Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పారా ఒలింపిక్స్ లో వెండి ప‌త‌కాన్ని సాధించిన షూట‌ర్ సింగ్ రాజ్ అదానాకు ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర మోదీ అభినంద‌న‌లు


టోక్యోలో నిర్వ‌హిస్తున్న పారా ఒలింపిక్స్ లో భార‌త‌దేశ క్రీడాకారుడు షూట‌ర్ శ్రీ సింగ్ రాజ్ అదానా వెండి ప‌త‌కాన్ని సాధించినందుకు ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర మోదీ అభినంద‌న‌లు తెలిపారు. ట్వీటుద్వారా ప్ర‌శంసించిన ఆయ‌న ప్ర‌తిభావంతుడైన శ్రీ సింగ్ రాజ్ అదానా మ‌రో సారి త‌న ప్ర‌తిభ‌ను ప్ర‌ద‌ర్శించార‌ని అన్నారు. ఈ సారి మిక్స్ డ్ 50 ఎం పిస్ట‌ల్ ఎస్ హెచ్ 1 విభాగంలో ఆయ‌న ప‌త‌కాన్ని సాధించార‌ని, భార‌త‌దేశం గ‌ర్విస్తోంద‌ని ప్ర‌ధాని అన్నారు. ఆయ‌న‌కు అభినంద‌న‌లు తెలిపిన ప్ర‌ధాని భ‌విష్య‌త్తులో మ‌రిన్ని విజ‌యాలు సాధించాల‌ని ఆకాంక్షించారు. 
 

***

 

***

DS/SH