Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పాపువా న్యూ గినీ గవర్నర్ జనరల్ తో ప్రధాన మంత్రి సమావేశం

పాపువా న్యూ గినీ గవర్నర్ జనరల్ తో ప్రధాన మంత్రి సమావేశం


ఫోరమ్ ఫార్ ఇండియా-పసిఫిక్ ఐలండ్స్ కోఆపరేశన్ (ఎఫ్ఐపిఐసి) మూడో శిఖర సమ్మేళనం సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 మే నెల 22వ తేదీ నాడు పోర్ట్ మోరెస్ బీ లోని ప్రభుత్వ అతిథి గృహం లో పాపువా న్యూ గినీ (పిఎన్ జి) గవర్నర్- జనరల్ సర్ శ్రీ బాబ్ డాడే తో సమావేశమయ్యారు.

 

మొట్ట మొదటిసారి గా పాపువా న్యూ గినీ సందర్శన కు తరలి వచ్చిన ప్రధాన మంత్రి కి గవర్నర్- జనరల్ ఆప్యాయం గా స్వాగతం పలికారు. ఇద్దరు నేత లు రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరియు అభివృద్ధి భాగస్వామ్యానికి గల ప్రాముఖ్యం సహా ఇతర అంశాల పట్ల వారి వారి అభిప్రాయాల ను ఒకరి దృష్టి కి మరొకరు తీసుకు వచ్చారు. ఆయా సంబంధాల ను మరింత గా బలపరచాలి అని వారు సమ్మతించారు.

 

 

***