Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పంజాబ్ లోని గురుదాస్ పుర్ లో గ‌ల డేరా బాబా నాన‌క్ లో ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగం పాఠం


వాహే గురూ జీ కా ఖాల్ సా,

వాహే గురూ జీ కీ ఫతెహ్ ।

మిత్రులారా,

ఈ ప‌విత్ర‌మైన భూమి కి విచ్చేసినందుకు ఈ రోజు న నేను ఎంతో భాగ్య‌శాలిన‌ని అనుకొంటున్నాను.  కర్ తార్ పుర్ సాహిబ్ కారిడ‌ర్ ను దేశ ప్ర‌జల కు ఈ రోజు న నేను అంకితం చేస్తుండ‌టం నాకు ద‌క్కినటువంటి సౌభాగ్యం.  ‘క‌ర్ సేవా’ వేళ మీలో క‌లిగిన అనుభూతినే ప్ర‌స్తుతం నేను కూడా పొందుతున్నాను.  మీ అంద‌రి కి, యావ‌త్తు దేశ ప్ర‌జ‌ల కు, ప్ర‌పంచవ్యాప్తం గా సిఖ్ఖు సోద‌రీమ‌ణుల కు మ‌రియు సోద‌రుల కు ఇవే నా అభినంద‌న‌లు.

ఈ రోజు న శిరోమ‌ణి గురు ద్వారా ప్ర‌బంధ‌క్ క‌మిటీ ‘కౌమీ సేవా అవార్డు’ను నాకు ప్ర‌దానం చేసింది.  ఈ పుర‌స్కారం.. ఈ స‌మ్మానం.. ఈ గౌరవం.. మ‌న గొప్ప‌దైన‌టువంటి సంతు ల సంప్ర‌దాయాని కి చెందిన భ‌వ్య‌త్వం, త్యాగం మ‌రియు త‌ప‌స్సు ల యొక్క వ‌ర‌దానం అని నేను అంటాను.  ఈ పుర‌స్కారాన్ని, ఈ యొక్క స‌మ్మానాన్ని గురు నాన‌క్ దేవ్ జీ చ‌ర‌ణాల లో సమర్పిస్తున్నాను.

ఈ రోజు న, ఈ పావ‌న భూమి లో గురు నాన‌క్ సాహిబ్ పాదాల వ‌ద్ద గురు గ్రంథ్ సాహిబ్ స‌మ‌క్షం లో నేను నా అంత‌రంగం లోని సేవా భావ‌న అనుదిన‌మూ పెంపొందాల ని, వారి యొక్క దీవెన‌ లు నాకు ఈ మాదిరి గా ల‌భిస్తూనే ఉండాల‌ని స‌విన‌యం గా నేను ప్రార్థిస్తున్నాను.

మిత్రులారా,

గురు నాన‌క్ దేవ్ జీ యొక్క 550వ ప్ర‌కాశ్ ఉత్స‌వ్ క‌న్నా ముందు కర్ తార్ పుర్ సాహిబ్ కారిడ‌ర్ తాలూకు ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ ను ఆరంభించుకోవ‌డం మ‌న అంద‌రి లో సంతోషాన్ని రెట్టింపు చేసింది.  ఈ కార్తీక పౌర్ణ‌మి ఘ‌డియ‌ల లో దేవ్‌-దివాలీ మ‌రింత దేదీప్య‌మాన‌మై, మ‌న అంద‌రి ని ఆశీర్వ‌దిస్తుంది.

సోద‌రీమ‌ణులు మ‌రియు సోద‌రులారా,

ఈ కారిడ‌ర్ ను నిర్మించిన అనంత‌రం గురు ద్వారా ద‌ర్ బార్ సాహిబ్ ను ద‌ర్శించుకోవ‌డం సుల‌భ‌త‌రం గా మారుతుంది.  ఈ కారిడ‌ర్ ను మ‌న‌ వైపు నుండి నిర్ణీత కాలం లో నిర్మించిన శ్రామికులు అందరి కీ శిరోమ‌ణి గురు ద్వారా ప్ర‌బంధ‌క్ క‌మిటీ కి మ‌రియు పంజాబ్ ప్ర‌భుత్వాని కి నేను ధ‌న్య‌వాదాలు ప‌లుకుతున్నాను.

