Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పవిత్ర బసవ జయంతి సందర్భంగా బసవేశ్వరునికి ప్రధానమంత్రి నివాళి


   సవ జయంతి పవిత్ర పర్వదినం సందర్భంగా జగద్గురు బసవేశ్వరునికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాళి అర్పించారు. అలాగే ఒక విడియో క్లిప్‌ ద్వారా జగద్గురు బసవేశ్వరుని గురించి తన మనోభావాలను శ్రీ మోదీ ప్రజలతో పంచుకున్నారు.

ఈ మేరకు ఒక ట్వీట్‌ ద్వారా పంపిన సందేశంలో:

“నేడు పవిత్ర బసవ జయంతి సందర్భంగా జగద్గురు బసవేశ్వరునికి నివాళి అర్పిస్తున్నాను. మానవాళికి సేవ చేయడంలో ఆయన ఆలోచనలు-ఆదర్శాలు మనకెంతో స్ఫూర్తినిస్తాయి.  అణగారిన వర్గాలకు సాధికారత కల్పన ద్వారా బలమైన, సంపన్న సమాజ నిర్మాణంపై ఆయన విస్పష్ట ప్రబోధం చేశారు.” అని ప్రధాని పేర్కొన్నారు.

అలాగే 2015 నవంబరులో జగద్గురు బసవేశ్వరుని విగ్రహావిష్కరణను ప్రస్తావిస్తూ పార్లమెంటు సభ్యులు శ్రీ శివకుమార్‌ ఉదాసి ట్వీట్‌పై స్పందిస్తూ పంపిన సందేశంలో:

“జగద్గురు బసవేశ్వరులు చూపిన బాటను మేం సదా అనుసరిస్తాం. ఆయనకు నివాళి అర్పించే ఇటువంటి అనేక అవకాశాలు లభించడం నాకు దక్కిన అదృష్టం” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.