ఇండియన్ ఇన్స్ టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ ఎండ్ టెక్నాలజీ (ఐఐఎస్ టి) కి, నెదర్లాండ్స్ కు చెందిన ద డెఫ్ట్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ (టియు డెఫ్ట్) కి చెందిన విద్యార్థులు, ఫేకల్టీ సభ్యుల ద్వారా విద్య సంబంధి కార్యక్రమాల ను, పరిశోధన కార్యకలాపాల ను చేపట్టడానికి గాను ఆ రెండు సంస్థల లోను గత ఏప్రిల్ 9వ తేదీ నాడు మరియు గత మే 17వ తేదీ నాడు సంతకాలు జరిగి, ఇ-మెయిల్ మాధ్యమం ద్వారా ఇచ్చి పుచ్చుకొన్న అవగాహన పూర్వక ఒప్పంద పత్రాని కి (ఎమ్ఒయు) కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది.
ఎమ్ఒయు తాలూకు వివరాలు:
ప్రయోజనాలు:
ఈ ఒప్పందం పై సంతకాలు జరగడం వల్ల ఇక సహకారం పట్ల ఆసక్తి వ్యక్తం అయ్యే ఈ కింది రంగాల లో ముందంజ వేసేందుకు మార్గం సుగమమం అవుతుంది. ఆయా రంగాలు ఏమేమిటి అంటే, ఫేకల్టీ సభ్యుల, విద్యార్థుల, పరిశోధకుల తో పాటు విజ్ఞాన శాస్త్ర సంబంధి సామగ్రి, ప్రచురణలు మరియు సమాచారాన్ని ఒక పక్షానికి మరొక పక్షం ఇచ్చిపుచ్చుకోవడం లో తోడ్పాటు లభించగలదు. కలసి పరిశోధనలకు సంబంధించిన సమావేశాలను నిర్వహించడం, పిహెచ్. డి కార్యక్రమం, రెండేసి డిగ్రీలు/ రెండు డిగ్రీల కార్యక్రమం కూడా.
ఈ ఒప్పందం ద్వారా నెదర్లాండ్స్ కు చెందిన అతి పురాతనమైన మరియు అన్నింటి కంటే పెద్దదైన డచ్ సార్వజనిక సాంకేతిక విజ్ఞాన విశ్వవిద్యాలయం అయినటువంటి ఇడబ్ల్యుఐ, టియూ డెఫ్ట్ తో సహకారానికి పూచీ లభించినందువల్ల విజ్ఞాన శాస్త్రం మరియు సాంకేతిక విజ్ఞాన రంగం లో పరిశోధన పరంగా ఒక సంయుక్త ప్రక్రియ ను అభివృద్ధిపరచేందుకు వీలు చిక్కుతుంది. దీని ద్వారా దేశం లో అన్ని వర్గాల కు, ప్రాంతాల కు లబ్ధి చేకూరుతుంది.
సంతకాలు అయిన ఈ ఒప్పందం ద్వారా విజ్ఞాన శాస్త్రం, సాంకేతిక విజ్ఞాన రంగం లో కొత్త కొత్త పరిశోధక కార్యకలాపాల ను మరియు ఎప్లికేశన్ సంబంధి సంభావనల ను వెదకేందుకు చాలా ప్రోత్సాహం లభించనుంది.
***