కర్ తార్ పుర్ కారిడ‌ర్ కు సంబంధించిన భార‌తదేశ భావోద్వేగాల ను మ‌న్నించి త‌ద‌నుగుణం గా ప్ర‌తిస్పంద‌న ను వ్య‌క్తం చేసినందుకు పాకిస్తాన్ ప్ర‌ధాని శ్రీ ఇమ్రాన్ ఖాన్ నియాజీ కి కూడా నేను ధ‌న్య‌వాదాలు ప‌లుకుతున్నాను.  కారిడ‌ర్ ను వారి వైపు నుండి ఇంత వేగం గా పూర్తి చేయ‌డం లో తోడ్పాటు ను అందించిన పాకిస్తాన్ కు చెందిన శ్రామిక మిత్రుల కు కూడా నేను ధ‌న్య‌వాదాలు పలుకుతున్నాను.

మిత్రులారా,

గురు నాన‌క్ దేవ్ జీ భార‌త‌దేశం యొక్క వారసత్వం మ‌రియు సిఖ్ఖు ధ‌ర్మం యొక్క వార‌స‌త్వం మాత్రమే కాదు.  వారు యావ‌త్తు మాన‌వాళి కే ఒక ప్రేర‌ణ గా నిల‌చారు.  గురు నాన‌క్ దేవ్ అనేది ఒక భావ స్ర‌వంతి.  అంతేకాదు, ఆయ‌న ఒక ఉపాధ్యాయుడు కావ‌డం తో పాటు, జీవనాధారం కూడాను.  మ‌న సంస్కారం, మన సంస్కృతి, మన విలువ‌ లు, మ‌న పెంప‌కం, మ‌న మ‌న‌స్త‌త్వం, మ‌న భావాలు, మన తర్కం మ‌రియు మ‌నం ఆడే మాటలు.. ఇవి అన్నీ గురు నాన‌క్ దేవ్ జీ వంటి పుణ్యాత్ముల ద్వారా ఆకృతి ని దాల్చాయి.  గురు నాన‌క్ దేవ్ సుల్ తాన్ పుర్ లోధీ నుండి యాత్ర‌ కు బ‌య‌లుదేరిన వేళ లో వారు ఒక యుగాన్ని మార్చ‌బోతున్నారన్న సంగతి ఎవ‌రి కి తెలుసును?  వారి యొక్క ‘ఉదాసియాన్‌’, వారి యాత్ర లు, వారి బోధ‌న‌ లు మ‌రియు వారి స‌మ‌న్వ‌యం తో సామాజిక ప‌రివ‌ర్త‌న తాలూకు ప‌రిపూర్ణ ఉదాహ‌ర‌ణ‌లు గా ఉన్నాయి.

గురు నాన‌క్ దేవ్ జీ త‌న యాత్ర‌ ల యొక్క ఉద్దేశ్యాన్ని స్వ‌యం గా ఇలా ప్ర‌వ‌చించారు –

बाबे आखिआ, नाथ जी, सचु चंद्रमा कूडु अंधारा !!

कूडु अमावसि बरतिआ, हउं भालण चढिया संसारा అని.

మిత్రులారా,

వారు మ‌న దేశాన్ని, మ‌న స‌మాజాన్ని చెడు, అన్యాయం మ‌రియు దుర‌భ్యాసాల బారి నుండి బ‌య‌ట‌కు తీసుకు రావ‌డం కోసం వారి యొక్క ప్ర‌స్థానాన్ని మొద‌లు పెట్టారు.  ఆ క‌ష్ట కాలం లో, భార‌త‌దేశం దాస్యాని కి లోనై ఉన్న‌టువంటి స‌మ‌యం లో, భార‌తీయ చేతన ను మేల్కొల్ప‌డం కోసం మ‌రియు దాని ని ఆదుకోవ‌డం కోసం వారు వారి యొక్క జీవ‌నాన్నే స‌మ‌ర్ప‌ణం చేశారు.

మిత్రులారా,

ఒక వైపు గురు నాన‌క్ దేవ్ జీ సామాజిక త‌త్వం ద్వారా స‌మాజాని కి ఏక‌త‌, సౌభ్రాతృత్వం మ‌రియు సౌహార్ద మార్గాల ను చూపించారు.  మ‌రొక వైపు వారు స‌త్యం, నిజాయ‌తీ మ‌రియు ఆత్మ గౌర‌వం ల పై ఆధార‌ప‌డిన ఒక ఆర్థిక వ్య‌వ‌స్థ ను స‌మాజాని కి అందించారు.  వారు స‌త్యం మ‌రియు నిజాయ‌తీ ల ద్వారా అభివృద్ధి ని సాధించ‌వ‌చ్చని మ‌న‌కు బోధించారు.  అటువంటి అభివృద్ధి స‌దా ప్ర‌గ‌తి కి మ‌రియు స‌మృద్ధి కి దోవ ను చూపుతుంది.  డ‌బ్బు వ‌స్తూ ఉంటుంది- వెళ్తూ ఉంటుంది కానీ, నిజమైన విలువ‌ లు అనేవి ఎప్ప‌టి కీ నిల‌చిపోతాయి అని వారు మ‌న‌కు నేర్పారు.  మ‌నం మ‌న విలువ‌ల ను స్థిరం గా నిలుపుకొనే దిశ గా కృషి చేసిన‌ట్ల‌యితే స‌మృద్ధి నిలుక‌డ గా ఉండి పోతుంద‌ని వారు మ‌న‌కు ప్ర‌వ‌చించారు.

