Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పారిస్ ఒలింపిక్స్: భారతీయ క్రీడాకారిణులు, క్రీడాకారుల దళానికి ప్రధాన మంత్రి శుభాకాంక్షలు


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పారిస్ ఒలింపిక్స్ లో పాల్గొంటున్న భారతీయ క్రీడాకారిణులు, క్రీడాకారుల దళానికి ఈ రోజు శుభాకాంక్షలను తెలియజేశారు

 

ప్రతి ఒక్క క్రీడాకారిణి/క్రీడాకారుడు భారతదేశానికి గౌరవ కారకులు అని ప్రధాన మంత్రి చెప్తూ, వారు ప్రతి నాలుగు సంవత్సరాలలో ఒకసారి జరిగే అంతర్జాతీయ క్రీడల ఈవెంట్ 33వ సంచిక లో వారి అత్యుత్తమమైన ఆటతీరు ను ప్రదర్శించడంలో సఫలురు కావాలని ఆకాంక్షించారు.  

 

 

 

ప్రధాన మంత్రి ఎక్స్’ లో ఈ క్రింది విధంగా పేర్కొన్నారు:

‘‘పారిస్ లో #Olympics మొదలవుతున్నాయి. ఒలింపిక్స్ లో పాల్గొంటున్న భారతీయ క్రీడాకారిణులు, క్రీడాకారుల దళానికి నా శుభాకాంక్షలు. ప్రతి ఒక్క క్రీడాకారిణి/క్రీడాకారుడు భారతదేశానికి గౌరవ కారకులుగా ఉన్నారు. వారంతా పారిస్ ఒలింపిక్స్ లో మెరుస్తారని కోరుకుంటున్నాను. మీరు అన్ని ఆటలలో నిజమైన క్రీడాపటిమ కు ప్రతీకలుగా నిలవాలి. మీ అసాధారణమైన ప్రదర్శన మాకు ప్రేరణదాయకంగా నిలవాలి.

 

 

 

***

 

DS/RT