వాదానికి ఎదురొడ్డి నిలవడానికి ఏయే మార్గాలు ఉన్నాయన్న దానిపై కూడా తమ ఇరువురు నాయకులు చర్చ జరిపినట్లు ప్రధాన మంత్రి తెలియజేశారు. ఐక్య అభ్యుదయ యూరోపియన్ యూనియన్ కు భారతదేశం అనుకూలంగా ఉన్నట్లు ఆయన చెప్పారు.

***