సోద‌రీమ‌ణులు మ‌రియు సోద‌రులారా,

కర్ తార్ పుర్ అనేది గురు నాన‌క్ దేవ్ జీ యొక్క క‌ర్మ భూమి మాత్ర‌మే కాదు. గురు నాన‌క్ దేవ్ జీ యొక్క స్వేదం కర్ తార్ పుర్ లోని ప్ర‌తి అణువు తో మిళిత‌మై ఉంది.  వారి యొక్క వాణి కర్ తార్ పుర్ లోని గాలి లో మారుమోగుతున్నది.  కర్ తార్ పుర్ గ‌డ్డ మీద నాగలి ని న‌డ‌ప‌డం ద్వారా వారు త‌మ మొద‌టి నియ‌మం అయిన‌టువంటి –  ‘కిరత్ క‌రో’ తాలూకు నిద‌ర్శ‌నాన్ని ప్ర‌దానం చేశారు;  ఈ నేల మీద వారు ‘నామ్ జపో’ తాలూకు రీతి ని ప్ర‌ద‌ర్శించారు.  మ‌రి క‌ఠోర శ్ర‌మ తో పండించిన పంట‌ల ను అంతా పంచుకొని భుజించే ఆన‌వాయితీ ని వారు ఆరంభించింది ఈ గ‌డ్డ మీద‌నే.  వారు ‘వండ్ ఛకో’ మంత్రాన్ని కూడా ఇచ్చారు.

మిత్రులారా,

ఈ ప‌విత్ర‌మైన ప్ర‌దేశం కోసం మ‌నం ఎంత చేసినా, అది అంత తక్కువగానే ఉండిపోతుంది.  ఈ కారిడ‌ర్, ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టు వేలాది భ‌క్త జ‌నుల‌ ను అనునిత్యం గురుద్వారా దర్ బార్ సాహిబ్ చెంత‌ కు చేరుస్తూ, సేవ‌లు అందిస్తూ ఉంటుంది.  ప‌దాలు శ‌క్తి రూపం లో వాతావ‌ర‌ణం లో విరాజిల్లుతుంటాయ‌ని అంటూ ఉంటారు.  కర్ తార్ పుర్ నుండి ప్ర‌స‌రించే గురు బాణి యొక్క శ‌క్తి కేవలం మ‌న సిఖ్ఖు సోద‌రీమ‌ణుల కు మ‌రియు సోద‌రుల‌ కు ఆశీర్వాదాలను అందించ‌డమే కాక భార‌త‌దేశం లో  ప్ర‌తి ఒక్క‌రి కి కూడాను దీవెన‌ల‌ ను అందిస్తుంది.

మిత్రులారా,

గురు నాన‌క్ దేవ్‌ జీ కీ ఇద్ద‌రు అత్యంత స‌న్నిహిత అనుయాయులు ఉండే వారు అని, వారే భాయీ లాలో మ‌రియు భాయీ మ‌ర్‌దానా లు అని మ‌న‌కు అంద‌రి కి ఎంతో బాగా తెలుసును.  ఈ ఇద్ద‌రు వ్య‌క్తుల ను ఎంపిక చేసుకొన్న త‌రువాత నానక్ దేవ్ జీ మ‌న‌కు ఏమ‌ని సందేశం ఇచ్చారు అంటే అది పేద‌ కు మ‌రియు ధ‌న‌వంతుని కి న‌డుమ ఎటువంటి భేదం లేదు ప్ర‌తి ఒక్క‌రు స‌మాన‌మే అనేదే.  మ‌నం అంద‌ర‌మూ క‌ల‌సి ఎటువంటి వివ‌క్ష కు తావు ఇవ్వ‌కుండా ప‌ని చేసిన‌ప్పుడు పురోగ‌తి త‌థ్యం అని ఆయ‌న బోధించారు.

