Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పట్నా లో ప్రజా రవాణాకు మరియు సంధానాని కి ఊతం


పట్నా లో ప్రజారవాణా కు, సంధానానికి ఊతాన్ని ఇచ్చేందుకు 13,365.77 కోట్ల రూపాయల వ్యయం తో రెండు కారిడార్ లు (దానాపుర్- మిఠాపుర్, పట్నా జంక్షన్- న్యూ ఐఎస్‌టిటి)గా నిర్మించేందుకు ప్రతిపాదించిన మెట్రో రైల్ ప్రాజెక్టు కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది.

ప్రాజెక్టు వివరాలు:

•    ఈ ప్రాజెక్టు ను ఐదు సంవత్సరాల లో పూర్త‌ి చేయడం జరుగుతుంది.

•    దానాపుర్ నుండి మిఠాపుర్ కంటోన్మెంట్ మార్గం కారిడార్ ప‌ట్నా న‌గ‌రం నడిబొడ్డు నుండి వెళ్తుంది.  జ‌న‌స‌మ్మ‌ర్దం గ‌ల ర‌జా బ‌జార్‌, స‌చివాల‌యం, ఉన్నత న్యాయస్థానం, న్యాయ విశ్వవిద్యాల‌యం రైల్వేస్టేశన్ ప్రాంతాల‌ ను ఇది జోడిస్తుంది.

•    ప‌ట్నా జంక్ష‌న్ నుండి ఐఎస్‌బిటి కారిడార్ మార్గం గాంధీ మైదాన్‌, పిఎంసిహెచ్‌, ప‌ట్నా విశ్వ‌విద్యాల‌యం, రాజేంద్ర‌న‌గ‌ర్‌, మ‌హాత్మ గాంధీ సేతు, ట్రాన్స్‌పోర్ట్ న‌గ‌ర్‌, ఐఎస్‌బిటి ల‌ను క‌లుపుతూ వెళ్తుంది.

•    ఈ మెట్రో రైలు ప్రాజెక్టు ప‌ర్యావ‌ర‌ణ స్నేహపూర్వకంగా ఉంటూ ఆయా ప్రాంతాల నివాసులకు, ప్రయాణికుల కు, పారిశ్రామిక కార్మికులకు, సంద‌ర్శ‌కులకు మరియు ఇతర యాత్రికులకు ప్ర‌జా ర‌వాణా సౌకర్యాన్ని క‌ల్పిస్తుంది. 

పట్నా మెట్రో ప్రాజెక్టు ముఖ్యాంశాలు:

i.    దానాపుర్ నుండి మిఠాపుర్ కారిడార్ పొడ‌వు 16.94 కి.మీ.  ఇందులో అధిక‌ శాతం (11.20 కి.మీ.) భూగ‌ర్భం గుండా వెళ్తుంది.  మరికొంత దూరం (5.48 కి.మీ.) భూమి కి నిర్దిష్ట ఎత్తు గ‌ల మార్గం లో వెళ్తుంది.  ఈ రెండు కేంద్రాల మ‌ధ్య 11 స్టేశన్ లు ఉంటాయి. 3 స్టేశన్ లు ఎత్త‌యిన ప్రదేశం లో, మరో 8 స్టేశన్ లు భూగ‌ర్భం లో ఉంటాయి.

ii.    ప‌ట్నా స్టేష‌న్ నుండి న్యూ ఐఎస్‌బీటీ కారిడార్ పొడ‌వు 14.45 కిలోమీట‌ర్లు కాగా, ఇందులో అధిక‌శాతం (9.9 కి.మీ.) భూమి కి నిర్దిష్ట ఎత్తు లో, పాక్షికం గా (4.55 కి.మీ.) భూగ‌ర్భం గుండా వెళ్తుంది. ఈ మార్గంలోని మొత్తం 12 స్టేష‌న్‌ికుగాను 9 ఎత్త‌యిన ప్ర‌దేశాల్లో, 3 భూగ‌ర్భం లో ఉంటాయి.

ప‌ట్నా నగర పరిధి లో ప్రస్తుత జనాభా 26.23 లక్షలు కాగా, పట్నా మెట్రో రైలు ప్రాజెక్టు వల్ల ఈ జనసంఖ్య మొత్తానికీ ప్రత్యక్ష, పరోక్ష ప్రయోజనాలు చేకూరుతాయని అంచనా.

మంత్రిమండలి ఆమోదం పొందిన ఈ రెండు కారిడార్ల లో సంఘటిత, సమ్మిశ్ర రవాణా సదుపాయం ఉంటుంది.  ఇందులో రైల్వే స్టేశన్ లు, ఐఎస్‌బిటి స్టేశన్ సహా బస్సు లు, మధ్యతరహా ప్రజా రవాణా (IPT), మానవ చోదిత రవాణా (NMT) సదుపాయాలన్నీ భాగం గా ఉంటాయి.  వీటన్నింటి ని ఏకీకృతం చేసే రవాణా ఆధారిత ప్రగతి (TOD), ప్రగతి హక్కుల బదిలీ (TDK) యంత్రాంగాల ద్వారా అద్దె లు, ప్రకటన లు, విలువ ఆపాదిత పెట్టుబడులు వంటి మార్గాలలో చార్జీయేతర ఆదాయం లభిస్తుంది.  

ఈ మెట్రో రైలు కారిడార్ ల వెంబడి  ఉన్న నివాస ప్రాంతాల కు ఈ ప్రాజెక్టు వల్ల అత్యధిక లబ్ధి చేకూరనుంది.  ముఖ్యం గా పరిసర ప్రాంతాల కు, నగరం లోని వివిధ ప్రాంతాల కు ఈ రైలు ప్రయాణం తో సులువు గా చేరగలిగే సదుపాయం అందుబాటు లోకి వస్తుంది.

**