ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 17,300 కోట్ల రూపాయల కు పైగా విలువ కలిగినటువంటి అనేక అభివృద్ధి ప్రాజెక్టుల కు తమిళ నాడు లోని తూత్తుక్కుడి లో ఈ రోజు న శంకుస్థాపన చేయడం తో పాటు గా వాటిని దేశ ప్రజల కు అంకితమిచ్చారు. ప్రధాన మంత్రి వి.ఒ. చిదంబరనార్ పోర్టు లో అవుటర్ హార్బర్ కంటైనర్ టెర్మినల్ నిర్మాణాని కి శంకుస్థాపన చేశారు. భారతదేశం లో మొట్టమొదటిసారి గా పూర్తి గా దేశీయం గా రూపొందించిన గ్రీన్ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ఇన్‌లాండ్ వాటర్‌వే వెసల్ ను కూడా ప్రధాన మంత్రి ప్రారంభించారు. 10 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల లో ఉన్న 75 లైట్ హౌస్ లలో యాత్రికుల సదుపాయాల ను ఆయన దేశ ప్రజల కు అంకితం చేశారు. వాంచీ మణియాచ్చి – తిరునెల్‌వేలి సెక్శన్, ఇంకా మేలప్పాలయమ్ – అరళ్‌వాయ్‌మొళి సెక్శన్ లు సహా వాంచీ మణియాచ్చి – నాగర్‌కోయిల్ రైలు మార్గం యొక్క డబ్లింగ్ ప్రాజెక్టుల ను కూడా ఆయన దేశ ప్రజల కు అంకితం చేశారు. సుమారు గా 4,586 కోట్ల రూపాయల మొత్తం ఖర్చు తో తమిళ నాడు లో అభివృద్ధి పరచిన నాలుగు రహదారి ప్రాజెక్టుల ను ప్రధాన మంత్రి దేశ ప్రజల కు అంకితం చేశారు.
సభ ను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, తూత్తుక్కుడి లో ఒక క్రొత్త ప్రగతి అధ్యాయాన్ని తమిళ నాడు లిఖిస్తోంది అన్నారు. అభివృద్ధి చెందినటువంటి భారతదేశం తాలూకు మార్గసూచీ ని సిద్ధం చేసే దిశ లో అనేక అభివృద్ధి ప్రాజెక్టుల కు ప్రారంభోత్సవం మరియు శంకుస్థాపన లు ఈ రోజు న జరిగాయి అని ఆయన అన్నారు. ప్రస్తుతం చేపట్టుకొంటున్న ఈ అభివృద్ధి ప్రాజెక్టుల లో ‘ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్’ తాలూకు భావన ను గమనించవచ్చును అని ఆయన అన్నారు. ఈ ప్రాజెక్టులు తూత్తుక్కుడి లోనివే కావచ్చు, అయినప్పటికీ ఇది భారతదేశం అంతటా అనేక ప్రాంతాల లో అభివృద్ధి కి జోరు ను అందించేదే అని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు.
ప్రధాన మంత్రి వికసిత్ భారత్ యొక్క యాత్ర ను గురించి మరియు ఆ యాత్ర లో తమిళ నాడు పోషించిన పాత్ర ను గురించి పునరుద్ఘాటించారు. రెండు సంవత్సరాల క్రిందట చిదంబరనార్ నౌకాశ్రయం సామర్థ్యాన్ని విస్తరించడం కోసం ఎన్నో ప్రాజెక్టుల కు తాను నాంది ని పలికిన విషయాన్ని, మరి అలాగే ఈ పోర్టు ను నౌకాయానం సంబంధి ప్రధానమైన నిలయం గా తీర్చిదిద్దడం జరుగుతుంది అంటూ తాను ఇచ్చిన వాగ్దానాన్ని ఆయన ఈ సందర్భం లో గుర్తు కు తీసుకు వచ్చారు. ‘‘ఆనాడు ఇచ్చిన హామీ ఈనాడు నెరవేరుతోంది’’ అని ప్రధాన మంత్రి అన్నారు. వి.ఒ. చిదంబరనార్ పోర్టు లో అవుటర్ హార్బర్ కంటైనర్ టర్మినల్ కు శంకుస్థాపన ను గురించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, ఈ ప్రాజెక్టు కోసం 7,000 కోట్ల రూపాయల పెట్టుబడి ని పెట్టడం జరుగుతుంది అని తెలియ జేశారు. ఈ రోజు న దేశ ప్రజల కు అంకితం చేసిన ప్రాజెక్టుల విలువ 900 కోట్ల రూపాయలు, అలాగే 2,500 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టుల ను 13 నౌకాశ్రయాల లో మొదలు పెట్టడం జరిగింది. ఈ ప్రాజెక్టులు తమిళ నాడు కు లబ్ధి ని చేకూర్చడం తో పాటుగా రాష్ట్రం లో ఉద్యోగ అవకాశాల ను కూడా కల్పిస్తాయి అని ఆయన వివరించారు.
