పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ వర్ధంతి సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు స్మృత్యంజలిని ఘటించారు.
“పండిత్ దీన్ దయాళ్ గారు మనకు స్ఫూర్తిమూర్తిగా నిలుస్తున్నారు. నిస్వార్థ సేవాగుణం ఆయనకు సహజంగానే అబ్బింది. దేశానికి, పేదలకు సేవ చేయడానికి ఆయన జీవితాన్ని అంకితం చేశారు.
సమాజంలోని కడపటి వ్యక్తికి సైతం సేవ చేయాలన్న పండిత్ దీన్ దయాళ్ గారి ‘అంత్యోదయ’ భావనకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది.
ఒక రాజకీయ నిర్వాహకునిగా పండిత్ దీన్ దయాళ్ గారి మార్గదర్శక ప్రావీణ్యాలను కూడా నేను ఈ సందర్భంగా జ్ఞాపకానికి తెచ్చుకుంటున్నాను. దేశం కోసం జీవితాలను అర్పించే లాగా ఎంతో మంది కార్యకర్తలను ఆయన సన్నద్ధుల్ని చేశారు.
ఆ మహనీయునికి ఇవే నా వినయపూర్వక నివాళులు” అని ట్విటర్ లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
My tributes to Pandit Deendayal Upadhyaya on his Punya Tithi. pic.twitter.com/IEaOVPHsxB
— Narendra Modi (@narendramodi) February 11, 2016