పండిత్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ శత జయంతి ఉత్సవాల నిర్వహణ కోసం రెండు కమిటీల ఏర్పాటును ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆమోదించారు.
ఇందులో 149 మంది సభ్యులు ఉన్న జాతీయ కమిటీకి ప్రధాన మంత్రి అధ్యక్షత వహిస్తారు. అలాగే, 23 మంది సభ్యులు ఉన్న కార్యనిర్వహకవర్గ కమిటీకి హోం మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ నాయకత్వం వహిస్తారు.
జాతీయ కమిటీ సభ్యులలో పూర్వ ప్రధానులు శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి, శ్రీ హెచ్.డి. దేవె గౌడ, కేంద్ర మంత్రులు శ్రీ రాజ్ నాథ్ సింగ్, శ్రీమతి సుష్మ స్వరాజ్, శ్రీ అరుణ్ జైట్లీ, శ్రీ మనోహర్ పర్రీకర్, పూర్వ ఉప ప్రధాని శ్రీ ఎల్.కె. అద్వానీ మరియు బి జె పి అధ్యక్షుడు శ్రీ అమిత్ షా ఉన్నారు.
బీహార్ ముఖ్యమంత్రి శ్రీ నితీశ్ కుమార్, కేంద్ర వ్యవసాయ శాఖ మాజీ మంత్రి శ్రీ శరద్ పవార్, రాజ్య సభ సభ్యుడు శ్రీ శరద్ యాదవ్, యోగా గురువు శ్రీ బాబా రాందేవ్, గీత రచయిత శ్రీ ప్రసూన్ జోషి, సినీ దర్శకుడు శ్రీ చంద్రప్రకాశ్ ద్వివేది, పూర్వ హాకీ క్రీడాకారుడు శ్రీ ధన్‌రాజ్ పిళ్లై, పూర్వ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు- శిక్షకుడు శ్రీ పుల్లెల గోపీచంద్ మరియు సులభ్ ఇంటర్ నేషనల్ వ్యవస్థాపకుడు శ్రీ బిందేశ్వర్ పాఠక్ లను జాతీయ కమిటీలోకి తీసుకున్నారు. భారతదేశ పూర్వ ప్రధాన న్యాయమూర్తి శ్రీ ఆర్.సి. లాహోటీ, విశ్రాంత ఎయిర్ చీఫ్ మార్షల్ శ్రీ ఎస్. కృష్ణస్వామి, రాజ్యాంగ నిపుణుడు శ్రీ సుభాశ్ కశ్యప్ మరియు పర్యావరణవేత్త శ్రీ సి.పి. భట్ లను కూడా జాతీయ కమిటీలోకి తీసుకున్నారు. కమిటీలో అనేక మంది గవర్నర్లు, ముఖ్యమంత్రులు, శాస్త్రవేత్తలు, పాత్రికేయులు, విద్యావేత్తలు, సంఘ సేవకులు మరియు ఆధ్యాత్మిక నాయకులు సభ్యులుగా ఉన్నారు.
కేంద్ర సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) డాక్టర్ మహేశ్ శర్మ కమిటీకి కన్వీనర్‌గా వ్యవహరిస్తారు.