పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులకు సానుకూలతే ప్రధాన ఆయుధమవుతుందని స్పష్టం చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, రేపు ప్రసారమయ్యే ‘పరీక్షా పే చర్చ’ ఎపిసోడ్ అందరూ చూడాలని కోరారు.
X వేదికగా MyGovIndia చేసిన పోస్ట్‌కు స్పందిస్తూ, శ్రీ నరేంద్ర మోదీ ఇలా పేర్కొన్నారు:
“పరీక్షలకు సన్నద్ధమవుతున్న #ExamWarriors కి సానుకూలతే ప్రధాన ఆయుధం. రేపటి ‘పరీక్షా పే చర్చ‘ ఎపిసోడ్ ఈ అంశాన్ని గురించి మీకు చక్కటి అవగాహన కలిగిస్తుంది, @VikrantMassey, @bhumipednekar పంచుకున్న అభిప్రాయాలను కూడా మీరు తెలుసుకోవచ్చు.”
For #ExamWarriors, among the biggest allies during exam time is positivity. Tomorrow’s ‘Pariksha Pe Charcha’ episode delves into this topic and we have @VikrantMassey and @bhumipednekar share their insights. https://t.co/F1bbYLqZno
— Narendra Modi (@narendramodi) February 15, 2025