Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పరివర్తనాత్మక ‘జన్‌ధన్‌ యోజన’ 9 సంవత్సరాలు పూర్తి చేసుకోవడంపై లబ్ధిదారులకు ప్రధానమంత్రి అభినందన


   పరివర్తనాత్మక ప్రధానమంత్రి జన్‌ధన్‌ యోజన ఇవాళ్టితో 9 సంవత్సరాలు పూర్తి చేసుకోవడంపై ప్రధాని శ్రీ న‌రేంద్ర లబ్ధిదారులందరికీ అభినందనలు తెలిపారు. ఈ పథకం విజయవంతం అయ్యేవిధంగా తమవంతు సహకరించిన వారందరినీ ప్రధాని ఈ సందర్భంగా కొనియాడారు.

ఈ మేరకు ‘ఎక్స్‌’ ద్వారా ‘మైగవ్‌’ పోస్ట్‌ చేసిన సందేశానికి బదులిస్తూ:

“ప్రధానమంత్రి జన్‌ధన్‌ యోజన 9వ వార్షికోత్సవం నేపథ్యంలో ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందిన వారందరినీ నేను అభినందిస్తున్నాను. అలాగే దీన్ని విజయం కోసం కృషిచేసిన ప్రతి ఒక్కరికి నా అభినందనలు. ఇది మన దేశ పౌరులకు సాధికారత కల్పనలో్ వినూత్న కృషి. తద్వారా మేము లక్షలాది మందిని ప్రధాన ఆర్థిక స్రవంతిలోకి తెచ్చాం. వృద్ధిపథంలోగల మన ఆర్థిక వ్యవస్థలో ప్రతి ఒక్కరికీ ఈ పథకం సముచిత స్థానం కల్పిస్తుంది#9YearsofJanDhan” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

 

***

DS