సోద‌రీమ‌ణులు మ‌రియు సోద‌రులారా,

గురు నాన‌క్ త‌త్వం ఒక్క మాన‌వాళికే ప‌రిమితం కాలేదు.  ప్ర‌కృతి యొక్క ప్రాముఖ్యాన్ని గురించి వారు మ‌న‌తో చెప్పింది ఈ కర్ తార్ పుర్ లోనే.  వారు అన్నారు-

पवणु गुरू, पाणी पिता, माता धरति महतु। అని.

ఈ మాట‌ల కు- వాయువు ను మీ గురువు గా ఎంచండి, జ‌లాని కి మీ యొక్క తండ్రి వ‌లే అంత‌టి ప్రాముఖ్యాన్ని ఇవ్వండి, మ‌రి భూమి కి మీ యొక్క త‌ల్లి గారి వ‌లె గౌర‌వాన్ని ఇవ్వండి- అని భావం.  ఈ రోజు న మ‌నం ప్ర‌కృతి, ప‌ర్యావ‌ర‌ణం ల దోపిడీ ని గురించి మ‌రియు కాలుష్యాన్ని గురించి మాట్లాడుకొనే సంద‌ర్భం లో గురువు గారి సందేశం మ‌నం అనుస‌రించ‌వ‌ల‌సిన మార్గాని కి ఒక ఆధారం గా నిలబడుతుంది.

మిత్రులారా,

మీరు ఒకసారి ఆలోచన చేయండి, మ‌న గురువు గారు ఎంత‌టి దీర్ఘ దృష్టి ని క‌లిగిన వారు అనేది.  అది కూడాను, పంజాబ్ (పంచ న‌దులు)లో నీరు పుష్క‌లం గా ఉన్న కాలం లో; ఆ కాలం లోనే గురు దేవులు జ‌లాని కి సంబంధించిన త‌న ఆందోళ‌న ను వెల్లడించారు.  వారు అన్నారు-

पहलां पानी जिओ है, जित हरिया सभ कोय। అని.

ఈ మాట‌ల కు- జ‌లాని కి స‌దా పెద్ద పీట వేయాలి- అని భావం.  ఎందుకంటే, ఒక్క జ‌ల‌మే యావ‌త్తు సృష్టి కి ప్రాణాన్ని ధార‌ పోస్తుంది.  వంద‌లాది సంవ‌త్స‌రాల క్రితం వ్య‌క్త‌మైన‌టువంటి ఈ దార్శ‌నిక‌త ను గురించి ఒక్క‌ సారి ఆలోచ‌న చేయండి.  ప్ర‌స్తుతం మ‌నం జ‌లాని కి ప్రాధాన్యాన్ని ఇవ్వ‌డాన్ని విస్మ‌రించిన‌ప్ప‌టి కి, మ‌రి ప్ర‌కృతి ప‌ట్ల‌, ప‌ర్యావ‌ర‌ణం ప‌ట్ల నిర్ల‌క్ష్యం గా వ్య‌వ‌హ‌రిస్తూ ఉన్నప్ప‌టి కి గురువు గారి వాణి మ‌న‌కు ప‌దే ప‌దే వెనుక‌ కు తిరిగి చూసుకోండి అని, అలాగే ఈ పుడ‌మి మ‌న‌కు ఇచ్చిన వాటి ని ఎప్ప‌టి కి జ్ఞాప‌కం పెట్టుకోండి అని ప‌దే ప‌దే చెప్తూ వ‌స్తున్నది.

మిత్రులారా,

గ‌డ‌చిన అయిదు సంవ‌త్స‌రాల కాలం లో మేము మ‌న యొక్క సుసంప‌న్న‌మైన‌టువంటి గ‌త కాలం భార‌త‌దేశాని కి అందించిన ప్ర‌తి ఒక్క‌ దాని ని ప‌రిర‌క్షించాల‌ని, దాని ని యావ‌త్తు ప్ర‌పంచాని కి ఇవ్వాల‌ని చూసే దిశ గా కృషి చేస్తున్నాము.  గురు నాన‌క్ దేవ్ జీ యొక్క 550వ ప్ర‌కాశ్ ప‌ర్వ్ ఉత్స‌వాలు గ‌డ‌చిన ఒక సంవ‌త్స‌రం కాలం గా జ‌రుగుతూ వ‌స్తున్నాయి.  అవి ఈ ఆలోచ‌న లో ఒక భాగం.  దీని ప్రకారం భార‌త‌దేశాని కి చెందిన దౌత్య కార్యాల‌యాలు, హై క‌మిశన్ కార్యాల‌యాలు, ప్ర‌పంచం అంత‌టా చ‌ర్చా స‌భ‌ల ను మ‌రియు ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాల ను నిర్వ‌హిస్తున్నాయి.  గురు నాన‌క్ దేవ్ జీ యొక్క స్మార‌క నాణేల ను మ‌రియు త‌పాలా బిళ్ళ‌ల ను కూడా వారి జ్ఞాప‌కార్థం జారీ చేయ‌డం జ‌రిగింది.

