Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పర్యాటక రంగంలో సహకారాన్ని పటిష్టపరచుకోవడం కోసం భారతదేశం, కతర్ ల మధ్య ఎమ్ ఒ యు కు మంత్రిమండలి ఆమోద ముద్ర


పర్యాటక రంగంలో సహకారాన్ని బలపరచుకోవడం కోసం ఉద్దేశించిన ఒక అవగాహనపూర్వక ఒప్పంద పత్రం (ఎమ్ ఒ యు) పై సంతకాల ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కేంద్ర మంత్రివర్గ సమావేశానికి అధ్యక్షత వహించారు.

ఎమ్ ఒ యు ప్రధాన లక్ష్యాలు ఈ కింది విధంగా ఉన్నాయి:

1) పర్యాటక రంగంలో పరస్పర ప్రయోజనాల కోసం దీర్ఘకాలిక సహకారానికి అనువైన పరిస్థితులను కల్పిచడం.

2) పర్యాటకానికి సంబంధించిన ప్రావీణ్యం, ప్రచురణలు, సమాచారం మరియు గణాంకాలు పరస్పరం మార్పిడి చేసుకోవడం.

3) కార్యక్రమాల మార్పిడి, ప్రచారం, ఇంకా ప్రకటనల సంబంధిత సామాగ్రి, ప్రచురణలు, ఫిలిమ్స్, ప్రసార మాధ్యమాలలో పర్యాటక ఉత్పత్తుల మార్కెటింగ్, ప్రోత్సాహం ద్వారా సహకారాన్ని పెంపొందింపచేయడం.

4) రెండు వైపులా పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి టూర్ ఆపరేటర్లు, ప్రసార మాధ్యమాలు, ఒపీనియన్ మేకర్స్ పర్యటనలకు రంగం సిద్ధం చేయడం.

5) ఇరు దేశాలలోను పర్యాటక రంగాలు, టూర్ ఆపరేటర్లు, ట్రావెల్ ఏజెంట్లు, ఇంకా ఇతరత్రా టూరిజానికి సంబంధించి ప్రైవేటు రంగంలోని సంస్థలు మరియు బ్యూరోల మధ్య సహకారాన్ని పెంపొందింపచేయడం.

6) పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టేటట్లుగా ప్రభుత్వ, ప్రైవేటు రంగాలను ప్రోత్సహించడం.

భారత దేశానికి పర్యాటక వనరుగా కతర్ పేరు తెచ్చుకుంటోంది (2015 లో కతర్ నుండి ఇంచుమించుగా 6,313 మంది పర్యాటకులు భారత దేశానికి విచ్చేశారు). వైద్య పర్యాటకానికి సంబంధించి భారత దేశానికి కతర్ మంచి మార్కెట్ గా ఉంది. అంతేగాకుండా ఈ రంగంలో భారత దేశానికి కతర్ నుండి విస్తృత అవకాశం లభించనుంది. ఈ ప్రవర్ధమాన మార్కెట్ నుండి టూరిస్టుల రాక మెరుగుపడడంలో కతర్ తో ఎమ్ ఒ యు ప్రముఖ పాత్రను పోషించగలదు.