వర్తమాన ప్రభుత్వం ఈ రోజు న తీసుకు వస్తున్న అభివృద్ధి ప్రాజెక్టులు ప్రజలు కోరినవే, కానీ మునుపటి ప్రభుత్వాలు వీటి విషయం లో ఎన్నడు శ్రద్ధ తీసుకోలేదు అని ప్రధాన మంత్రి గుర్తుకు తెచ్చారు. ‘‘తమిళ నాడు కు సేవ చేయడం కోసం, మరి ఈ రాష్ట్రం యొక్క భాగ్యాన్ని మార్చడం కోసం నేను ఇక్కడకు వచ్చాను’’ అని ప్రధాన మంత్రి అన్నారు.
హరిత్ నౌక కార్యక్రమం లో భాగం గా భారతదేశం యొక్క ఒకటో హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ఇన్‌లాండ్ వాటర్‌వే వెసల్ ను గురించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, ఇది కాశీ నగరాని కి తమిళ నాడు ప్రజలు అందిస్తున్నటువంటి కానుక అంటూ అభివర్ణించారు. తమిళ నాడు ప్రజల ఉత్సాహాన్ని, మరి వారి ఆప్యాయత ను కాశీ తమిళ్ సంగమం కార్యక్రమం లో కనులారా తిలకించాను అని ఆయన అన్నారు. వి.ఒ. చిదంబరనార్ నౌకాశ్రయాన్ని దేశంలోకెల్లా ప్రప్రథమ గ్రీన్ హైడ్రోజన్ హబ్ పోర్ట్ గా తీర్చిదిద్దడాని కి ఉద్దేశించిన అనేక ఇతర ప్రాజెక్టుల ను ప్రధాన మంత్రి ప్రారంభించారు. ఈ ప్రాజెక్టుల లో ఒక నిర్లవణీకరణ ప్లాంటు, హైడ్రోజన్ ఉత్పత్తి సదుపాయం లతో పాటు బంకరింగ్ ఫెసిలిటీ లు కూడా ఉన్నాయి. ‘‘ప్రపంచం ప్రస్తుతం ఏ ప్రత్యామ్నాయాల కోసం వెతుకుతోందో వాటిలో తమిళ నాడు చాలా ముందుకు పోతుంది’’ అని ఆయన అన్నారు.
నేటి రైలు మరియు రహదారి సంబంధి అభివృద్ధి ప్రాజెక్టుల ను గురించి కూడా ప్రధాన మంత్రి ప్రముఖం గా ప్రకటిస్తూ, రైలు మార్గాల విద్యుతీకరణ మరియు డబ్లింగు పనుల తో తమిళ నాడు లోని దక్షిణ ప్రాంతాని కి, కేరళ కు మధ్య సంధానం మరింత గా మెరుగు పడుతుంది; అంతేకాకుండా తిరునెల్‌వేలి, ఇంకా నాగర్‌కోయిల్ క్షేత్రాల లో రాకపోకల లో రద్దీ కూడా తగ్గుతుంది అని వివరించారు. తమిళ నాడు లో 4,000 కోట్ల రూపాయల కు పైగా విలువైన రహదారుల ఆధునికీకరణ సంబంధి ప్రధాన ప్రాజెక్టులు నాలుగింటిని ఈ రోజు న చేపట్టిన విషయాన్ని సైతం ప్రధాన మంత్రి ప్రస్తావించారు. వీటితో కనెక్టివిటీ కి ప్రోత్సాహం లభించడం, యాత్ర కు పట్టే కాలం తగ్గడం తో పాటుగా రాష్ట్రం లో వ్యాపారం మరియు పర్యటన రంగాల కు ప్రోత్సాహం అందుతుంది అని ప్రధాన మంత్రి అన్నారు.