మిత్రులారా,

గురు నాన‌క్ దేవ్ జీ యొక్క ప్ర‌భోదాల ను గురించి దేశ విదేశాల లో కీర్త‌న‌ లు, క‌థ‌ లు, ప్ర‌భాత ఫేరీ లు మ‌రియు లంగ‌ర్ ల వంటి కార్య‌క్ర‌మాల ద్వారా ప్ర‌చారం లోకి తీసుకొని రావ‌డం జ‌రిగింది.  ఇది వ‌ర‌కు గురు గోవింద్ సింహ్ జీ యొక్క 350వ ప్ర‌కాశోత్స‌వాన్ని కూడాను ప్ర‌పంచ వ్యాప్తం గా ఘ‌నం గా జ‌రుపుకోవ‌డ‌మైంది.  ప‌ట్‌ నా లోనే జ‌రిగినటువంటి ఒక భ‌వ్య‌మైన కార్య‌క్ర‌మాని కి వెళ్ళే భాగ్యం నాకు ద‌క్కింది.  ఆ ప్ర‌త్యేక సంద‌ర్భం లో ఒక స్మార‌క నాణేన్ని మ‌రియు 350 రూపాయ‌ల విలువైన త‌పాలా బిళ్ళ ను కూడా విడుద‌ల చేయ‌డ‌మైంది.  ఈ సంద‌ర్భాని కి సూచ‌కం గా గుజ‌రాత్ లోని జామ్ న‌గ‌ర్ లో అధునాత‌న‌మైన 750 ప‌డ‌క‌ల తో ఒక ఆసుప‌త్రి ని వారి పేరిట నిర్మించ‌డం జ‌రిగింది.  త‌ద్వారా, గురు గోవింద్ సింహ్ గారి ని స్మ‌రించుకోవడం తో పాటు, వారి యొక్క సందేశాన్ని అమ‌ర‌ంగా ఉంచాల‌నేదే దీని వెనుక ఉన్న ఉద్దేశ్యం.

సోద‌రీమ‌ణులు మ‌రియు సోద‌రులారా,

గురుబాణి ని ప్ర‌పంచం లోని వివిధ భాషల లోకి అనువాదం చేయ‌డం జ‌రుగుతోంది.  త‌ద్వారా ప్ర‌పంచ న‌వ‌ త‌రం సైతం గురు నాన‌క్ యొక్క బోధ‌న‌ల తో ప‌రిచితులు కాగ‌లుగుతారు.  ఈ కార‌ణం గా నేను ఇక్క‌డ యూనెస్కో కు నా యొక్క కృత‌జ్ఞ‌త ను వ్య‌క్తం చేయాల‌నుకొంటున్నాను.  ఇది కేంద్ర ప్ర‌భుత్వం యొక్క అభ్య‌ర్థ‌న ను ఆమోదించినందుకు.  గురు నాన‌క్ దేవ్ జీ యొక్క రచనల ను వివిధ భాష‌ల లోకి అనువ‌దించ‌డం లో యూనెస్కో కూడా స‌హాయాన్ని అందిస్తున్న‌ది.

మిత్రులారా,

గురు నాన‌క్ దేవ్ జీ కి మ‌రియు ఖాల్‌సా పంథ్ కు సంబంధించిన ప‌రిశోధ‌న‌ల ను ప్రోత్స‌హించ‌డం కోసం యుకె లోని ఒక‌ విశ్వవిద్యాలయం లో పీఠాల‌ ను నెల‌కొల్ప‌డ‌మైంది.  కెన‌డా లో కూడా ఇటువంటిదే ఒక ప్ర‌య‌త్నం జ‌రుగుతూ ఉన్న‌ది.  ఈ విధం గానే అమృత్‌ స‌ర్ లో వివిధ ధ‌ర్మాల విశ్వ‌విద్యాల‌యాన్ని ఏర్పాటు చేసి, త‌ద్వారా వివిధ‌త్వాని కి మ‌రియు స‌ద్భావ‌న కు మాన్య‌త ను కల్పించాలని మరియు ప్రోత్సాహాన్ని ఇవ్వాలని నిర్ణ‌యించ‌డం జ‌రిగింది.

