Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పవిత్ర రోమన్ కేథలిక్ చర్చి కి కార్డినల్ గా మాన్య శ్రీ జార్జి జేకబ్ కూవాకాడ్ ను పరమ పూజ్యులు పోప్ ఫ్రాన్సిస్ నియమించడం సంతోషదాయకం: ప్రధానమంత్రి


పవిత్ర రోమన్ కేథలిక్ చర్చికి కార్డినల్‌గా మాన్య శ్రీ జార్జి జేకబ్ కూవాకాడ్‌ను పరమ పూజ్యులు పోప్ ఫ్రాన్సిస్ నియమించినందుకు సంతోషిస్తున్నానని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో శ్రీ నరేంద్ర మోదీ పొందుపరిచిన ఒక సందేశంలో ఈ కింది విధంగా పేర్కొన్నారు:

‘‘ భారతదేశానికి ఎంతో సంతోషాన్ని ఇచ్చే విషయం ఇది. అంతేకాదు, భారత్‌కు గర్వకారణమైన విషయం కూడా.

పరమ పూజ్యులు పోప్ ఫ్రాన్సిస్ పవిత్ర రోమన్ కేథలిక్ చర్చికి కార్డినల్‌గా మాన్య శ్రీ జార్జి జేకబ్ కూవాకాడ్‌ను నియమించారని తెలిసి చాలా సంతోషం కలిగింది.

మాన్య శ్రీ జార్జి కార్డినల్ కూవాకాడ్ భగవాన్ యేసు క్రీస్తు ప్రబోధాలను తు.చ. తప్పక అవలంబించే అనుయాయుల్లో ఒకరుగా ఉంటూ మానవ జాతికి సేవ చేయడానికి తన జీవనాన్ని అంకితం చేశారు. ఆయన భావి ప్రయత్నాలు సఫలం కావాలని నేను కోరుకుంటూ, ఆయనకు నా శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను.
@Pontifex”

 

 

***

MJPS/SR