Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పశ్చిమ బెంగాల్ లోని ‘అమ్ఫాన్’ తుఫాను ప్రభావిత ప్రాంతాల లో విమాన పరిశీలన ను నిర్వహించిన ప్ర‌ధాన మంత్రి

 


‘అమ్ఫాన్’ తుఫాను కారణం గా ఉత్పన్నమైన స్థితి ని సమీక్షించడం కోసం పశ్చిమ బెంగాల్ ను ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు న సందర్శించారు. ఈ యాత్ర లో ప్ర‌ధాన మంత్రి ని కేంద్ర మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్, కేంద్ర సహాయ మంత్రులు శ్రీ బాబుల్ సుప్రియో, శ్రీ ప్రతాప్ చంద్ర సారంగీ లతో పాటు దేబాశ్రీ చౌధరీ కూడా అనుసరించారు. పశ్చిమ బెంగాల్ గవర్నర్ శ్రీ జగ్ దీప్ ధన్ ఖడ్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బనర్జి లతో కలసి ప్ర‌ధాన మంత్రి పశ్చిమ బెంగాల్ లోని తుఫాను బాధిత జిల్లాల ను గగన తలం నుండి పరిశీలించారు.

తదనంతరం, పశ్చిమ బెంగాల్ లో ప్రస్తుతం చేపడుతున్న సహాయ పునరావాస చర్యల ను సమీక్షించడం కోసం రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన మరియు కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఉన్నతాధికారులందరితోను నిర్వహించిన ఒక సమావేశాని కి ప్రధాన మంత్రి అధ్యక్షత వహించారు. తక్షణ సహాయక కార్యకలాపాల కోసం పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వాని కి 1,000 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. రాష్ట్రం నుండి సహాయం తాలూకు విజ్ఞాపన పత్రం అందగానే, రాష్ట్రం లో వాటిల్లిన నష్టం పరిధి ని అంచనా వేయడం కోసం రాష్ట్రాన్ని సందర్శించవలసింది గా ఒక అంతర్ మంత్రిత్వ శాఖ ల బృందాన్ని కేంద్ర ప్రభుత్వం పంపనుంది. ఆ బృందం ఇచ్చే నివేదిక ఆధారం గా మళ్లీ ఆర్థిక సహాయాన్ని అందించడం జరుగుతుంది.

పశ్చిమ బెంగాల్ ప్రజల కు ప్రధాన మంత్రి తన పరిపూర్ణ సంఘీభావాన్ని వ్యక్తం చేశారు. ఈ విపత్తు లో ప్రాణాలు కోల్పోయిన వారి యొక్క కుటుంబాల కు ఆయన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. రాష్ట్రం లో సంభవించిన తుఫాను లో మరణించిన వ్యక్తుల సమీప సంబంధికుల కు 2 లక్షల రూపాయల అనుగ్రహపూర్వక చెల్లింపు ను, అలాగే క్షతగాత్రుల కు 50,000 రూపాయల అనుగ్రహపూర్వక చెల్లింపు ను ప్రధాన మంత్రి ప్రకటించారు.

ఈ కష్ట కాలం లో, రాష్ట్రం తో కేంద్ర ప్రభుత్వం సన్నిహితం గా మెలగుతూ పనిచేస్తుందని రాష్ట్ర ప్రజానీకాని కి ప్రధాన మంత్రి హామీ ని ఇచ్చారు. ప్రభావిత ప్రాంతాల లో మౌలిక సదుపాయాల పునరుద్ధరణ కు మరియు పునర్ నిర్మాణాని కి శాయశక్తుల సహాయాన్ని అందజేస్తుందని కూడా ఆయన తెలిపారు.

ప్రధాన మంత్రి ఈ సంవత్సరం లో పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్ని సందర్శించడం ఇప్పటికి ఇది రెండో సారి. ఆయన ఈ సంవత్సరం లో ఉత్తర్ ప్రదేశ్ మినహా ఒక్క పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్ని మాత్రమే అనేక పర్యాయాలు సందర్శించారు. ప్రధాన మంత్రి ఈ సంవత్సరం లో ఇంతకు ముందు జనవరి నెల 11 వ, 12 వ తేదీ లలో పశ్చిమ బెంగాల్ లో పర్యటించారు. ఆ కాలం లో జరిగిన కోల్ కాతా పోర్ట్ ట్రస్ట్ 150వ వార్షిక ఉత్సవాల కు ఆయన హాజరయ్యారు. కోల్ కాతా లో పునర్ నిర్మాణం పూర్తి అయిన వారసత్వ భవనాలు నాలుగింటి ని ఆ సందర్భం లో దేశ ప్రజల కు ప్రధాన మంత్రి అంకితం చేశారు; మరి అలాగే బెలూర్ మఠ్ ను కూడా ఆయన సందర్శించారు.

**