సోద‌రీమ‌ణులు మ‌రియు సోద‌రులారా,

నూత‌న త‌రాల కు చెందిన‌ వారు మ‌న గురువుల తో అనుబంధం క‌లిగిన ముఖ్య ప్ర‌దేశాల లోకి వారు అడుగిడిన వెనువెంట‌నే స‌ద‌రు వార‌స‌త్వం తో ఇట్టే జ‌త‌ప‌డేట‌ట్టు చూసేందుకు త‌గిన ప్ర‌య‌త్నాల ను చేప‌ట్టడం జ‌రుగుతోంది.  ఇక్క‌డ సుల్ తాన్‌ పుర్ లోధీ లో మీరు ఇటువంటి ప్ర‌యాస‌ల ను వీక్షించ‌వ‌చ్చు.  సుల్ తాన్‌ పుర్ లోధీ ని ఒక వార‌స‌త్వ ప‌ట్ట‌ణం గా తీర్చిదిద్దే కృషి సాగుతున్న‌ది.  అది హెరిటేజ్ కాంప్లెక్స్ కావ‌చ్చు, సంగ్ర‌హాల‌యం కావ‌చ్చు, లేదా ప్ర‌ద‌ర్శ‌నశాల కావ‌చ్చు, అటువంటివి ఎన్నో ప‌నులు అయితే పూర్తి కావ‌డ‌మో, లేదా త్వ‌ర‌లో పూర్తి కానుండ‌ట‌మో జ‌రిగాయి.  ఇక్క‌డి రైల్వే స్టేశన్ నుండి న‌గ‌రం లోని ఇత‌ర ప్రాంతాల కు వెళ్ళిన‌ప్పుడు మ‌నం గురు నాన‌క్ దేవ్ జీ యొక్క ఉత్త‌రదాయిత్వాన్ని గ‌మ‌నించ‌వ‌చ్చు.  గురు నాన‌క్ దేవ్ జీ తో అనుబంధం క‌లిగిన ప్ర‌దేశాలు అన్నింటి గుండా సాగే ఒక ప్ర‌త్యేక రైలు ను కూడా వారం లో అయిదు రోజుల పాటు న‌డ‌ప‌టం జ‌రుగుతోంది.  దీని ద్వారా భ‌క్తులు ప్ర‌యాణించ‌డం లో ఎటువంటి స‌మ‌స్య ను ఎదుర్కోబోరు.

సోద‌రీమ‌ణులు మ‌రియు సోద‌రులారా,

దేశం అంత‌టా విస్త‌రించిన‌టుంటి సిఖ్ఖు ల ముఖ్య ప్ర‌దేశాల మ‌ధ్య సంధానాన్ని ప‌టిష్ట‌ ప‌ర‌చ‌డం కోసం కూడాను కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నాలు చేసింది.  శ్రీ అకాల్ త‌క్త్ , దమ్ దామా సాహిబ్, కేశ్‌గ‌ఢ్ సాహిబ్‌, ప‌ట్‌ నా సాహిబ్‌, ఇంకా హ‌జూర్ సాహిబ్ ల మ‌ధ్య రైలు మార్గాన్ని మరియు వాయు త‌ల సంధానాని కి శ్ర‌ద్ధ తీసుకోవ‌డ‌మైంది.  అమృత్‌ స‌ర్ కు మ‌రియు నాందేడ్ కు మ‌ధ్య ప్ర‌త్యేక విమాన స‌ర్వీసు లు కూడా మొద‌ల‌య్యాయి.  అదేవిధం గా అమృత్ స‌ర్ నుండి లండ‌న్ కు రాక‌ పోక‌ లు జ‌రిపే ఎయ‌ర్ ఇండియా విమానాల మీద ‘ఇక్ ఓంకార్‌’ అనే సందేశాన్ని వ్రాయడం జరిగింది.

మిత్రులారా,

కేంద్ర ప్ర‌భుత్వం మ‌రొక ముఖ్య నిర్ణ‌యాన్ని తీసుకుంది.  ప్ర‌పంచ‌ వ్యాప్తం గా స్థిర‌ప‌డిన సిఖ్ఖు కుటుంబాల కు ఎన్నింటికో ఈ నిర్ణ‌యం ద్వారా ల‌బ్ధి చేకూరింది.  సంవత్సరాల తరబడి కొంత మంది కి భార‌త‌దేశాని కి వ‌చ్చిన ప్పుడు ఏ స‌మ‌స్య‌లు అయితే ఎదురయ్యాయో, ప్ర‌స్తుతం ఆ ఇబ్బందుల ను దూరం చేయ‌డం జ‌రిగింది.  ఈ నిర్ణ‌యం తో ఎన్నో కుటుంబాలు ప్ర‌స్తుతం ఒసిఐ కార్డుల కోసం మ‌రియు వీజా ల కోసం ద‌ర‌ఖాస్తు పెట్టుకొనేందుకు అవ‌కాశం ఏర్ప‌డింది.  వారు భార‌త‌దేశం లోని త‌మ బంధువుల తో సుల‌భం గా భేటీ కావచ్చును.  అంతేకాదు, ఇక్క‌డి గురువు ల తాలూకు ప్ర‌దేశాల ను సంద‌ర్శించి, అర్ దారస్ ను కూడా వారు స‌మ‌ర్పించ‌వ‌చ్చును.

