Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పారిస్ పారాలింపిక్స్ లో ఆర్2 మహిళల 10మీటర్ ల ఎయిర్ రైఫిల్ ఎస్ హెచ్1 ఈవెంట్ లో బంగారు పతకాన్ని గెలిచిన అవని లేఖరా కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు


పారిస్ పారాలింపిక్స్ 2024 లో ఆర్2 మహిళల 10మీటర్ ల ఎయిర్ రైఫిల్ ఎస్ హెచ్1 ఈవెంట్ లో పసిడి పతకాన్ని గెలిచిన భారతీయ షూటర్ అవని లేఖరా ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.

అవని లేఖరా చరిత్రను సృష్టించారుఆమె మూడు పారాలింపిక్ పతకాలను గెలిచిన తొలి భారతీయ మహిళా క్రీడాకారిణిగా ఉన్నారని ప్రధాని అన్నారు.

 

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యమంలో ఈ కింది విధంగా పేర్కొన్నారు:

‘‘పారాలింపిక్స్ 2024 (#Paralympics2024)లో భారతదేశం తన పతకాల ఖాతాను తెరిచింది.

 

 

ఆర్2 మహిళల 10మీటర్ ల ఎయిర్ రైఫిల్ ఎస్ హెచ్1 ఈవెంట్ లో పలువురు క్రీడాకారులు తామే సొంతం చేసుకోవాలని ఆశపడే స్వర్ణ పతకాన్ని గెలిచినందుకు అవని లేఖరా ( @AvaniLekhara ) కు ఇవే అభినందనలు. ఆమె చరిత్రనూ సృష్టించారు.. మూడు పారాలింపిక్ పతకాలను గెలుచుకొన్న ప్రథమ భారతీయ మహిళా క్రీడాకారిణి ఆమెనే మరి! ఆమె అంకిత భావాన్ని చూసుకొని భారత్ గర్వపడుతోంది.

చీర్ ఫర్ భారత్ (#Cheer4Bharat)

 

 

 

***

MJPS/ST