Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పద్మ పురస్కారాలు- 2025 విజేతలకు ప్రధానమంత్రి అభినందనలు


ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2025 సంవత్సరానికి పద్మ పురస్కారాలను గెలుచుకొన్న వారందరికి ఈ రోజు అభినందనలు తెలిపారు. ఈ పురస్కారాలను అందుకోనున్న వారిలో ప్రతి ఒక్కరు కష్టపడి పనిచేస్తూ, వారి వారి రంగాల్లో మక్కువను పెంచుకొంటూ, కొత్త కొత్త ఆలోచనలతో ముందడుగు వేస్తున్నారని, వారిలోని ఈ సద్గుణాలు ఎంతో మంది జీవనంపై సానుకూల ప్రభావాన్ని ప్రసరించాయని ఆయన అన్నారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పొందుపరిచిన ఒక సందేశంలో ఆయన ఇలా పేర్కొన్నారు:

‘‘పద్మ పురస్కారాలను అందుకోబోతున్న వారికందరికి అభినందనలు. వారి అసాధారణ విజయాలను గౌరవిస్తూ పండుగ చేసుకోనుండడం భారత్‌కు గర్వకారణం. వారి అంకితభావంతోపాటు వారి నిరంతర శ్రమ నిజంగానే ప్రేరణాత్మకం. ఈ పురస్కారాలను అందుకోనున్న వారిలో ప్రతి ఒక్కరు కష్టపడి పనిచేసే తత్వానికి, వారి వారి రంగాల్లో నానాటికీ పెంచుకొంటున్న మక్కువకు, నవకల్పనకు మారుపేరుగా నిలుస్తున్నారని చెప్పాలి. వారి ఈ సద్గుణాలు ఎంతో మందిపై సానుకూల ప్రభావాన్ని ప్రసరించాయి.  శ్రేష్ఠత్వాన్ని సాధించాలంటే నిత్యం శ్రమిస్తుండాలని, స్వార్థాన్ని వదలిపెట్టి సమాజానికి సేవలను అందిస్తూ ఉండాలని వారు మనకు నేర్పుతున్నారు.’’  

 

https://www.padmaawards.gov.in/Document/pdf/notifications/PadmaAwards/2025.pdf

 

***

MJPS/SR