సోద‌రీమ‌ణులు మ‌రియు సోద‌రులారా,

కేంద్ర ప్ర‌భుత్వం యొక్క మ‌రో రెండు నిర్ణ‌యాల నుండి కూడా సిఖ్ఖు స‌ముదాయం ల‌బ్ధి ని పొందింది.  370వ అధిక‌రణం ర‌ద్దు తో జ‌మ్ము, క‌శ్మీర్‌, ఇంకా ల‌ద్దాఖ్ ల‌ లోని సిఖ్ఖు కుటుంబాలు, ఇంకా భార‌త‌దేశం లోని మిగ‌తా ప్రాంతాల లో వారు పొందే హ‌క్కుల ను పొంద‌గ‌లుగుతారు.  ఇంత కాలం గా వేలాది కుటుంబాలు అనేక హ‌క్కుల కు దూరం గా ఉండిపోవ‌ల‌సి వ‌చ్చింది.  ఇదే మాదిరి గా మ‌న సిఖ్ఖు సోద‌రీమ‌ణులు మ‌రియు సోద‌రులు కూడాను పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ బిల్లు నుండి ఒక భారీ ప్ర‌యోజ‌నాన్ని సైతం పొంద‌గ‌లుగుతారు.  వారు భార‌త‌దేశ పౌర‌స‌త్వాన్ని సులువుగా ద‌క్కించుకోగ‌లుగుతారు.

మిత్రులారా,

గురు నాన‌క్ దేవ్ జీ మొద‌లుకొని గురు గోవింద్ సింహ్ జీ వ‌ర‌కు ప్ర‌తి ఒక్క గురు సాహిబ్ భార‌త‌దేశం యొక్క ఏక‌త కోసం, భార‌త‌దేశం యొక్క ప‌రిర‌క్ష‌ణ కోసం మ‌రియు భార‌త‌దేశం యొక్క భ‌ద్ర‌త కోసం ఎన్నో త్యాగాలు చేశారు.  అలాగే, అలుపెర‌గ‌ని ప్ర‌య‌త్నాల ను కూడా వారు చేశారు.  స్వాతంత్య్ర పోరాటం లో, మ‌రి అలాగే స్వ‌తంత్ర భార‌త‌దేశ ర‌క్ష‌ణ లో ఇదే సంప్ర‌దాయాన్ని సిఖ్ఖు సహచరులు సంపూర్ణ‌మైనటువంటి ఉత్సాహం తో అనుస‌రించారు.  దేశం కోసం ప్రాణాల ను అర్పించిన వారి స‌మ‌ర్ప‌ణ భావాన్ని స‌త్క‌రించుకోవ‌డం కోసం ప్ర‌భుత్వం కూడాను అనేక అర్థ‌వంత‌మైనటువంటి నిర్ణ‌యాల‌ ను తీసుకొన్నది.  ఈ సంవ‌త్స‌రం లో జ‌లియాఁవాలా బాగ్ మారణకాండ యొక్క 100 సంవ‌త్స‌రాల ఘ‌ట్టాన్ని స్మ‌రించుకొంటున్నాము.  దీనితో అనుబంధం క‌లిగిన‌టువంటి స్మృతి చిహ్నాన్ని న‌వీక‌రించ‌డం జ‌రుగుతోంది.  సిఖ్ఖు యువ‌త కు నైపుణ్యాల ను సంత‌రించి, వారి కి స్వ‌తంత్రోపాధి క‌ల్ప‌న కోసం మ‌రియు సిఖ్ఖు పాఠ‌శాల ల కోసం ప్ర‌భుత్వం ప్ర‌త్యేక శ్ర‌ద్ధ వ‌హిస్తోంది.  గ‌డచిన అయిదు సంవ‌త్స‌రాల కాలం లో సుమారు గా 27 ల‌క్ష‌ల మంది సిఖ్ఖు విద్యార్థుల కు వివిధ ఉప‌కార వేత‌నాల ను ఇవ్వ‌డ‌మైంది.

