Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పరమ పూజ్య డాక్టర్ శ్రీ శ్రీ శ్రీ శివకుమార స్వామిగళు జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నివాళులు


పరమ పూజ్య డాక్టర్ శ్రీ శ్రీ శ్రీ శివకుమార స్వామిగళు నేడు. ఈ ప్రత్యేక సందర్భంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు నివాళులు అర్పించారు. స్వామీజీ అసాధారణ ప్రయత్నాలను ప్రధాని ప్రశంసిస్తూ కరుణ, అలుపెరుగని సేవలకు  ఆయన ప్రతీకగా నిలిచారన్నారు. నిస్వార్థ సేవ సమాజంలో మార్పును తీసుకురాగలుగుతుందని స్వామీజీ నిరూపించారని ప్రధాని అన్నారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి కొన్ని సందేశాలను పొందుపరుస్తూ:
‘‘పరమ పూజ్య డాక్టర్ శ్రీ శ్రీ శ్రీ శివకుమార స్వామి జీ కి ఆయన జయంతి విశిష్ట సందర్భంలో నేను హృదయ పూర్వక నివాళులు అర్పిస్తున్నాను. కారుణ్యానికి, అలసట ఎరుగని సేవలకు దారిదీపంగా స్వామీజీని స్మరించుకొంటూ ఉంటాం. స్వార్థరహిత సేవా భావన సమాజంలో మార్పును తీసుకురాగలుగుతుందని ఆయన చాటిచెప్పారు. వివిధ రంగాల్లో  ఆయన చేసిన అసాధారణ కృషి తరాల తరబడి ప్రేరణను అందిస్తూనే ఉంటుంది’’ అని పేర్కొన్నారు.

“ಪರಮಪೂಜ್ಯ ಡಾ. ಶ್ರೀ ಶ್ರೀ ಶ್ರೀ ಶಿವಕುಮಾರ ಸ್ವಾಮೀಜಿ ಅವರ ಜಯಂತಿಯ ಈ ವಿಶೇಷ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಅವರಿಗೆ ಹೃತ್ಪೂರ್ವಕ ನಮನಗಳು. ಕಾರುಣ್ಯ ಮತ್ತು ದಣಿವರಿಯದ ಸೇವೆಯ ದಾರಿದೀಪವೆಂದು ಅವರನ್ನು ಸ್ಮರಿಸಲಾಗುತ್ತದೆ. ನಿಸ್ವಾರ್ಥ ಸೇವೆಯು ಸಮಾಜವನ್ನು ಹೇಗೆ ಪರಿವರ್ತಿಸುತ್ತದೆ ಎಂಬುದನ್ನು ಅವರು ತೋರಿಸಿದ್ದಾರೆ. ನಾನಾ ಕ್ಷೇತ್ರಗಳಲ್ಲಿ ಅವರ ಅಸಾಧಾರಣ ಪ್ರಯತ್ನಗಳು ಪೀಳಿಗೆಗಳಿಗೆ ಸ್ಫೂರ್ತಿ ನೀಡುತ್ತಲೇ ಇವೆ.”

******

MJPS/SR