Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పసిఫిక్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ప్రధాని ద్వైపాక్షిక సమావేశాలు

పసిఫిక్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ప్రధాని ద్వైపాక్షిక సమావేశాలు

పసిఫిక్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ప్రధాని ద్వైపాక్షిక సమావేశాలు

పసిఫిక్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ప్రధాని ద్వైపాక్షిక సమావేశాలు

పసిఫిక్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ప్రధాని ద్వైపాక్షిక సమావేశాలు

పసిఫిక్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ప్రధాని ద్వైపాక్షిక సమావేశాలు


జైపూర్లో జరిగిన భారత పసిఫిక్ ద్వీప దేశాల (ఫిపిక్) శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ రాంబాగ్ పేలస్లో ఫిజీ ప్రధాని జోసాయా వి బ్రయాన్మరామా, పపూవా న్యూగినియా ప్రధాని పీటర్ ఒ నీల్, వన్వాటూ రిపబ్లిక్ ప్రధాని సాతో కిల్మాన్, నౌరూ రిపబ్లిక్ ప్రెసిడెంట్ బరోన్ దివావేసి వకా ప్రభృతులతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అలాగే ఫిజీలో భారత సహకారంతో ఒక ఫార్మా తయారీ ప్లాంట్ ఏర్పాటు చేయాలని, టూరిజం విభాగంలో పెట్టుబడులు, సహకారాన్ని ఆయన కోరారు.

రక్షణ, భద్రత విభాగాల్లో ప్రస్తుత సహకారాన్ని విస్తరించుకోవాలని ఉభయులు అంగీకరించారు. ఇందుకోసం త్వరలోనే ఫిజీలో ఉభయ దేశాల ప్రతినిధివర్గాలు సమావేశం అవుతాయి. వ్యవసాయం, పాడిపరిశ్రమ రంగాల్లో సహకరించేందుకు భారత్ హమీ ఇచ్చింది. అలాగే వైపరీత్యాలను దీటుగా ఎదుర్కొనేందుకు అవసరమైన సామర్థాల కల్పనలో కూడా సహకారం అందించేందుకు అంగీకరించింది. భిన్న రంగాల్లో ప్రత్యేకించి నిర్మాణ రంగంలో సహకారంపై వ్యాపారావకాశాలను అన్వేషించేందుకు త్వరలోనే భారత వాణిజ్య ప్రతినిధివర్గాన్ని ఫిజీకి పంపేందుకు కూడా అంగీకారం కుదిరింది.

పపువా న్యూగినియాలో ఇన్ఫ్రా రంగం ప్రత్యేకించి రోడ్లు, హైవేలు, ఎయిర్పోర్ట్ల అభివృద్ధికి సహకరించేందుకు భారత్ అంగీకరించింది. ఇందుకోసం భారత్కు చెందిన ఎగ్జిమ్ బ్యాంకు నుంచి 100 మిలియన్ డాలర్ల ఆర్థిక సహాయాన్ని ఆశిస్తున్నట్టు ఆ దేశం తెలిపింది. ఆ అభ్యర్థనను సానుకూలంగా పరిశీలించేందుకు భారత్ హామీ ఇచ్చింది. రక్షణ, సామర్థ్యాల విస్తరణ, పాలనా వ్యవహారాల నిర్వహణ, ఆరోగ్యం, విద్య, ఆయిల్ గ్యాస్ విభాగాల్లో సహకరించుకునేందుకు ఉభయవర్గాలు అంగీకరించాయి.ఒఎన్జిసి విదేశ్తో ప్రస్తుత సహకారం మరింతగా విస్తరిస్తుందన్న ఆకాంక్షను పపువా న్యూగినియా వ్యక్తం చేసింది. త్వరలోనే ఆ దేశానికి వాణిజ్యప్రతినిధివర్గాన్ని పంపేందుకు భారత్ అంగీకరించింది.

ఐక్యరాజ్యసమితిలో సంస్కరణలు, వన్వాటూలో సామర్థ్యాల విస్తరణపై ప్రధానులిద్దరూ చర్చించారు. ఇందుకోసం ప్రత్యేక కేటాయింపులు చేసుకోవాలని, గుర్తించిన అవసరాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని ఉభయులు నిర్ణయించారు. ఇటీవల పామ్ తుపాను విరుచుకుపడిన సమయంలో 250000 డాలర్ల సహాయం అందించినందుకు వన్వాటూ కృతజ్ఞత ప్రకటించింది.

నానాటికీ పెరిగిపోతున్న సముద్రపు స్థాయిల నుంచి రక్షణ కోసం సముద్రపు గోడల నిర్మాణంలో సహకరించినందుకు నౌరూ కృతజ్ఞతలు తెలిపింది. అభివృద్ధి సహకారాన్నిమరింత ముందుకు తీసుకువెళ్ళేందుకు వైపరీత్యాల నిర్వహణ, వాతావరణ మార్పులపై పోరాటం విభాగాల్లో సామర్థ్యాల నిర్మాణానికి సహకరించుకోవాలని ఉభయ వర్గాలు నిర్ణయించాయి. నౌకాశ్రయాల్లోకి నౌకలు తేలిగ్గా రాకపోకలు సాగించేందుకు వీలుగా నౌరులో మూరింగ్లను మరమ్మత్తు చేయాలని తమ నిపుణులను కోరేందుకు భారత్ అంగీకరించింది.