సోద‌రీమ‌ణులు మ‌రియు సోద‌రులారా,

మ‌న గురు ప‌రంప‌ర, సాధు ప‌రంప‌ర‌, సంత్ ల ప‌రంప‌ర సవాళ్ళ ను వేరు వేరు కాలాల లో ఎదుర్కొనేందుకు మార్గాల ను సూచించాయి.  వారు చూపిన మార్గాలు అప్ప‌టి మాదిరి గానే నేటి కి కూడా సార్థకం గా నిల‌చాయి.  దేశ ప్ర‌జ‌ల ఐక‌మ‌త్యం కోసం మ‌రియు జాతీయ చైత‌న్యం కోసం ప్ర‌తి ఒక్క గురువు, ప్ర‌తి ఒక్క సంతు మ‌న‌వి చేశారు.  మ‌న గురువు లు మ‌రియు సంత్ లు మూఢ న‌మ్మ‌కాని కి, స‌మాజం లోని దురాచారాల కు, కుల విభేదాల కు, వ్య‌తిరేకం గా వారి గ‌ళాల ను బిగ్గ‌ర గా వినిపించారు.

మిత్రులారా,

గురు నాన‌క్ అనే వారు-

“विच दुनिया सेवि कमाइये, तदरगिह बेसन पाइए”। అని.

ఈ మాట‌ల‌ కు- ప్ర‌పంచం లో సేవా ప‌థాన్ని అనుస‌రించ‌డం ద్వారా మాత్ర‌మే జీవ‌నం స‌ఫ‌లం అవుతుంది- అని భావం.  ఈ ప‌విత్ర‌మైన‌టువంటి మ‌రియు ముఖ్య‌మైన‌టువంటి వేదిక మీది నుండి మ‌నం మ‌న జీవితాల లో గురు నాన‌క్ చెప్పిన మాట‌ల ను ఒక భాగం గా చేసుకొంటాం అనే ఒక ప్ర‌తిజ్ఞ ను స్వీక‌రిద్దాము.  స‌మాజం లో స‌ద్భావ‌న ను నెల‌కొల్పేందుకు మ‌నం స‌క‌ల ప్ర‌యత్నాల ను చేద్దాము.  భార‌త‌దేశాని కి చేటు చేసే శ‌క్తుల ప‌ట్ల మ‌నం అప్ర‌మ‌త్తుల‌మై ఉందాము.  మ‌న‌ం స‌చేత‌నం గా మెల‌గుదాము.  మ‌న స‌మాజాన్ని గుల్ల‌బారేట‌ట్లు చేసే మత్తు ప‌దార్థాల సేవ‌నం వంటి అల‌వాటుల కు మ‌నం దూరం గా ఉందాము.  మ‌రి అలాగే, వాటి బారి న ప‌డ‌కుండా భ‌విష్య‌త్తు త‌రాల ను కాపాడుతాము.  ప‌ర్యావ‌ర‌ణం తో మ‌మేకం కావ‌డం వ‌ల్ల అభివృద్ధి ప‌థం లో ప‌య‌నించ‌గ‌లుగుతాము.  గురు నాన‌క్ అందించిన‌టువంటి ఈ ప్రేర‌ణ ఈ రోజు కు కూడా ను మాన‌వాళి సంక్షేమాని కి మ‌రియు ప్ర‌పంచ శాంతి కి ప్రాసంగికం గా ఉంది.

नानक नाम चढ़दी कला, तेरे भाणे सरबत दा भला !!!

మిత్రులారా,

కర్ తార్ పుర్ సాహిబ్ కారిడర్ కు గాను యావ‌త్తు ప్ర‌పంచం లో వ్యాపించిన సిఖ్ఖు స్నేహితుల కు, మీకు అంద‌రి కీ మ‌రియు యావ‌త్తు దేశాని కి మ‌రొక్క‌ మారు నా అభినంద‌న‌లు.  గురు నాన‌క్ దేవ్ జీ 550వ ప్ర‌కాశోత్స‌వ్ ను పుర‌స్క‌రించుకొని ఇవే నా శుభాకాంక్ష‌లు.  గురు గ్రంథ్ సాహిబ్ స‌మ‌క్షం లో నిలబడివున్న నాకు ఈ ప‌విత్ర కార్యం లో పాలు పంచుకొనే అవ‌కాశం ల‌భించింది.  దీనికి గాను న‌న్ను నేను భాగ్య‌శాలి నని తలపోస్తూ మీ అంద‌రి కి శిర‌స్సు వంచి ప్రణామమాచరిస్తున్నాను-

సత్ నామ్ శ్రీ వాహే గురూ।

సత్ నామ్ శ్రీ వాహే గురూ।

సత్ నామ్ శ్రీ వాహే గురూ।