‘న్యూ ఇండియా’ లో పూర్తి ప్రభుత్వం దృష్టికోణాన్ని గురించి ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, తమిళ నాడు లో మెరుగైన సంధానాన్ని మరియు మెరుగైన అవకాశాల ను కల్పించడం కోసం రహదారులు, హైవేస్ మరియు జల మార్గాల విభాగాలు కలసికట్టుగా కృషి చేస్తున్నాయి అన్నారు. ఈ కారణం గా రైల్‌వే స్, రహదారులు మరియు మేరిటైమ్ ప్రాజెక్టుల ను ఒకేసారి ప్రారంభించుకొంటున్నట్లు ఆయన చెప్పారు. బహుళ విధాలైనటువంటి పద్ధతి రాష్ట్రం లో అభివృద్ధి కి సరిక్రొత్త గతి ని అందిస్తుంది అని ప్రధాన మంత్రి అన్నారు.
దేశం లో ప్రధానమైనటువంటి లైట్ హౌస్ లను పర్యటన స్థలాలు గా అభివృద్ధి పరచాలంటూ ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’ ) కార్యక్రమం లోని ఎపిసోడ్ లలో ఒక ఎపిసోడ్ లో తాను చేసిన సూచన ను ప్రధాన మంత్రి గుర్తు కు తీసుకు వస్తూ, పది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో 75 లైట్ హౌస్ ల లో యాత్రికుల సదుపాయాల ను దేశ ప్రజల కు అంకితం చేస్తున్నందుకు గర్వపడుతున్నట్లు చెప్పారు. ‘‘ఒకే సారి 75 ప్రాంతాల లో అభివృద్ధి కార్యక్రమాలు చోటుచేసుకొన్నాయి, ఇది కదా న్యూ ఇండియా’’ అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యాఖ్యానించి, ఈ 75 ప్రదేశాలు రాబోయే కాలాల్లో చాలా పెద్ద పర్యటక కేంద్రాలు గా మారిపోతాయన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
Speaking at inauguration and foundation stone laying ceremony of various development works in Thoothukudi.https://t.co/xthaafMBuW
— Narendra Modi (@narendramodi) February 28, 2024
Today, Tamil Nadu is writing a new chapter of progress in Thoothukudi.
Many projects are being inaugurated or having foundation stones laid: PM @narendramodi pic.twitter.com/Z8NsYdVfBM
— PMO India (@PMOIndia) February 28, 2024
Tamil Nadu will play a crucial role in India’s journey of becoming a ‘Viksit Bharat’. pic.twitter.com/9s9uno0nET
— PMO India (@PMOIndia) February 28, 2024
Today, the country is working with the ‘whole of government’ approach. pic.twitter.com/QNcRHViFIx
— PMO India (@PMOIndia) February 28, 2024
***
DS/TS
Speaking at inauguration and foundation stone laying ceremony of various development works in Thoothukudi.https://t.co/xthaafMBuW
— Narendra Modi (@narendramodi) February 28, 2024
Today, Tamil Nadu is writing a new chapter of progress in Thoothukudi.
— PMO India (@PMOIndia) February 28, 2024
Many projects are being inaugurated or having foundation stones laid: PM @narendramodi pic.twitter.com/Z8NsYdVfBM
Tamil Nadu will play a crucial role in India's journey of becoming a 'Viksit Bharat'. pic.twitter.com/9s9uno0nET
— PMO India (@PMOIndia) February 28, 2024
Today, the country is working with the 'whole of government' approach. pic.twitter.com/QNcRHViFIx
— PMO India (@PMOIndia) February 28, 2024
The truth is bitter but it must be told!
— Narendra Modi (@narendramodi) February 28, 2024
UPA, which was headed by Congress and had DMK as a key partner delayed Tamil Nadu’s development. pic.twitter.com/0nBOi2YEE9
People of Tamil Nadu appreciate the development of NDA government but the DMK Government does not allow the media to highlight the positive work done. Shameful! pic.twitter.com/C01B6I9SX5
— Narendra Modi (@narendramodi) February 28, 2024
உண்மை கசப்பாக இருந்தாலும் சொல்ல வேண்டியது கட்டாயம்!
— Narendra Modi (@narendramodi) February 28, 2024
திமுக முக்கிய அங்கம் வகித்த காங்கிரஸ் தலைமையிலான ஐக்கிய முற்போக்குக் கூட்டணி அரசு தமிழ்நாட்டின் வளர்ச்சியைத் தாமதப்படுத்தியது. pic.twitter.com/lXbMv84Fod
தேசிய ஜனநாயக கூட்டணி அரசு மேற்கொண்டு வரும் வளர்ச்சிப் பணிகளை தமிழக மக்கள் பாராட்டினாலும், அதை ஊடகங்கள் அவற்றிற்கு முக்கியத்துவம் அளிக்க திமுக அரசு அனுமதிப்பதில்லை. இழிவானசெயல்! pic.twitter.com/Et1Mhwmht4
— Narendra Modi (@narendramodi) February 28, 2024